అరియానాను ఇమిటేట్ చేసిన అవినాష్.. పగలబడి నవ్విన అఖిల్-సోహెల్
నామినేషన్‌లోకి వస్తామో ఏమో.. ఎలిమినేట్ అవుతామో ఏమో అని ఎంత భయం ఉంటుందో.. ఎంత ఆందోళన చెందుతారో.. సేవ్ అయ్యారని తెలిస్తే అంత సంతోషపడతాడు. అయితే ఆ సంతోషాన్ని ఒక్కొక్కరు ఒక్కోలా ప్రదర్శిస్తారు. అయితే కొందరి ఎగ్జైట్మెంట్ అతిలా అనిపిస్తుంది. అందులో అరియానానే నెంబర్ వన్ స్థానంలో ఉంటుంది. ఆమె సేవ్ అయిన ప్రతీసారి చేసే అతి మామూలుగా ఉండదు.
ఆమె సేవ్ అయ్యాక చేసే యాక్షన్ ఎలా ఉంటుందో నిన్నటి ఎపిసోడ్‌లో అవినాష్ చేసి చూపించాడు. కిచెన్ రూంలో అందరూ కూర్చున్నారు..ఆ సమయంలో సోహెల్ అవినాష్‌లు అందర్నీ ఇమిటేట్ చేశాడు. అవినాష్.. సోహెల్ అఖిల్ అరియానాలను ఇమిటేట్ చేశాడు. దాంతో పాటు సోహెల్.. అవినాష్‌ను ఇమిటేట్ చేయడం కూడా బాగానే వైరల్ అయింది. అమ్మ రాజశేఖర్ ఎలిమినేట్ అయి అవినాష్ సేవ్ అయిన క్షణంలో భోరున ఏడ్చిన ఘటనను ఇమిటేట్ చేశాడు సోహెల్.

ఇక అఖిల్ ఎలాంటి ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తాడో.. అవినాస్ చేసి చూపించాడు. అందులో భాగంగా అవినాష్ మోనాల్‌ను హగ్ చేసుకున్నాడు. ఆ తరువాత అరియానా అతిని ఇమిటేట్ చేశాడు అవినాష్. సేవ్ అయ్యానని తెలిస్తే అరియానా ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్ వేసే పచ్చి గంతులను అవినాష్ చేసి చూపించాడు. నేను అలా చేస్తానా? అని అరియానా అవినాష్ మీద ఫైర్ అయింది. మరో వైపు అవినాష్ ఇమిటేషన్‌ను చూసి సోహెల్ అఖిల్ పగలబడి నవ్వేశారు.


Click it and Unblock the Notifications











