Don't Miss!
- News బాలయ్య ఎన్నికల ప్రచార జోరు: కీలక హామీలు
- Sports CSK vs LSG: వారెవ్వా రాహుల్.. వాటే క్యాచ్!వీడియో
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
అరియానాకు ప్రపోజ్ చేసిన మెహబూబ్.. ఐ లవ్యూ అని చెప్పేశాడు!
బిగ్‌బాస్ హౌస్ ఎనిమిదో వారంలో డే కేర్ సెంటర్‌గా మారింది. డే కేర్ సెంటర్ టాస్క్‌లో పిల్లలైన అరియానా, అవినాష్, మెహబూబ్, హారిక, అమ్మ రాజశేఖర్‌లు చేసిన రచ్చ ఏ రేంజ్లో ఉందో అందరం చూశారు. చిన్న పిల్లలు అంటే ఎలా చేస్తారో అంతకు మించి రచ్చ రచ్చే చేశారు. మరీ ముఖ్యంగా అరియానా, అవినాష్‌లు ఇళ్లు పీకి పందిరి వేశారు. కేర్ టేకర్లకు ముచ్చెటమలు పట్టించారు. అరియానా అయితే సోహెల్‌ను ఓ రేంజ్లో వాడేసింది.
స్కూల్‌కు వెళ్లిన పిల్లలు ఎలా అల్లరి చేస్తారు.. స్కూల్లో ఎలా కొట్టుకుంటారో అందరికీ తెలిసిందే. అచ్చం అలాగే పెన్సిల్, పెన్నులు, పుస్తకాల కోసం గొడవలు పెట్టుకున్నారు. చాక్లెట్లు దొంగతనం చేసుకున్నారు. దీని వల్ల ఇంట్లో పెద్ద గొడవలే జరిగాయి. ఇదంతా ఒక వైపు ఉంటే మెహబూబ్ మాత్రం అరియానా వెనుక పడ్డాడు. ఐ లవ్యూ అంటూ అరియానాకు ప్రపోజ్ చేశాడు. ఇది చిన్న పిల్లల్లా టాస్క్‌లో భాగంగానే చెప్పినట్టు కనిపిస్తోంది.
అరియానా లివింగ్ రూంలో కిందపడుకుని డ్రాయింగ్లు వేస్తుంటే.. మెహబూబ్ వచ్చి ఐ లవ్యూ చెప్పాడు. మనం స్నేహితులు కదా అంటూ ఐ లవ్యూ అని మళ్లీ చెప్పేశాడు. దీంతో అరియానా కాస్త సిగ్గుపడింది. ఇక స్కూల్లోనూ అరియానా వెంట పడ్డాడు. అరియానా ఐ లవ్యూ అంటూ మెహబూబ్ రెచ్చిపోయాడు. అయితే ఇదంతా టాస్క్‌లో భాగంగానే కావడంతో అరియానా లైట్ తీసుకున్నట్టు కనిపిస్తోంది.