twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అరియానాకు ప్రపోజ్ చేసిన మెహబూబ్.. ఐ లవ్యూ అని చెప్పేశాడు!

    |

    బిగ్‌బాస్ హౌస్ ఎనిమిదో వారంలో డే కేర్ సెంటర్‌గా మారింది. డే కేర్ సెంటర్ టాస్క్‌లో పిల్లలైన అరియానా, అవినాష్, మెహబూబ్‌, హారిక, అమ్మ రాజశేఖర్‌లు చేసిన రచ్చ ఏ రేంజ్‌లో ఉందో అందరం చూశారు. చిన్న పిల్లలు అంటే ఎలా చేస్తారో అంతకు మించి రచ్చ రచ్చే చేశారు. మరీ ముఖ్యంగా అరియానా, అవినాష్‌లు ఇళ్లు పీకి పందిరి వేశారు. కేర్ టేకర్లకు ముచ్చెటమలు పట్టించారు. అరియానా అయితే సోహెల్‌ను ఓ రేంజ్‌లో వాడేసింది.

    స్కూల్‌కు వెళ్లిన పిల్లలు ఎలా అల్లరి చేస్తారు.. స్కూల్‌లో ఎలా కొట్టుకుంటారో అందరికీ తెలిసిందే. అచ్చం అలాగే పెన్సిల్, పెన్నులు, పుస్తకాల కోసం గొడవలు పెట్టుకున్నారు. చాక్లెట్లు దొంగతనం చేసుకున్నారు. దీని వల్ల ఇంట్లో పెద్ద గొడవలే జరిగాయి. ఇదంతా ఒక వైపు ఉంటే మెహబూబ్ మాత్రం అరియానా వెనుక పడ్డాడు. ఐ లవ్యూ అంటూ అరియానాకు ప్రపోజ్ చేశాడు. ఇది చిన్న పిల్లల్లా టాస్క్‌లో భాగంగానే చెప్పినట్టు కనిపిస్తోంది.

     Bigg Boss 4 Telugu Day Care Task Mehaboob Proposed Ariyana

    అరియానా లివింగ్ రూంలో కిందపడుకుని డ్రాయింగ్‌లు వేస్తుంటే.. మెహబూబ్ వచ్చి ఐ లవ్యూ చెప్పాడు. మనం స్నేహితులు కదా అంటూ ఐ లవ్యూ అని మళ్లీ చెప్పేశాడు. దీంతో అరియానా కాస్త సిగ్గుపడింది. ఇక స్కూల్‌లోనూ అరియానా వెంట పడ్డాడు. అరియానా ఐ లవ్యూ అంటూ మెహబూబ్ రెచ్చిపోయాడు. అయితే ఇదంతా టాస్క్‌లో భాగంగానే కావడంతో అరియానా లైట్ తీసుకున్నట్టు కనిపిస్తోంది.

    English summary
    Bigg Boss 4 Telugu Day Care Task Mehaboob Proposed Ariyana, Bigg Boss 4 Telugu Day Care Task Ariyana Annoys Sohel, Bigg Boss 4 Telugu Day Care Task Goes Viral, Bigg Boss 4 Telugu Abhijeet Lasya Noel Harika Conversation, Bigg Boss 4 Telugu Week 8 Akhil Talks With Abijeet About Monal, Ariyana And Avinash Celebrate Bathukamma, Bigg Boss 4 Telugu Week 7 Abhijeet Satires On Akhil Monal Romance, Prema Modhalaindhi Movie, Bigg Boss 4 Telugu Avinash Akhil About Ariyana, Amma Rajasekhar And Sohel Conversation About Divi, Bigg Boss 4 Telugu week 7.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X