Don't Miss!
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
- News Ys Jagan Attack case: జగన్ పై రాయి దాడి కేసులో మరో కీలక పరిణామం..!
- Travel ఏపీలోని రైలు ప్రయాణికులకు శుభవార్త..వేసవి ప్రత్యేక రైళ్లు ఆగే స్టేషన్లివే..!
- Technology మే 7 న Apple 'Let Loose' ఈవెంట్! ఏ యే గాడ్జెట్లు లాంచ్ కాబోతున్నాయి? వివరాలు
- Finance IT News: రిక్రూట్మెంట్ రూటు మార్చిన ఇన్ఫోసిస్.. టాటా Elxsi న్యూ హైరింగ్..
- Sports ధోనీకి కోపం వచ్చింది.. భయపడిన కెమెరామెన్ Video
- Automobiles 'కావ్య మారన్' ఖరీదైన కార్లు ఇవే! ఇక్కడ చూడండి
ఆ డైపర్లు ఏంటో.. ఆ టాస్కులేంటో.. అంతా రచ్చ రచ్చ!!
బిగ్ బాస్ హౌస్ ఎనిమిదో వారంలో డే కేర్ సెంటర్‌గా మారింది. ఎనిమిదో వారానికి గానూ బిగ్ బాస్ కంటెస్టెంట్లను చిన్న పిల్లలుగా, కేర్ టేకర్స్‌గా మార్చేశాడు. పదకొండు మంది కంటెస్టెంట్లలో ఐదుగురిని చిన్న పిల్లలుగా, మరో ఐదు గురిని వారికి కేర్ టేకర్‌గా పెట్టారు. లాస్యను సంచాలక్‌గా నియమించాడు. పిల్లల టీంలో అరియానా, హారిక, మెహబూబ్, అమ్మ రాజశేఖర్, అవినాష్‌లను పెట్టాడు. అరియానాకు సోహెల్, హారికకు మోనాల్, మెహబూబ్‌కు అఖిల్, అమ్మ రాజశేఖర్‌కు అభిజిత్, అవినాష్‌కు నోయల్ కేర్ టేకర్లుగా ఉంటారని బిగ్ బాస్ తెలిపాడు.
డే కేర్ సెంటర్లో పిల్లలు చేసే అల్లరిని భరించాలని, అసలే వారు కొంటె పిల్లలని బిగ్ బాస్ ముందే హెచ్చరించాడు. ఇలాంటి చాన్స్ దొరికితే అరియానా ఆగుతుందా? అరియానాను చూసి అవినాష్ ఆగుతాడా? ఇద్దరూ కలిసి ఇళ్లంతా రచ్చ రచ్చ చేశారు. వారి వారి కేర్ టేకర్లకు ముచ్చెటమలు పట్టించారు. మరీ ముఖ్యం అరియానా కేర్ టేకర్ అయిన సోహెల్‌కు మాత్రం చుక్కలు చూపించింది.
సమయానుగుణంగా వారికి లంచ్ బాక్సులు ఇవ్వాలని, వారిని ఏడ్వకుండా ఎంటర్టైన్ చేయాల్సి ఉంటుందని కేర్ టేకర్లకు సూచనలిచ్చాడు. అంతే కాకుండా పిల్లల ఏడుపు సౌండ్ వినిపిస్తే బట్టలు మార్చాలి.. డైపర్లు తొడగాలని టాస్క్ఇచ్చాడు. దీంతో అమ్మ రాజశేఖర్, హారికి, అవినాష్‌లు డైపర్లతో మరీ ఘోరంగా ఉన్నారు. అరియానా మాత్రం డైపర్లు వేసుకునేందుకు అంగీకరించనట్టు కనిపిస్తోంది.