జీరో అయ్యాను అనుకున్నా.. గుండె పగిలేలా ఏడ్చిన అవినాష్
బిగ్ బాస్ హౌజ్ లో ఎప్పటికప్పుడు ఎలిమినేషన్స్ లో లెక్కలు మారుతూ ఉంటాయని మరోసారి క్లారిటీగా అర్ధమయ్యింది. గతంలో హౌజ్ నుంచి బయటకి వచ్చిన వారు ఏలిమినెషన్ విధానంపై ఒక రేంజ్ లో నెగిటివ్ కామెంట్స్ చేశారు. ఇక ఈ సారి అమ్మా రాజశేఖర్ చాలా కూల్ గానే బయటకు వెళ్లినట్లు అర్ధమయ్యింది. గత వారమే అనుకోకుండా సేవ్ అయిన మాస్టర్ ఈ సారి ఆశలు వదిలేసుకున్నట్లు అర్ధమయ్యింది. ఇక చివరలో అవినాష్ సేవ్ అయినప్పటికీ ఎంతగానో ఏడ్చాడు.

వెళ్లిపోయేది నేనే అంటూ..
చివరగా మిగిలిన అమ్మా రాజశేఖర్ వెళ్లిపోక తప్పలేదు. మాస్టార్, అవినాష్ లలో ఎవరో ఒకరు గార్డెన్ ఏరియాలోని బూత్ లో నుంచి డైరెక్ట్ గా నాగ్ దగ్గరకు వెళ్లిపోవాల్సి ఉంటుంది. అయితే వెళ్లే క్రమంలో మాస్టర్ కి విషయం అర్ధమయ్యింది. వెళ్లిపోయేది నేనే అంటూ తేల్చి చెప్పేశాడు. ఇక ఎక్కడ అవినాష్ వెళ్లిపోతాడోనని కన్నీరు పెట్టుకుంది అరియానా.

ఒక్క క్షణం గుండె ఆగిపోయిందని
ఇక సేవ్ అయినట్లు తెలియగానే అవినాష్ బోరున విలపించాడు. ఒక్క క్షణం గుండె ఆగిపోయిందని చాలానే ఏడ్చాడు. సాధారణంగా సేవ్ అయితే ఎవరైనా సరే ఆనందంతో సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ అవినాష్ ఎందుకు అలా ఎదుస్తున్నావ్ అని నాగార్జున అడిగినప్పుటికీ ఒక్క క్షణం అవినాష్ నోట మాట రాలేదు. కిందపడి దండం పెడుతూ ఎంతగానో ఏడ్చాడు.

మళ్ళీ జీరో అయ్యానని అనిపించింది
ఎంతో కష్టపడ్డా కూడా కొన్నిసార్లు ఫలితం దక్కదు. ఇక అవినాష్ కూడా ఎలిమినేషన్ వరకు రావాల్సిన అవసరం లేకపోయినా కూడా డేంజర్ జోన్ కో ఉండడం షాకింగ్ విషయమనే చెప్పాలి. అదే అవినాష్ కు బాధ కలిగించింది. మళ్ళీ జీరో అయ్యానని అనిపించింది అంటూ ఒక్కసారిగా గుండె ఆగినంత పని అయ్యిందని నాగార్జునకు దండం పెడుతూ ఎడ్చేశాడు.

అరియానా కూడా ఎమోషనల్
ఇక అవినాష్ మాటలకు వల్ల కొంత సేపు అలానే ఉండిపోయిన నాగ్ అతన్ని ఉత్తేజపరిచాడు. ఇంకా గేమ్ బాగా ఆడాలని కోరారు. ఇక అవినాష్ విషయంలో ప్రతిసారి అరియానా ఇన్వాల్వ్ మెంట్ ఉంటోంది. అతను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా అరియానా దూరం పెట్టడం లేదు. ఇక సోమవారం ఎలిమినేషన్ లో అమ్మా రాజశేఖర్ వెళ్లిపోతాడాని అందరూ భావించినప్పటికీ చివరి నిమిషం వరకు ఏం జరుగుతుందో తెలియదని కొంత ఆందోళన చెందింది అరియానా. అవినాష్ వెళ్లిపోతాడేమోనని గుండె బద్దలైనట్లు పర్ఫెమెన్స్ ఇచ్చింది.


Click it and Unblock the Notifications











