నిద్రపోతోన్న బిగ్‌బాస్.. తెలుగులో తప్ప అన్ని భాషల్లో మాట్లాడుతున్నారు.. సోషల్ మీడియాలో సెటైర్లు
బిగ్‌బాస్ తెలుగు నాల్గో సీజన్ గ్రాండ్‌గానే మొదలైంది. కానీ కంటెస్టెంట్ల విషయంలో ప్రేక్షకులు పెదవి విరిచారు. అంతే కాకుండా కొందరు కంటెస్టెంట్ల వివరాలు ఇప్పటికీ తెలియకపోవడం, వారిని ఇంతకు మునుపెన్నడూ చూసిన దాఖలాలు కూడా లేవన్నట్టుగా కామెంట్స్ చేస్తున్నారు. అయితే మొదటి రోజు నామినేషన్ ప్రక్రియ అంటూ అంతా గందరగోళం గడిచింది. ఇక రెండో రోజు షో చూస్తే అది అసలు తెలుగు బిగ్‌బాసేనా? అన్న అనుమానం కలగక మానదు.

మొదటి రోజు అలా..
మొదటి రోజు కరాటే కళ్యాణి వర్సెస్ సుజాత, సూర్యకిరణ్ మోనాల్ అభిజీత్ మధ్య గొడవతో గడిచింది. మొదటి వారానికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియలో మరింత వాగ్వాదం జరిగి వెక్కి వెక్కి ఏడ్చే వరకు వచ్చింది వ్యవహారం. ఇక మొదటి రోజు లాగే రెండో రోజూ కూడా ఏడుపులు పెడబొబ్బులే ఉన్నాయి.

ఆరియానా అలా..
నైబర్ రూంలొ ఉన్న ఆరియానా బిగ్‌బాస్ హౌస్‌మేట్స్‌కు ఫోన్ చేసి కాస్త ఓవరాక్షన్ చేసింది. తెలుగులో మాట్లాడకుండా ఇంగ్లీష్‌లో పోజులు కొట్టింది. ఆమె చేసిన అతికి వారికి ఆ రోజంతా ఫుడ్ లభించలేదు. చివరకు నేరుగా తేల్చుకోండని బిగ్‌బాస్ రెచ్చిగొట్టి పంపాడు.

మోనాల్ ఇలా..
మోనాల్ పరిస్థితిలో ఎలాంటి మార్పులు రాలేదు. మొదటి రోజు ఎంతగా ఏడ్చిందో అంతకు మించి రెండో రోజు ఏడ్చింది. ఇక హిందీలో తన బాధ చెప్పుకుంది. కానీ ఆ బాధ ఏంటో తెలుగు ప్రేక్షకులకు అర్థం అవ్వాలి కదా. వంట గది అంటుంది..వెజ్ నాన్ వెజ్‌కు చపాతీకీ, ఆమ్లేట్‌కు సపరేట్ ప్యాన్ వాడమంటోంది.. మళ్లీ కన్నీటి దారలను ప్రవహింపజేస్తోంది. ఇక మోనాల్‌ను చూసే ప్రేక్షకులకు చిరాకు తప్ప ఇంకెలాంటి ఫీలింగ్ కలగడం లేదనిపిస్తోంది.

తమిళంలో వాయగొడుతున్న ఆ ఇద్దరు..
గతంలో తమిళం నుంచి బాబా భాస్కర్ ఒక్కరే వచ్చారు. కానీ ఈ సారి అమ్మ రాజశేఖర్, సూర్య కిరణ్ ఇద్దరు వచ్చారు. ఈ ఇద్దరూ కలిసి తమిళంలో మాట్లాడి చంపేస్తున్నారు. నిన్న ఏకంగా తమిళంలో పాటలు పాడుకుంటూ ఉంటే అందరూ కలిసి స్టెప్పులు వేశారు.విచిత్రమేంటంటే.. ఇంటి నియమాలు వివరించిన శిక్షకురాలైన కరాటే కళ్యాణి కూడా వారితో కలిసి కాలు కదిపింది.
Recommended Video

నిద్రపోతోన్న బిగ్‌బాస్..
ఇక సోషల్ మీడియాలో స్టార్ మా, బిగ్‌బాస్ యూనిట్‌పై ఫైర్ అవుతున్నారు. స్టార్ మాకు తెలుగు ఆడియెన్స్ అంటే పట్టదని, ఇక ఇంట్లో తెలుగు తప్ప అన్ని భాషలు మాట్లాడుతూ ఉంటే బిగ్‌బాస్ నిద్ర పోతున్నాడని సెటైర్స్ వేస్తున్నారు. మరి ఇప్పటికైనా ఇంట్లో ఏదైనా మార్పు రావడానికి కఠినమైన శిక్షలు విధిస్తాడేమో చూడాలి.


Click it and Unblock the Notifications











