అభిజీత్ అంటే అంత ద్వేషమా.. గంగవ్వపై ప్రేమ నిజమేనా?.. కంటెస్టెంట్లకు నాగ్ షాక్
బిగ్‌బాస్ షోలో మూడో వారం మంచి రసపట్టు మీదుంది. కంటెస్టెంట్ల మధ్య మనస్పర్దలు, ఉక్కు హృదయం టాస్క్ వల్ల వచ్చిన బేధాభిప్రాయాలు ఇలా వారం మొత్తం సందడిగానే జరిగింది. అయితే టాస్కులో రోబో టీం తరుపున అభిజీత్ వేసిన ప్లాన్ సక్సెస్ కావడం మనుషుల టీం భరించలేకపోతోన్నట్టుంది. అందుకే అందరూ అభిజీత్‌ను టార్గెట్ చేయడం మొదలెట్టారు. మనుషుల టీంకు అభిజీత్‌పై ఎంత ద్వేషం ఉందో నిన్న నాగార్జున ఇచ్చిన టాస్క్‌తో బయటపడింది.

అభిజీత్‌ను టార్గెట్..
నమ్మించి మోసం చేశాడని, ఆడవాళ్లను అడ్డం పెట్టుకున్నాడని ఇలా నోటికి ఎంతొస్తే అంత మాట్లాడారు. హద్దులు మీరు కూడా పదాలను ఉపయోగించారు. అయినా సరే అభి కామ్‌గానే ఉండి మీకు నచ్చకపోతే నామినేట్ చేసుకోండి బ్రదర్ అంటూ చెప్పేశాడు. ఏది ఎలా జరిగినా రోబోల టీం గెలిచింది.

నాగార్జున టాస్క్..
రోబోల టీం గెలిచినందుకు నాగార్జున మెడల్స్‌ను ప్రధానం చేయాలని భావించాడు. రోబో టీం సభ్యుల్లో మహా నాయకుడు, మహానటి, మహాకంత్రి ఎవరన్నది చెప్పాలని కంటెస్టెంట్లను అడిగారు. అందులో మొదటగా మహా నాయకుడు ఎవరు అని నాగార్జున అడగ్గా.. అందరూ గంగవ్వ పేరునే చెప్పారు. కానీ నాగార్జున మాత్రం అభిజీత్ మహా నాయకుడు అని చెబుతూ.. కంటెస్టెంట్లందరికీ గట్టిగా ఇచ్చాడు.

అభిజీత్‌పై ద్వేషంతో..
అభిజీత్‌పై ద్వేషంతోనే అందరూ గంగవ్వ పేరును చెప్పినట్టు తెలుస్తోంది. అసలు మామూలుగా నాయకుడు అంటే తన టీంను నడిపించేవాడు.. గెలిపించేవాడు.. ఇవి రెండూ చేసింది అభిజీత్. ఈ చిన్న లాజిక్‌కు వదిలేసి ఊరికే సింపతీ పొందాలని గంగవ్వ పేరును చెప్పేశారు. అయినా ఆ ఇంట్లో ప్రతీసారి గంగవ్వ అనే కార్డ్‌ను వాడి అందరూ సింపతీ కొట్టేస్తున్నారు.
Recommended Video

మహానటిగా గంగవ్వ..
అయితే మహానటి మెడల్‌ను గంగవ్వకు ఇచ్చే ముందు ఆమె ఆటలో ఎన్ని నాటకాలు ఆడిందో వీడియోలు ప్లే చేసి చూపించారు. అయితే అది ఆటలో సహజం. ఎవరు ఏ టీంలో ఉంటే ఆ టీం గెలవాలని ఆడతారు. గంగవ్వ కూడా అలానే ఆడి మనుషులను మోసం చేద్దామని ప్రయత్నించినా అది కుదర్లేదు. అయితే గంగవ్వ ఆటను చూసి మనుషుల టీం సభ్యులంతా షాక్ అయ్యారు.


Click it and Unblock the Notifications











