ఈ వారం మోనాల్ అవుట్!.. అఖిల్ చూపుల రహస్యాలపై కన్నేసిన లాస్య
బిగ్‌బాస్ షో రెండో వారంలో బాగానే దూసుకుపోతోంది. ఓ ట్రయాంగిల్ స్టోరీతో బాగానే నెట్టుకొస్తున్నారు. ఇక నేటి షోలో చేసిన టాస్క్ అందర్నీ ఆకట్టుకుంటుంది. మోనాల్ సోహెల్ హాట్ పర్ఫామెన్స్, హారిక మెహబూబ్ మాస్ స్టెప్పులతో టాప్ లేచిపోయింది. ఇక లాస్య, సుజాతలను ఫ్లిప్పర్స్ (అక్కడి మాటలు ఇక్కడ.. ఇక్కడ మాటలు అక్కడ చెప్పేవారు)గా వర్ణించడం, అఖిల్-మోనాల్‌పై వారు కన్నేయడం హైలెట్‌గా మారింది.

వారిపై కన్ను..
లాస్య సుజాతలు మోనాల్-అఖిల్‌పై కన్నేశారు. నిత్యం అతనితోనే ఉండటం వల్ల తమకు సమయం దొరకడం, మనం మాట్లాడుకోలేకపోతున్నామని మోనాల్‌తో అర్దరాత్రి ముచ్చటించారు. ఇక ఈ వారం ఎలిమినేట్ అవుతావేమో అన్న అనుమానం లాస్య వెల్లిబుచ్చడంపై మోనాల్ హర్ట్ అయింది. కట్టప్ప, ఫ్లిప్పర్స్ అంటూ లాస్యకు కొత్త పేరుపెట్టేసింది.

బీబీ ఎంటర్టైన్మెంట్..
బీబీ ఎంటర్టైన్మెంట్ టాస్క్‌లో భాగంగా అమ్మ రాజశేఖర్ సోలో డ్యాన్సులు, హరిక-మెహబూబ్ డ్యూయెట్, సోహెల్-మోనాల్ డ్యూయట్ డ్యాన్స్ పర్ఫామెన్స్ చేయాలని, నోయల్-లాస్య జడ్జ్‌లుగా వ్యవహారించాలని, ఆరియానా యాంకర్‌గా ఉంటుందని మిగతా వాళ్ల బీబీ టీవీలో యాడ్స్ చేయాలని చెప్పుకొచ్చాడు.

అఖిల్ చూపులపై..
టాస్క్‌లో భాగంగా సోహెల్-మోనాల్ స్టెప్పులు ప్రాక్టీస్ చేస్తుండగా.. అఖిల్ వెరైటీగా చూడటంపై అభిజీత్, లాస్య, సుజాతలు సెటైర్లు వేసుకున్నారు. ఇన్నాళ్లు గమనించలేదు గానీ ఏదో నడుస్తోందని అని లాస్య కౌంటర్ వేయడం, ఈ ముగ్గురిని మోనాల్ గమనించి.. అఖిల్‌తో వారి గురించి చెప్పడం హైలెట్‌గా మారింది.

హాట్ పర్ఫామెన్స్‌తో రచ్చ..
బీబీ ఎంటర్టైన్మెంట్ టాస్క్‌లో భాగంగా సినిమా చూపిస్తా మామ పాటకు అమ్మ రాజశేఖర్ వేసిన స్టెప్పులేశాడు. ఇక మోనాల్-సోహెల్ హాట్ స్టెప్పులకు అందరూ ఫిదా అయిపోయారు. హారిక మెహబూబ్ మాస్ స్టెప్పులతో దుమ్ములేపాడు. గంగవ్వ పాడిన పాట కూడా బాగానే క్లిక్ అయింది. హారికకు స్టార్ పర్ఫార్మర్ర్, మెహబూబ్‌కు స్టార్ పర్ఫార్మర్ ఆఫ్ ది డేగా టైటిల్ అనౌన్స్ చేసేశారు.
Recommended Video

వైల్డ్ కార్డ్ ఎంట్రీ..
చివరగా అందరూ కలిసి ఎంజాయ్ చేశారు. ఎవరికి వారు డ్యాన్సులు వేస్తూ రచ్చ చేశారు. ఇక హౌస్‌లో మరో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వనున్నట్టు ప్రకటించేశాడు. ప్రోమోను బట్టి చూస్తే జోకర్ అంటూ చెప్పడం వింటుంటే అది జబర్దస్త్ అవినాష్ అని అర్థం అవుతోంది. మరి ఇంతకీ ఆ స్పెషల్ కంటెస్టెంట్ ఎవరన్నదిచూడాలి.


Click it and Unblock the Notifications











