అవినాష్‌ను ఛీకొట్టిన అరియానా.. ఐలవ్‌యూ చెప్పిన దివి
బిగ్‌బాస్ నాల్గో సీజన్‌లో వంద శాతం వినోదాన్ని పంచే కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా? అంటే అది కేవలం అవినాష్ మాత్రమే. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాసరే అందర్నీ నవ్వించే ప్రయత్నమే చేస్తాడు. వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ఆలస్యంగా ఇంట్లోకి వచ్చినా కూడా అందరితోనూ కలిసిపోయాడు. ఈ నాల్గో సీజన్‌లో మొదటి సారిగా ఇచ్చిన సీక్రెట్ టాస్క్‌ను విజయవంతంగా పూర్తి చేసేశాడు. ఎవ్వరికీ ఏ మాత్రం అనుమానం రాకుండా అది కూడా ఫన్ క్రియేట్ చేస్తూ టాస్క్‌లో సక్సెస్ అయ్యాడు.

ప్రతీ టాస్క్‌లోనూ అంతే..
అవినాష్ ప్రతీ టాస్క్‌లోనూ అంతే. గతవారంలో అద్దం టాస్క్ ఇచ్చినప్పుడు కూడా ఎంతో వినోదాత్మకంగా సాగించాడు. అందరిపై సెటైర్లు వేస్తూ హెల్డీ కామెడీతో నవ్వించే ప్రయత్నం చేశాడు. హర్ట్ అయిన వారి దగ్గరకు వెళ్లి ఓదార్చాడు. అలా ప్రతీసారి అవినాష్ తన వంతుగా వంద శాతం ప్రయత్నిస్తాడు.

సీక్రెట్ టాస్క్‌లోనూ అలాగే..
సీక్రెట్ టాస్క్‌లో అవినాష్ ఎంతో చాకచక్యం ప్రదర్శించాడు. బిగ్ బాస్ హోటల్ టీంలో సభ్యుడిగా ఉంటూనే వారికే వెన్నుపోటు పొడవాలి.. కనీసం పది సేవలను చెడగొట్టాలని బిగ్ బాస్ చెప్పాడు. అలా హోటల్ సిబ్బంది ఇచ్చిన సేవలను ఉప్పు కారం ఎక్కువగా, జడ పిన్నులు వేసి చెడగొట్టాడు. కానీ ఎవ్వరికీ అనుమానం రాకుండా చేసేశాడు.

నేటి ఎపిసోడ్‌లో అలా..
ఇక నేటి ఎపిసోడ్‌లో అవినాష్ బిగ్‌బాస్ అవతారమెత్తాడు. బిగ్ బాస్ ఆవాహయామి అంటూ అందరూ ఊగిపోయారు. ఆ దెబ్బకు అవినాష్‌కు బిగ్ బాస్ పూనాడు. ఇక ఇంటి సభ్యులందరూ తమకున్న కోరికలు, అనుమానాలను బిగ్ బాస్ రూపంలో ఉన్న అవినాష్‌ను అడిగేశారు.

చీ కొట్టిన అరియానా...
టాస్క్‌లో అవినాష్ ఎలా ఆడాడంటూ అంటూ అరియానా అడిగింది. బాగా ఆడాడంటూ తనని తానే పొగుడుకున్నాడు అవినాష్. దీంతో అరియానా ఛీ కొట్టింది. ఇక ఈ వయసులోనూ బాగా ఆడుతున్నావంటూ అమ్మ రాజశేఖర్‌ను పొగిడాడు. నోయల్ నీ కాలు ఎలా ఉంది అని అవినాష్ అడిగాడు. మరి బాగా ఉంటే అలా ఎందుకు నడుస్తున్నావ్ అంటూ కౌంటర్ వేశాడు.
Recommended Video

ఐ లవ్యూ చెప్పిన దివి..
అనంతరం దివి ఐ లవ్యూ చెప్పింది. అయితే అది బిగ్ బాస్ రూపంలో ఉన్న అవినాష్‌కు అయినా.. తనకే చెప్పిందన్నట్టుగా అవినాష్ ఫీలయ్యాడు. ఇక ఆ వెంటనే హారిక ముద్దు పెట్టేసరికి ఆ ఆనందం అంతా ఉసూర్‌మనిపించినట్టు నిట్టూర్చాడు. మొత్తానికి అవినాష్ నేటి ఎపిసోడ్‌లో ఓ రేంజ్‌లో ఎంటర్టైన్ చేయబోతోన్నట్టు కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications











