టాస్క్‌లో కూడా వదిలపెట్టడం లేదు.. మోనాల్‌ను టార్గెట్ చేసిన అవినాష్
బిగ్ బాస్ ఇంట్లోకి అడుగుపెట్టిన క్షణం నుంచి అవినాష్ పులిహెర కలపడం ప్రారంభించాడు. మొదటగా మోనాల్‌తోనే కలిపేశాడు. తనది కూడా పెద్ద ఫ్యామిలీ అంటూ ట్రాకు వేయడం ప్రారంభించాడు. మొదట్లో అంతగా వర్కవుట్ కాలేదు. కానీ అభిజిత్ దూరమయ్యాక అవినాష్‌తో ట్రాకు బాగానే కలిపింది. రాత్రి పూట ఇద్దరూ కలిసి బాగానే రచ్చ చేస్తున్నారు. ఈ మధ్యే మోనాల్ అవినాష్‌కు ముద్దు కూడా పెట్టింది.
మోనాల్ ముద్దు పెట్టడంతో అవినాష్ గాల్లో తేలిపోయాడు. మోనాల్ మనసులో తానే ఉన్నానని, ఏ అంటే అవినాష్ అంటూ తెగ సంబరపడిపోయాడు. అయితే వెంటనే మళ్లీ గాలి తీసేసింది. అవినాష్ కమెడియన్ అంటూ ఆశలపై నీళ్లు చల్లేసింది. ఇలా ఈ ఇద్దరూ బాగానే వ్యవహారాన్ని నడిపిస్తున్నారు. మొత్తానికి అవినాష్ మాత్రం కామెడీ అంటూనే అన్నీ కానిచ్చేస్తున్నాడు. ఇక నిన్నటి డే కేర్ సెంటర్ టాస్క్‌లోనూ అవినాష్ మోనాల్‌ను వదిలిపెట్టలేదు.

స్కూల్‌లో టీచర్‌లా వచ్చిన మోనాల్‌కు అవినాష్ లైన్ వేశాడు. ఏ అంటే యాపిల్.. బీ అంటే బంతి అని నేర్పిస్తూ వచ్చింది. ఎల్ అంటే లవ్ అంటూ మెనాల్‌కు రివర్స పాఠాలు చెప్పారు. అవినాష్ లేచి వచ్చి.. ఎల్ అంటే లవ్.. లవ్ అంటే మోనాల్ అంటూ అందరి ముందే చెప్పాడు. తాను చెప్పడమే కాకుండా అందరితో అనిపించాడు కూడా. అలా అందరూ అనడంతో మోనాల్ నవ్వు ఆపుకోలేకపోయింది.


Click it and Unblock the Notifications











