బిగ్‌బాస్‌ 4 కంటెస్టెంట్ సోహెల్ కోసం బ్రహ్మానందం బంపర్ ఆఫర్.. పైసా ఖర్చు లేకుండా..

బిగ్ బాస్ సీజన్ 4 మొత్తానికి విజయవంతంగా పూర్తయ్యింది. మధ్య మధ్యలో రేటింగ్స్ వలన కాస్త ఇబ్బందులు ఎదురైనప్పటికి మొత్తానికి ఎండింగ్ టచ్ మాత్రం అదరగొట్టేశారు. సీజన్ 4 విజేతగా నిలిచిన అభిజిత్ ఒక్కసారిగా మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచాడు. ఇక అథానికంటే ఎక్కువగా టాప్ 3 కంటెస్టెంట్ గా నిలిచిన సోహెల్ మంచి క్రేజ్ అందుకున్నాడు. అతని కోసం ఇప్పుడు కామెడీ కింగ్ బ్రహ్మానందం కూడా రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.

క్రేజ్ అయితే బాగానే అందుకున్నారు

క్రేజ్ అయితే బాగానే అందుకున్నారు

సీజన్ 4 విజేతగా నిలిచిన అభిజిత్ అలాగే రన్నరప్ అఖిల్ క్రేజ్ అయితే బాగానే అందుకున్నారు. 50లక్షల క్యాష్ తో పాటు బిగ్ బాస్ టైటిల్ ను అందుకున్న అభిజిత్ నెవర్ బిఫోర్ అనేలా ఆడియేన్స్ ల్ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఇక అఖిల్ కూడా పరవాలేదు అనిపించే విధంగా క్రేజ్ అయితే అందుకున్నాడు.

గెలిస్తే.. సెట్టయినట్లు కాదు

గెలిస్తే.. సెట్టయినట్లు కాదు

బిగ్ బాస్ విజేతగా నిలిచిన తరువాత చాలా వరకు కంటెస్టెంట్స్ వేసే అడుగులు చాలా కీలకంగా ఉంటాయి. తొందరపడకుండా కెరీర్ ను సరైన ట్రాక్ లోకి తెచ్చుకోగలిగితే మంచి లైఫ్ ఉంటుంది. బిగ్ బాస్ విన్నర్ అయినంత మాత్రానా కెరీర్ సెట్టయినట్లు కాదు. గత మూడు సీజన్ల విజేతలు ఇంకా అనుకున్నంత రేంజ్ లో అయితే కెరీర్ సెట్ చేసుకోలేదు. నిజానికి వాళ్ళు తెలివైన పద్దతిలో ప్లాన్ చేసుకోలేదనే కామెంట్స్ ఎక్కువగా వచ్చాయి.

ఏ క్షణాన ఎలాంటి ఆఫర్ వస్తుందో..

ఏ క్షణాన ఎలాంటి ఆఫర్ వస్తుందో..

ఇక ఈ సారి టాప్ 5లో నిలిచిన కంటెస్టెంట్స్ కు మాత్రం అద్భుతమైన క్రేజ్ దక్కింది. దాదాపు 15కోట్లకు పైగా ఓట్లు దక్కడం అంటే మామూలు విషయం కాదు. సెలబ్రెటీలు సైతం బిగ్ బాస్ ను ఫాలో అవుతున్నారు అంటే ఏ క్షణాన ఎలాంటి అవకాశం వస్తుందో తెలియదు. మెగాస్టార్ అయితే సోహెల్ కు అద్భుతమైన ఆఫర్స్ ఇవ్వడం వైరల్ అయిన విషయం తెలిసిందే.

బ్రహ్మానందం బంపర్ ఆఫర్..

బ్రహ్మానందం బంపర్ ఆఫర్..

ఎక్కువగా తన పెర్ఫామెన్స్ తో రియాలిటీ డైలాగ్స్ తో ఆకట్టుకున్న సోహెల్ కు మెగాస్టార్ కూడా ఫిదా అయ్యారు. స్టేజ్ పైనే అతను సినిమా చేస్తే అతిధి పాత్రలో కూడా నటిస్తానని చెప్పాడు. ఇక అదే తరహా మరొక సీనియర్ కామెడీ కింగ్ కూడా సోహెల్ కు బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆయన మరెవరో కాదు.. హాస్య బ్రహ్మ బ్రహ్మానందం.

రెమ్యునరేషన్ లేకుండా..

రెమ్యునరేషన్ లేకుండా..

సోహెల్ కు బ్రహ్మానందం ఇటీవల ఒక బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు టాక్ అయితే వస్తోంది. సోహెల్ సినిమా చేయాలని అనుకుంటున్న విషయం తెలిసిందే. అయితే అందులో బ్రహ్మానందం కూడా రెమ్యునరేషన్ లేకుండా నటించడానికి సిద్ధంగా ఉన్నారని టాక్ వస్తోంది. పైసా ఖర్చు లేకుండా ఇద్దరు లెజెండ్స్ సినిమాల్లో ఉంటే సోహెల్ కథ వేరేలా ఉంటది. మరి మనోడు ఎలాంటి కథను సెట్ చేసుకుంటాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X