Don't Miss!
- News మే 10న అక్షయ తృతీయ.. ఈ రాశులపై కనక వర్షం
- Technology ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- Sports ఆర్సీబీ తుది జట్టు అంచనా
- Finance Tata Sons IPO: టాటా సన్స్ ఐపీఓ వస్తుందా.. రాదా..!
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Automobiles హ్యుందాయ్ ఎక్స్టర్ దిమ్మ తిరిగే మైలేజ్.. ఓనర్ ఫుల్ ఖుష్.. ఫొటోలతో సహా ప్రూఫ్ ఇదిగో.!!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
అవినాష్ మాటకు అరియానా షాక్.. అమ్మ రాజశేఖర్ సైలెంట్‌గా వెళ్లిపోయాడు
బిగ్ బాస్ డే కేర్ సెంటర్ టాస్క్‌లో ఒక్క చాక్లెట్ ఎంత పెద్ద రచ్చను క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. అమ్మ రాజశేఖర్ హారిక మధ్య మొదలైన ఈ గొడవ బిగ్ బాస్ ఇంటిని గందరగోళంగా మార్చిన సంగతి తెలిసిందే. అమ్మ రాజశేఖర్ జేబులో చేయి పెట్టి హారిక చాక్లెట్ దొంగతనం చేయడం, మాస్టర్ కూడా హారిక నిక్కర్లో చేయి పెట్టి లాక్కోవడం జరిగింది. అయితే ఈ ఘటనలో మోనాల్, మిగతా ఇంటి సభ్యులు అమ్మ రాజశేఖర్‌ను వద్దని వారించారు. ఆమె చేసినప్పుడు తప్పని చెప్పని లేదు తాను చేసినప్పుడు మాత్రం ఎలా చెబుతారని ఫైర్ అయ్యాడు.
జేబులోంచి చాక్లెట్ బయటకు కనిపించింది అందుకే దొంగతనం చేశాను అని హారిక చెబుతోంది. జేబు లోపలికి మొత్తం చేతులు పెట్టేసిందని అమ్మ రాజశేఖర్ చెబుతున్నాడు. ఇదే విషయంలో అవినాష్, అరియానా వద్దకు వచ్చి చెప్పుకున్నాడు. తాను వేసుకున్న షార్ట్ ఇదేనని, ఇందులోనే చేతులు లోపలికి పెట్టిందని మాస్టర్ చెప్పుకొచ్చాడు. అయితే అవినాష్ తన చేతులను షార్ట్‌లోకి పెట్టి చూశాడు.
అది అంత లోతుగా లేదు కదా మాస్టర్ అని అవినాష్ చెప్పాడు. చాక్లెట్ పైనే ఉండొచ్చని చెప్పుకొచ్చాడు. షార్ట్ లూజ్‌గా ఉంది కదా అంటూ మాస్టర్ ఏదో చెప్పబోయాడు అంతలో అవినాష్ ఓ డైలాగ్ వేశాడు. ఆ షార్ట్లోంచి అన్ని కనిపిస్తున్నాయి.. అంటూ కవర్ చేస్తూ పెన్సిల్ అంటూ మాట మార్చేశాడు. ఆ డైలాగ్ మీనింగ్ అర్థం చేసుకున్న అరియానా షాక్ అయింది. అవినాష్‌ను దిండుతో కొట్టిపారేసింది. అలా వీరిద్దరూ పోట్లాడుకుంటూ ఉంటే అమ్మ రాజశేఖర్ సైడ్ అయిపోయాడు.