twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎదిగితే తట్టుకోలేరు, తొక్కేయ్యాలని చూస్తారు.. ఆ స్టార్స్ సపోర్ట్ చేస్తారనుకున్నా: అఖిల్ సార్ధక్

    |

    బిగ్ బాస్ విజేతగా నిలిచిన అభిజిత్ ఒక్కసారిగా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాడు. ఇక మూడవ స్థానంలో నిలిచిన సోహెల్ కూడా మెగాస్టార్ ఆఫర్ తో మంచి క్రేజ్ అందుకున్నాడు. ఒక విధంగా సోహెల్ టైటిల్ విన్నర్ గా నిలవకపోయినా కూడా అభి కంటే హై రేంజ్ లోనే క్లిక్కయినట్లు తెలుస్తోంది. ఇక వారి మధ్యలో సెకండ్ ప్లేస్ లో రన్నరప్ గా నిలిచిన అఖిల్ తనదైన శైలిలో క్రేజ్ అందుకున్నాడు. అయితే సెలబ్రెటీల నుంచి తనకు సరైన రేంజ్ లో క్రేజ్ రాలేదని ఇటీవల సోషల్ మీడియా లైవ్ లో వివరణ ఇచ్చాడు.

    ట్రోలింగ్ గట్టిగానే నడిచింది..

    ట్రోలింగ్ గట్టిగానే నడిచింది..

    అఖిల్ హౌజ్ లోకి అడుగు పెట్టినప్పుడు అతనంటే ఎవరికి పెద్దగా తెలియదు. చాలా వరకు అతను మొదటి వారమే వెళ్లిపోతాడాని టాక్ వచ్చింది. ఇక ప్రతి వారం హౌజ్ మెంట్స్ మద్దతుతో సేఫ్ అవుతూ వచ్చిన అఖిల్ మెల్లగా ఆడియెన్స్ సపోర్ట్ తీసుకోవడం స్టార్ట్ చేశాడు. మొదట్లో అతనిపై ట్రోలింగ్ గట్టిగానే వచ్చింది.

    అప్పుడే వెళ్లిపోవచ్చని అనుకున్నాడట

    అప్పుడే వెళ్లిపోవచ్చని అనుకున్నాడట

    అఖిల్ టాప్ 7 కంటెస్టెంట్స్ లలో ఉన్నప్పుడు కూడా వెళ్లిపోవచ్చని అంతా అనుకున్నారు. అఖిల్ కూడా ఇంటర్వ్యూలో అదే చెబుతున్నాడు. కానీ అదృష్టవశాత్తూ అతను ఫైనల్ వరకు వచ్చాడు. ఎక్కువగా అఖిల్ మొదట్లో అభిజిత్ ఫ్యాన్స్ నుంచి ట్రోలింగ్ ఎదుర్కోవాల్సి వచ్చింది. మోనాల్ విషయంలో అఖిల్, అభి మధ్య ఎన్నిసార్లు విబేదాలు వచ్చాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.

    నా జీవితంలో ఇంతవరకు చూడలేదు..

    నా జీవితంలో ఇంతవరకు చూడలేదు..

    ఇక ఇటీవల సోషల్ మీడియా లైవ్ లో నెటిజన్స్ తో చాట్ చేసిన అఖిల్ వారు అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పాడు. ఇంత ప్రేమను ఆప్యాయతను నా జీవితంలో ఇంతవరకు చూడలేదు. ఇంటికి వచ్చినప్పటి నుంచి కూడా జనాలు చాలా మంది వస్తున్నారు. చిన్న చిన్న పిల్లలు కూడా నన్ను ఎంతగానో అభిమానిస్తున్నారు.. అంటూ మాట్లాడాడు.

    తొక్కేయ్యాలని చూస్తారు..

    తొక్కేయ్యాలని చూస్తారు..

    ఇక నెగిటివ్ ట్రోల్స్ పై కూడా అభి తనదైన శైలిలో వివరణ ఇచ్చాడు. నిజానికి వాళ్లకు కూడా నేను కృతజ్ఞతలు చెబుతున్నాను. ఎందుకంటే ఒక మనిషి ఎదిగితే కొందరు తట్టుకోలేరు. నేను ఈ స్థాయికి వస్తానని అనుకోలేదు. కొందరు అయితే అయితే తొక్కేయ్యాలని చూస్తారు. కానీ నాకు నా అభిమానుల సపోర్ట్ ఉంది. వాళ్ళ ప్రేమను నేనెప్పటికి తలకు ఎక్కించుకొను హార్ట్ లోనే ఉంచుకుంటానని అన్నాడు.

    స్టార్స్ సపోర్ట్ చేయలేదు..

    స్టార్స్ సపోర్ట్ చేయలేదు..

    హౌజ్ లో కొందరికి బయట నుంచి సెలబ్రేటీలు బాగానే సపోర్ట్ చేశారు. ఇక నాకు కూడా కొందరు స్టార్స్ సపోర్ట్ చేస్తారని అనుకున్నాను. ఒక ఇద్దరు తప్పితే మిగతా వాళ్ళు ఎవరు కూడా సపోర్ట్ చేయలేదు. ఇక బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లలో కూడా మోనాల్ తప్పితే ఎవరు ఎక్కువగా సపోర్ట్ చేయలేదు. నిజంగా అది కొంత మైనస్ అయినప్పటికీ ఇక్కడి వరకు వచ్చాను అంటే ఎంతో సంతోషంగా ఉంది.. ఈ అభిమానాన్ని ఎన్నటికి తగ్గించుకొను.. నాకు అది చాలని అఖిల్ వివరణ ఇచ్చాడు.

    English summary
    Bigg Boss Season 4 has successfully completed a total of 105 days of travel. Bigg Boss, which received a lot of craze as the biggest reality show in the middle of this season, gave some entertainment in the final but never before. Abhijit won the season 4 as expected. However, the Bigg Boss show has set a new record for most votes cast.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X