కొత్త ఇంటిపై క్లారిటీ ఇచ్చిన గంగవ్వ.. మరికొంత భారం, నాగార్జున, బిగ్‌బాస్‌ అన్నట్లే చేశారుగా..

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 ద్వారా ఈ సారి కంటెస్టెంట్స్ కు మంచి గుర్తింపు దక్కిందనే చెప్పాలి. ముఖ్యంగా మై విలేజ్ షో గంగవ్వ ఏ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. మై విలేజ్ షో నుంచి బిగ్ బాస్ వరకు ఆమె ప్రయాణంతో జనాలకు మరింత దగ్గరయ్యారు. ఇక ఆమె బిగ్ బాస్ ద్వారా గెలుచుకున్న డబ్బుతో ఆమె సొంత ఇంటి కలను నిజం చేసుకోబోతోంది. ఇక ఇటీవల తన యూ యూబ్ ఛానెల్ ద్వారా గంగవ్వ ఇంటి పనులు ఎంతవరకు వచ్చాయనే విషయంపై.. నాగార్జున ఇచ్చిన మాట ప్రకారం సహాయం చేశారా లేదా అనే దానిపైన కూడా క్లారిటీ ఇచ్చారు.

స్పెషల్ ఎట్రాక్షన్ గా..

స్పెషల్ ఎట్రాక్షన్ గా..

ఇక బిగ్ బాస్ షోలో ఆమె గెలుచుకున్న కొన్ని చేక్ లను ఉపయోగించుకొని గంగవ్వ గతంలో షాపింగ్స్ చేసిన విషయం తెలిసిందే. బిగ్ బాస్ ఫైనల్ లో కూడా ఆమె స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు. హౌజ్ లో కొన్ని రోజుల వరకు బాగానే ఉన్నా గంగవ్వ సడన్ గా సొంత నిర్ణయంతో తప్పుకున్న విషయం తెలిసిందే. ఆమె షోలో ఉన్నన్ని రోజులు మంచి పోటీని ఇచ్చింది. మంచి గుర్తింపు కూడా అందుకుంది. ఓట్లు కూడా బాగానే పడ్డాయి.

లక్ష రూపాయల బంగారం

లక్ష రూపాయల బంగారం

షోలో ఒకసారి గంగవ్వ ఫ్యాషన్ లో పాల్గొన్న విషయం తెలిసిందే. అయితే అప్పుడు గెలిచిన చెక్కులు అందగానే ఆమె బంగారం కొనుగోలు చేసింది. హైదరాబాద్ లోనే బిగ్ బాస్ ఫైనల్ కు ముందే షాపింగ్ చేసిన వీడియో కూడా తన ఛానెల్ లో పోస్ట్ చేసుకుంది. స్పెషల్ గా లక్ష రూపాయల బంగారంను కొనుగోలు చేసినట్లు ఆ వీడియోలో తెలిపారు.

కొత్త ఇంటిపై క్లారిటీ ఇచ్చిన గంగవ్వ

కొత్త ఇంటిపై క్లారిటీ ఇచ్చిన గంగవ్వ

ఇక బిగ్ బాస్ నుంచి వచ్చేటప్పుడు గంగవ్వ ఇంటి కోసం నాగార్జునను రిక్వెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తప్పకుండా ఇల్లు కట్టిస్తామని హామీ కూడా ఇవ్వడంతో అప్పటి నుంచి ఈ న్యూస్ వైరల్ గా మారింది. ఇక మొత్తానికి బిగ్ బాస్ ఆధ్వర్యంలో నాగార్జున కట్టిస్తున్న ఇల్లుపై కూడా గంగవ్వ ఒక వీడియోను కూడా రిలీజ్ చేసింది.

ఖర్చు ఎంత అవుతోందంటే..

ఖర్చు ఎంత అవుతోందంటే..

ప్రస్తుతం ఇంటి పనులు వేగంగా జరుగుతున్నాయని అంటూ మరి కొన్ని రోజుల్లో రెడీ అవుతుందని అన్నారు. ఇక 18లక్షల ఖర్చుతో ఇంటిని నిర్మిస్తున్నట్లు చెప్పిన గంగవ్వ మరో రెండు లక్షలు అధికంగా ఖర్చయ్యే ఛాన్స్ ఉన్నట్లు చెప్పింది. పక్క ఊరికి చెందిన కాంట్రాక్టర్ కు ఇంటి నిర్మాణ బాద్యతలు అప్పగించినట్లు చెప్పారు. రెండు బెడ్ రూమ్ లు, ఒక హాల్, కిచెన్ ఉండేలా సింపుల్ గా హౌజ్ ను ప్లాన్ చేసుకుంటున్నట్లు వీడియో ద్వారా వివరణ ఇచ్చారు.

నాగార్జున సహాయం.. బిగ్ బాస్ రెమ్యునరేషన్..

నాగార్జున సహాయం.. బిగ్ బాస్ రెమ్యునరేషన్..

ఇక ఫైనల్ గా బిగ్ బాస్ నుంచి రావాల్సిన ఎమౌంట్ కూడా వచ్చిందని చెప్పిన గంగవ్వ నాగార్జున ఇచ్చిన మాట ప్రకారం తన వంతు సహాయం కూడా చేశారని రావాల్సిన డబ్బులన్ని వచ్చాయని గంగవ్వ క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే సగం పనులు పూర్తయినట్లు చెప్పిన గంగవ్వ ఇంటి నిర్మాణం పూర్తయితే బిగ్ బాస్ హౌజ్ మెంట్స్ ను ఓపెనింగ్ కు పిలుస్తానని వివరణ ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X