అరియానాను చంపేసి ఆమెతో పెళ్లి.. డేటింగ్ మరొకరితో.. అందరికి షాక్ ఇచ్చిన అవినాష్

బిగ్ బాస్ సీజన్ 4 దాదాపు తుది దశకు చేరుకుంది. కంటెస్టెంట్స్ ఏడుగురు మాత్రమే ఉన్నారు. 12వ వారం హౌజ్ నుంచి వెళ్లిపోయే కంటెస్టెంట్స్ పై అనేక రకాల రూమర్స్ అయితే వచ్చాయి. కానీ ఊహించని విధంగా ఎలిమినేషన్ లో అవినాష్ ఏవిక్షన్ ఫ్రీ పాస్ ద్వారా సేవ్ అయ్యాడు. ఇదంతా హై డ్రామా అనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఇక సండేను ఫన్ డేగా మార్చిన నాగార్జున కన్నడ స్టార్ సుదీప్ ద్వారా కొత్త తరహా ఎంటర్టైన్మెంట్ ని క్రియేట్ చేశాడు.

ట్విస్ట్ ఇచ్చిన నాగార్జున

ట్విస్ట్ ఇచ్చిన నాగార్జున

ఆదివారం ఒక స్పెషల్ గెస్ట్ రాబోతున్నట్లు గత వారం అనేక రకాల కథనాలు వచ్చాయి. నాగ్ స్థానంలో హోస్ట్ గా వ్యవహరిస్తాడాని టాక్ వచ్చింది. ఈ వారం నాగార్జున ఉండడేమో అనే రూమర్స్ కూడా వచ్చాయి. కానీ నాగార్జున ఇచ్చిన ట్విస్ట్ మామూలుగా లేదు. ఆయనతో పాటు సుదీప్ ను వెంటపెట్టుకొని వచ్చి కంటెస్టెంట్స్ ని ఒక ఆటాడుకున్నారు. శనివారం కౌంటర్లు వేసిన నాగ్ ఆదివారం మాత్రం అందరికి స్ఫూర్తినిచ్చే విధంగా బూస్ట్ ఇచ్చారు.

ఇరకాటంలో పెట్టేసిన సుదీప్

ఇరకాటంలో పెట్టేసిన సుదీప్

ఇక బిగ్ బాస్ హోస్ట్ విషయంలో మాత్రం నాగార్జున కంటే సిమియర్ సుదీప్ కిచ్చా. కన్నడ బిగ్ బాస్ లో ఏడు సీజన్లకు హోస్ట్ గా వ్యవహరించిన సుదీప్ హోస్ట్ చేయడం అనేది చాలా కష్టమైన పని అంటూ నేను ఈ షో ద్వారానే చాలా నేర్చుకున్నానని చెప్పాడు. ఒక విధంగా నాగార్జునపై ప్రశంసలు కురిపించారు. ఇక సుదీప్ కాసేపు హోస్ట్ గా బాధ్యత తీసుకొని కంటెస్టెంట్స్ ని ఇరకాటంలో పెట్టె ప్రశ్నలు గట్టిగానే వేశారు.

ముగ్గురు అమ్మాయిలు.. పెళ్లి ఎవరితో?

ముగ్గురు అమ్మాయిలు.. పెళ్లి ఎవరితో?

ముఖ్యంగా అవినాష్ కు ఎవరు ఊహించని ప్రశ్నను విసిరాడు సుదీప్. ఇంట్లో ఉన్న ముగ్గురు అమ్మాయిలు హారిక, అరియానా, మోనాల్. వీరిలో ఎవరితో డేటింగ్ కు వెళతావ్? ఎవరిని పెళ్లి చేసుకుంటావ్? ఎవరిని చంపేస్తావ్? అంటూ సుదీప్ అదిరిపోయే ప్రశ్నను విసిరాడు. మిగతా కంటెస్టెంట్స్ కూడా ఆ ప్రశ్నకు ఒక్కసారిగా షాక్ అయ్యారు. అవినాష్ కూడా ఎవరు ఊహించని సమాధానం ఇచ్చాడు.

Recommended Video

Bigg Boss Telugu 4 : ఒక కామెడీ పీస్ అరిస్తే ఏడుస్తావా ? నాగార్జున స్ట్రాంగ్ కౌంటర్,ఏడ్చేసిన సోహైల్
అరియానాను చంపేసి ఆమెతో పెళ్లి

అరియానాను చంపేసి ఆమెతో పెళ్లి

అరియానా అంటే అవినాష్ కు చాలా క్లోజ్ అని అందరికి తెలిసిన విషయమే అయితే ఆమెనే చంపేస్తానని సమాధానం ఇవ్వడం హైలెట్. ఇక మోనాల్ తో డేటింగ్ అయితే బావుంటుందని, చివరకు హరికను పెళ్లి చేసుకోవడానికి రెడీ అని కామెడీ చేశాడు అవినాష్. నాగార్జున కూడా అవినాష్ మాటలకు బాగానే నవ్వేశారు. ఇక అరియానా అయితే అలానే చూస్తుండిపోయింది. ఇక సోమవారం 13వ వారం నామినేషన్ ప్రక్రియ ఎలా మొదలవుతుందో చూడాలి

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X