నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోలేదు రా.. సోహెల్ గాలి తీసేసిన అఖిల్
బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఎప్పుడు ఎలా మారతారో ఎవరికి తెలియదు. స్నేహితులు కూడా శత్రువులు అవ్వడం ఇక్కడ చాలా కామన్ పాయింట్. మిగతా విషయాల్లో ఎంత స్నేహంగా ఉన్నప్పటికీ టాస్కులు మొదలైతే మాత్రం ఎవరు ఎలాంటి వారో చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇక సోమవారం ఎపిసోడ్ లో ఉదయమే అఖిల్, సోహెల్ మధ్య జరిగిన ఒక సంభాషణ వారి ఇద్దరి మధ్య ఉన్న ఆలోచనాలను బయటపెట్టింది.
అఖిల్, సోహెల్ ఇద్దరు కూడా మొదటి నుంచి చాలా స్నేహంగా ఉంటూ వస్తున్నారు. కానీ ఏడుగురు మాత్రమే మిగిలినప్పుడు అనుకోకుండా గొడవలు జరిగాయి. అఖిల్ తీరుపై సోహెల్ నిత్యం ఏదో ఒక విధంగా అసహనం వ్యక్తం చేస్తూనే ఉన్నాడు. టాస్కులలో తనకు నెగిటివ్ గా ఉంటున్నావ్ అంటూ సోహెల్ గత వారమే గోడవ పెట్టుకున్నాడు. ఇక అఖిల్ కూడా సహనం కోల్పోయి దూరంగానే ఉండేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. ఇక సోమవారం ఇద్దరు సోఫాలలో పడుకొని ఓపెన్ గా మాట్లాడుకున్నారు.

మొదట అఖిల్ అరియానా వెళ్లిపోయిన విషయంలో చాలా బాధపడుతూ తనలో తానే మాట్లాడుకున్నాడు. ఇక సోహెల్ వచ్చి ఆమె నిన్ను చాలా బాగా అర్థం చేసుకొని ఉండేదని చెప్పగా.. లేదు నన్ను అసలు అర్థం చేసుకోలేదు.. అంటూ రివర్స్ గా మాట్లాడాడు. అంతే కాకుండా నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోలేదు రా.. అసలు నన్ను ఎవరు ఎవరు అర్థం చెలుకోలేదని అఖిల్ చెప్పడంతో సోహెల్ షాక్ అయ్యాడు. అలా అనుకుంటే ఏమి చేయలేమని అర్థం చేసుకున్నాను కాబట్టే నువ్ ఎంత దూరం పెట్టినా కూడా మళ్లీ దగ్గరకు వచ్చే ప్రయత్నం చేశానని సోహెల్ తనదైన శైలిలో వివరణ ఇచ్చాడు.


Click it and Unblock the Notifications











