బక్రాలయ్యామని గుర్తించారా?.. తప్పేంటో తెలుసుకున్న మెహబూబ్, సోహెల్!!

బిగ్ బాస్ షోలో ఉండటం, ఆడటం, ఆడి గెలవడం అంత సులభం ఏమీ కాదు. ఎన్నో రకాలుగా ఆలోచించాల్సి ఉంటుంది. ఒక మాట అంటే ఎంతటి ప్రభావాన్ని చూపిస్తుంది.. లోపల చేసే పనులు ప్రేక్షకులకు ఎలా చూపిస్తున్నారు.. ఎలాంటి పరిస్థితుల్లో ఎలా రియాక్ట్ అవుతున్నాం ఇలా ఎన్నో రకలుగా కంటెస్టెంట్లు తమకు తాము ఆత్మావలోకనం చేసుకోవాలి. నిన్నటి ఎపిసోడ్‌లో మెహబూబ్, సోహెల్ అదే చేశారు.

ముందు నుంచీ అంతే..

ముందు నుంచీ అంతే..

ఈ నాల్గో సీజన్‌లో ముందు నుంచి వెనుకబడ్డ కంటెస్టెంట్ ఎవ్వరైనా ఉన్నారంటే అది మెహబూబ్ మాత్రమే. సోహెల్‌ను నైబర్ రూంలో ఆరియానాతో కలిపి పంపించడం, ఇద్దరి కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వడం, ఆపై ఇంట్లోకి వచ్చి గొడవలు పడటం ఇలా సోహెల్ కంటూ ఏదో ఒక గుర్తింపు ఉంది. కానీ మెహబూబ్ ఉన్నాడని ఎవ్వరూ పట్టించుకోవడం లేదు.

టాస్క్‌తో మారింది..

టాస్క్‌తో మారింది..

హారిక, మెహబూబ్ కలిసి చేసిన డ్యాన్స్ పర్ఫామెన్స్‌లో మాత్రం అదరగొట్టాడు. ఆ ఒక్క పర్ఫామెన్స్ ద్వారా బాగానే క్రేజ్ వచ్చింది. అయితే అలా వచ్చిన క్రేజ్‌ను ఉక్కు హృదయం టాస్క్‌లో అతి చేసి పోగొట్టుకున్నాడు. మెహబూబ్, సోహెల్ చేసిన ఓవరాక్షన్‌పై సోషల్ మీడియాలో లెక్కలేనన్ని ట్రోల్స్ వచ్చాయి.

అందరూ మామూలే...

అందరూ మామూలే...

టాస్కులో అంత గొంతు చించుకున్నా అందరూ బాగానే కలిసిపోయారు. చొక్కాలు చించుకున్నట్టు ఓవరాక్షన్ చేసిన వీళ్లిద్దరు మాత్రం మళ్లీ ఒంటరిగానే మిగిలిపోయారు. కొత్తగా వచ్చిన వైల్డ్ కార్డ్ ఎంట్రీతో కూడా వీరు అంతగా కలవలేకపోయారు. ఇక ఈ ఇద్దరు కూర్చుని ముచ్చటించుకున్న టాపిక్ మాత్రం బాగానే క్లిక్ అయింది.

ఇద్దరి ముచ్చట్లు..

ఇద్దరి ముచ్చట్లు..

ఏదో తేడా కొడుతోందని సోహెల్ మెహబూబ్‌తో అనడం.. ఆ వెంటనే అతను కూడా తలూపడం జరిగింది. ఇక మెహబూబ్ మాట్లాడుతూ.. ఎవరికి వారు గ్రూపులు కట్టేశారు..షార్ప్‌గా ఉండకపోతే వేస్టే అని పేర్కొన్నాడు. ఇక్కడ టాస్కులు మ్యాటరే కాదు.. మనమేమో ఇరగబడి టాస్కులు చేస్తున్నామని ఒకరినొకరు ఓదార్చుకున్నారు. మరి ఇప్పటికైనా ఎలా మెలగాలో నేర్చుకుంటే మంచిది. అయినా మెహబూబ్ ఈ వారం ఎలిమినేట్ కాబోతోన్నాడని టాక్ వినిపిస్తోంది. ఇది నిజమా కాదా? అసలు ఏం జరుగుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X