twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అవినాష్ మాటకు అరియానా షాక్.. అమ్మ రాజశేఖర్ సైలెంట్‌గా వెళ్లిపోయాడు

    |

    బిగ్ బాస్ డే కేర్ సెంటర్ టాస్క్‌లో ఒక్క చాక్లెట్ ఎంత పెద్ద రచ్చను క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. అమ్మ రాజశేఖర్ హారిక మధ్య మొదలైన ఈ గొడవ బిగ్ బాస్ ఇంటిని గందరగోళంగా మార్చిన సంగతి తెలిసిందే. అమ్మ రాజశేఖర్ జేబులో చేయి పెట్టి హారిక చాక్లెట్ దొంగతనం చేయడం, మాస్టర్ కూడా హారిక నిక్కర్‌లో చేయి పెట్టి లాక్కోవడం జరిగింది. అయితే ఈ ఘటనలో మోనాల్, మిగతా ఇంటి సభ్యులు అమ్మ రాజశేఖర్‌ను వద్దని వారించారు. ఆమె చేసినప్పుడు తప్పని చెప్పని లేదు తాను చేసినప్పుడు మాత్రం ఎలా చెబుతారని ఫైర్ అయ్యాడు.

    జేబులోంచి చాక్లెట్ బయటకు కనిపించింది అందుకే దొంగతనం చేశాను అని హారిక చెబుతోంది. జేబు లోపలికి మొత్తం చేతులు పెట్టేసిందని అమ్మ రాజశేఖర్ చెబుతున్నాడు. ఇదే విషయంలో అవినాష్, అరియానా వద్దకు వచ్చి చెప్పుకున్నాడు. తాను వేసుకున్న షార్ట్ ఇదేనని, ఇందులోనే చేతులు లోపలికి పెట్టిందని మాస్టర్ చెప్పుకొచ్చాడు. అయితే అవినాష్ తన చేతులను షార్ట్‌లోకి పెట్టి చూశాడు.

    Bigg Boss 4 Telugu Avinash Satires On Amma Rajasekhar ANd Ariana Gets Shocked

    అది అంత లోతుగా లేదు కదా మాస్టర్ అని అవినాష్ చెప్పాడు. చాక్లెట్ పైనే ఉండొచ్చని చెప్పుకొచ్చాడు. షార్ట్ లూజ్‌గా ఉంది కదా అంటూ మాస్టర్ ఏదో చెప్పబోయాడు అంతలో అవినాష్ ఓ డైలాగ్ వేశాడు. ఆ షార్ట్‌లోంచి అన్ని కనిపిస్తున్నాయి.. అంటూ కవర్ చేస్తూ పెన్సిల్ అంటూ మాట మార్చేశాడు. ఆ డైలాగ్ మీనింగ్ అర్థం చేసుకున్న అరియానా షాక్ అయింది. అవినాష్‌ను దిండుతో కొట్టిపారేసింది. అలా వీరిద్దరూ పోట్లాడుకుంటూ ఉంటే అమ్మ రాజశేఖర్ సైడ్ అయిపోయాడు.

    English summary
    Avinash Satires On Amma Rajasekhar ANd Ariana Gets Shocked, Bigg Boss 4 Telugu Day Care Task Mehaboob Proposed Ariyana, Bigg Boss 4 Telugu Day Care Task Ariyana Annoys Sohel, Bigg Boss 4 Telugu Day Care Task Goes Viral, Bigg Boss 4 Telugu Abhijeet Lasya Noel Harika Conversation, Bigg Boss 4 Telugu Week 8 Akhil Talks With Abijeet About Monal, Ariyana And Avinash Celebrate Bathukamma, Bigg Boss 4 Telugu Week 7 Abhijeet Satires On Akhil Monal Romance, Prema Modhalaindhi Movie, Bigg Boss 4 Telugu Avinash Akhil About Ariyana, Amma Rajasekhar And Sohel Conversation About Divi, Bigg Boss 4 Telugu week 7.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X