మటన్ పాడు చేసిన అవినాష్.. చితకబాదిన అరియనా, మెహబూబ్
బిగ్ హౌజ్ 4లో గత వారం డేంజర్ జోన్ లో ఉండి చివరి నిమిషంలో అవినాష్ సేవ్ అయిన విషయం తెలిసిన. అమ్మా రాజశేఖర్ తో పాటు డబుల్ ఎలిమినేషన్ లో బయటకు వెళ్లిపోతాడేమోనని అంతా అనుకున్నారు. కానీ చివరి నిమిషంలో నాగార్జున ఇచ్చిన ట్విస్టుతో మళ్ళీ హౌజ్ లోకి వచ్చాడు. ఇక గురువారం ఎపిసోడ్ లో అవినాష్ హౌజ్ మెంట్స్ ని మటన్ విషయంలో నిరాశపరిచాడు.

అవినాష్ పై అనుమానాలు
కెప్టెన్ గా కూడా కొనసాగిన అవినాష్ హౌజ్ లో ఉన్న వారిని పెద్దగా ఇబ్బంది పెట్టలేదు గాని టాస్కుల విషయంలో మాత్రం హంగామా గట్టిగానే చేశాడు. అమ్మా రాజశేఖర్ ఉన్నప్పుడు సీక్రెట్ టాస్కులతో ఊహించని విధంగా దెబ్బ కొట్టిన విషయం తెలిసిందే. దీంతో అప్పటి నుంచి అవినాష్ ఎప్పుడు ఎలాంటి ఇరకాటంలో పడేస్తాడేమోనని కంటెస్టెంట్స్ అనుమానంతో చూస్తున్నారు.

ఆ మాత్రం కూడా తెలియదా
ఇక మటన్ తినాలని ఎంతో ఆశగా ఎదురుచూసిన కంటెస్టెంట్స్ ని అవినాష్ నిరుత్సాహపరిచాడు. రేషన్ మేనేజర్ గా ఉన్న అవినాష్ మటన్ ను డీ ఫ్రిడ్జ్ లో పెట్టాలని తెలియక నార్మల్ ఫ్రిడ్జ్ లోనే పెట్టేశాడు. ముందే ఆ విషయం కొందరికి చెప్పానని అరిచినప్పటికి.. ఆ మాత్రం విషయం కూడా తెలియదా అంటూ సోహైల్ నవ్వుతూనే కౌంటర్ ఇచ్చేశాడు.

అవినాష్ పరువు తీసేశారు
సీక్రెట్ టాస్క్ చేసినా చేస్తాడు అంటూ మరో అనుమానం వ్యక్తం చేయడంతో మెహబూబ్ అయితే సరదాగా కొడుతూనే రివెంజ్ తీర్చుకున్నాడు. అరియానా, సోహైల్ కూడా కలిసి అవినాష్ పై పడి సరదాగా కొట్టడం స్టార్ట్ చేశారు. కనీసం ఈ విషయం తెలియకుండా ఎలా ఉన్నావ్ అంటూ అతని పరువు తీశారు. ఇక అరియానా అయితే తన మాటలతో పొడుస్తూనే ఉంది.
Recommended Video

కేజీ మటన్ పంపండి బిగ్ బాస్
నెక్స్ట్ వీక్ మాటన కారాణంతో నామినేట్ చేసేలా ఉన్నారు బిగ్ బాస్.. నా పరువు పోతుంది. మళ్ళీ మరో కేజీ మటన్ పంపండి ప్లీజ్ అంటూ కెమెరా ముందుకు వచ్చి వేడుకున్నాడు. అరియానా కూడా అతన్ని గట్టిగానే వేసుకుంది. సీక్రెట్ టాస్క్ పూర్తి చేశాడు అంటూ సోహైల్ కి అబద్ధం చెప్పడంతో అవినాష్ ని స్విమ్మింగ్ పూల్ లో ఉంచి కొంత సేపటివరకు చుక్కలు చూపించారు. ఇక చివరకు లాస్యను రేషన్ మేనేజర్ ని చేయడం బెటర్ అనే నినాదాలు ఎక్కువగా వినిపించాయి.


Click it and Unblock the Notifications











