Bigg Boss Unseen.. ఎవరి పర్ఫామెన్స్ వారిదే.. వారిని తలుచుకుంటూ అరియానా ఎమోషనల్
బిగ్ బాస్ షోలో చివరి వారం అందరూ రిలాక్స్ అవుతున్నారు. కానీ ఒకరి గురించి మరొకరు వెనకాల మాట్లాడుకుంటూనే ఉన్నారు. మరీ ముఖ్యంగా అఖిల్ హారికలు బాగానే ముచ్చట్లు పెట్టుకుంటన్నారు. అభిజిత్ హారికలు తమ మధ్య ఉన్న దూరాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అరియానా సోహెల్ కూడా దగ్గరయ్యారు. గతవారంలో జరిగిన గొడవను మరిచిపోయి మునుపటిలా స్నేహంగానే ఉంటున్నారు.

ఆ టాస్క్‌లో అలా..
ఎవరికి అర్హత ఉంది.. ఎవరికి అర్హత లేదు అనే టాస్క్ ఇవ్వడంతో మళ్లీ ఇంటి సభ్యుల మధ్య చిచ్చు పెట్టినట్టు కనిపిస్తోంది. ఆ టాస్క్‌లో అరియానా అనర్హురాలంటూ హారిక, అఖిల్, సోహెల్ చెప్పుకొచ్చారు. అయితే అరియానా మాత్రం వారికి బాగానే కౌంటర్లు వేసినట్టు కనిపిస్తోంది.

అన్ సీన్‌లొ అలా..
అరియానా మాట్లాడిన మాటల గురించి అఖిల్ హారికలు బాగానే ముచ్చట్లు పెట్టుకున్నారు. అరియానా మాట్లాడిన మాటలు, ఆమె వెరైటీ కోసం టాస్కులు ఆడానంటూ తనది తాను సమర్దించుకోవడంపై అఖిల్ హారికలు చెవులు కొరుక్కున్నారు. వెరైటీ కోసం ఆడానంటే.. ఆమె ఒరిజినాలిటీ అది కాదు అనే కదా అంటూ అఖిల్ ఓ అంశాన్ని లెవనెత్తాడు.

అరియానా ఎమోషనల్..
అరియానా అమ్మ రాజశేఖర్, దివి, అవినాష్‌లను తలుచుకుంటూ ఎప్పటిలాగే పర్ఫామెన్స్ ఇచ్చింది. టాప్ 5లోకి వెళ్లాను అమ్మ, దివి.. నేను టాప్ 5లోకి వెళ్లాను అంటూ తెగ ఎమోషనల్ అయింది. పక్కనే ఉన్న సోహెల్‌కు దివి, అమ్మ రాజశేఖర్‌లతో ఉన్న బంధం గురించి చెబుతూ కన్నీరుపెట్టేసుకుంది.
Recommended Video

అభిజిత్ క్లారిటీ..
హారికను అనర్హురాలిగా చెప్పడంపై అభిజిత్ క్లారిటీ ఇచ్చాడు. ఇక్కడి వరకు వచ్చాక ఎవ్వరినీ అనర్హులిగా చెప్పలేము.. నువ్వు టాప్ 2లో ఉంటే.. నేను గెలిచానని అనుకోలేను.. ఆ విజయం నాకు అసంపూర్ణంగా ఉంటుంది.. గెలిచినా ఓడినట్టే.. అందుకే అలా చెప్పాను అంటూ హారికకు క్లియర్‌గా అర్థమయ్యేలా అభిజిత్ చెప్పాడు. మొత్తానికి ఎవరి బాధ వారిదే అన్నట్టు అన్ సీన్ ఎపిసోడ్ సాగింది.


Click it and Unblock the Notifications











