Don't Miss!
- News 527 భారత ఫుడ్ ఐటమ్స్ లో క్యాన్సర్ కారకాలు-జాబితాలో ఇవే- ఈయూ గుర్తింపు..!
- Sports RCB Playing XI: అతనికి నిరాశే.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడే ఆర్సీబీ తుది జట్టు ఇదే!
- Lifestyle పురుషుల్లో ఈ లక్షణాలు ఉంటే.. ఖచ్చితంగా డిప్రెషన్‌కు గురైనట్టే..!
- Automobiles కారులో ఎక్కువ సౌండ్‌తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
బిగ్‌బాస్ ఇంట్లో పాతాళగంగ.. చూడలేం బాబోయ్.. నెటిజన్ల కామెంట్లు వైరల్!!
బిగ్‌బాస్ సీజన్లు మారుతుంటాయ్.. కంటెస్టెంట్లు మారుతుంటారు.. కానీ ప్రాసెస్..టాస్కులు.. పద్దతి మారదు. అవే టాస్కులు అటూ ఇటూ మార్చేసి ఆడిస్తాడు. కొద్ది కొద్ది మార్పులతో కంటెస్టెంట్లతో ఆడిస్తుంటాడు. ఇప్పటి వరకు జరిగిన టాస్కుల్లో కూడా ఏమంత కొత్త దనం కూడా లేదు. గత సీజన్లలో ఆడించిన ఆటలనే మళ్లీ ఆడిస్తున్నాడు. అదే పరంపరలో నేటి ఎపిసోడ్ కూడా కొనసాగబోతోంది. కంటెస్టెంట్ల చిన్ననాటి ఫోటోలను చూపించి ఏడ్పించేశాడు.
కదిలిస్తేనే..
అసలే ఈ సారి వచ్చిన కంటెస్టెంట్లలో కదిలిస్తేనే కన్నీరు పెట్టుకునే వారున్నారు. అందులో మరీ ముఖ్యంగా మోనాల్. ఈమెను కదిలించకపోయినా సరే ఏడుస్తూనే ఉంటుంది. మొదటి వారంలో అయితే ఈమె ఏడుపుపై వచ్చిన ట్రోల్స్ అన్నీ ఇన్నీ కావు. అయితే నాగార్జున ఇచ్చిన సలహాలతో ఏడుపును కొద్దిగా తగ్గించుకుంది. ఇక నేటి ఎపిసోడ్లో మోనాల్ కట్టలు తెంచుకున్నట్టు కనిపిస్తోంది.
చిన్ననాటి ఫోటోలతో..
ఇక నేటి ఎపిసోడ్లో ఒక్కో కంటెస్టెంట్‌కు సంబంధించిన చిన్న నాటి ఫోటోలను షేర్ చేసి అందర్నీ ఎమోషనల్‌కు గురి చేశాడు. ఇందులో అమ్మ రాజశేఖర్ ఫోటోలను చూసి అందరూ నవ్వేశారు. సోహెల్ మాత్రం గర్వంగా ఫీలయ్యాడు. సింగరేణి ముద్దు బిడ్డ బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లాడురా అంటూ తన తండ్రి గర్వంగా చెప్పుకుంటాడని తెలిపాడు.
హారిక ఎమోషనల్...
ఇక తన చిన్ననాటి ఫోటోలను చూసి హారిక బాగా ఎమోషనల్ అయినట్టుంది. ఐదేళ్ల సమయంలో తండ్రి నుంచి చాలా దూరం వచ్చేశాం..వెనక్కి తిరిగి చూసుకోలేదు.. తిరిగి చూసుకుంటే ఆగిపోతాం అంటూ హారిక ఎమోషనల్ అయింది. మరో వైపు దివి కూడా కన్నీరు పెట్టుకుంది.
మోనాల్ అలా..
మోనాల్ తన తండ్రితో ఉన్న ఏకైక ఫోటోను చూసి మోనాల్ ఎమోషనల్ అయింది. తన తండ్రి చనిపోయాడని, తన కుటుంబం అలా ఇలా అని ఎన్నో సార్లు చెప్పుకొచ్చింది. తన తండ్రితో ఉన్న ఒకే ఒక్క ఫోటో ఇదేనంటూ భోరున ఏడ్చేసింది. ఇలా మోనాల్ ఏడుస్తూ ఉండటం చూసి చాలా రోజులే అయింది.
Recommended Video
నెటిజన్ల కామెంట్లు..
ప్రోమోలోనే ఇన్ని ఏడ్పులు పెడబొబ్బులు ఉండటంతో కొందరు నెటిజన్లు బెంబేలెత్తిపోతున్నారు. వామ్మో నేటి ఎపిసోడ్‌ను ఇక చూడలేం, ఆ ఏడ్పులను భరించలేమంటూ దండం పెడుతున్నారు. ఇక కొందరైతే అవి నిజమైన ఎమోషన్స్, హార్ట్ టచింగ్‌గా ఉన్నాయని అంటున్నారు.