సోహెల్‌ను వదలని అరియానా.. ఓ రేంజ్‌లో ఆడేసుకుంటోంది!!
బిగ్‌బాస్ హౌస్ ఎనిమిదో వారంలో డే కేర్ సెంటర్‌గా మారింది. ఈ క్రమంలో కంటెస్టెంట్లను చిన్న పిల్లలుగా, కేర్ టేకర్స్‌గా మార్చేశాడు. పదకొండు మంది కంటెస్టెంట్లలో ఐదుగురిని చిన్న పిల్లలుగా, మరో ఐదు గురిని వారికి కేర్ టేకర్‌గా పెట్టారు. లాస్యను సంచాలక్‌గా నియమించాడు. పిల్లల టీంలో అరియానా, హారిక, మెహబూబ్, అమ్మ రాజశేఖర్, అవినాష్‌లను పెట్టాడు. అరియానాకు సోహెల్, హారికకు మోనాల్, మెహబూబ్‌కు అఖిల్, అమ్మ రాజశేఖర్‌కు అభిజిత్, అవినాష్‌కు నోయల్ కేర్ టేకర్‌లుగా ఉంటారని బిగ్ బాస్ తెలిపాడు.
బిగ్ బాస్ డే కేర్ సెంటర్‌లో నియమాలు ఓరేంజ్‌లో ఉన్నాయి. కొంటె పిల్లలు చేసే అల్లరిని భరించాలని, వారికి టైంకు లంచ్ బాక్స్ ఇవ్వాలని, ఎంటర్టైన్ చేయాలి, ఏడుపు అలారమ్ వచ్చినప్పుడు బట్టలు, డైపర్స్ మార్చాలని తెలిపాడు. ఇక చిన్న పిల్లలుగా మారే చాన్స్ రావడంతో ఒక్కొక్కరు రెచ్చిపోయారు. మరీ ముఖ్యంగా అరియానా, అవినాష్‌లు కేర్ టేకర్ల బెండు తీశారు. అవినాష్ కేర్ టేకర్ నోయల్ కావడం, నోయల్ మామూలుగానే ఎక్కువగా పని చేయడు.

అలా అవినాష్ మిగతా కేర్ టేకర్లను విసిగిస్తూ రచ్చ చేస్తున్నాడు. అందరి కంటే అరియానా మాత్రం ఎక్కువగా రెచ్చిపోతోంది. పాపం అరియానా ధాటికి సోహెల్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. ఎత్తుకుంటున్నాడు.. గుర్రమెక్కి ఆడిస్తున్నాడు.. భుజాలపై మోసుకుంటూ తిప్పుతున్నాడు.. చంటి పిల్లలా అరియానా చేసే మారానికి సోహెల్ కింద పడిపోయేలా ఉన్నాడు. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలోనూ సోహెల్ అరియానాను ఎత్తుకునే ఉన్నాడు. కింద కూడా నడవాలి అమ్మా అంటూ అరియానాను వేడుకున్నాడు.


Click it and Unblock the Notifications











