మటన్ కోసం రచ్చ.. అవినాష్ సోహెల్ వాగ్వాదం

బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లాక ప్రతీది ఆశ్చర్యమే అనిపిస్తుంది. అనిపించాలి కూడా. చిన్న కూల్ డ్రింక్‌ బాటిల్‌ను చూసినా, చాక్లెట్‌ను చూసినా టాపు లేచిపోయేలా అరవాల్సిందే. అప్పుడే వారు అసలుసిసలైన కంటెస్టెంట్లు.. అది బిగ్ బాస్ షో అనిపించుకుంటుంది. అలా నిన్నటి ఎపిసోడ్‌లో కంటెస్టెంట్లు మటన్ కోసం చేసిన హంగామా అంతా ఇంతా కాదు. అవినాష్ సోహెల్ ఇద్దరూ కూడా వాగ్వాదం చేసుకుంటూ ఉంటే మధ్యలోకిచాలా మంది వచ్చారు.

డే కేర్ సెంటర్ టాస్క్‌లో బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చిన జోడీగా సోహెల్ అరియానాలను లాస్య ఎంపిక చేసింది. వారికి ప్రత్యేక బహుమతులు ఇస్తానని బిగ్ బాస్ ఆదేశించాడు. అలా వారికి కొన్ని గిఫ్ట్స్ వచ్చాయి. అరియానా కోసం చాక్లెట్లు, కాఫీ బాటిల్ రాగా.. సోహెల్ కోసం మటన్ వచ్చింది. ఆ మటన్‌ను తాను ఒక్కడినే తింటానని అన్నాడు. ఒక్కడివే తింటావా? ఎవరు తయారు చేస్తారు? అంటూ అవినాష్ వాగ్వాదాన్ని మొదలుపెట్టాడు.

Bigg Boss 4 Telugu Day Care Task Winner sohel gets mutton

అవినాష్ సోహెల్ వాగ్వాదంలో అఖిల్ ఎంట్రీ ఇచ్చాడు. అఖిల్‌కు ఇస్తానని సోహెల్ అన్నాడు. ఆ తరువాత మెహబూబ్‌కు కూడా ఇస్తానని అన్నాడు. తనకు ఇవ్వనని చెప్పడంతో అమ్మ రాజశేఖర్ ఫీల్ అయ్యాడు. ఫ్రిజ్‌లో దాచి పెట్టిన మటన్‌ను తీసి పైకి విసిరాడు. మెహబూబ్ దాన్ని క్యాచ్ పట్టాడు. కానీ అంతలోపే కొన్ని ముక్కలు కిందపడిపోయాయి. మటన్‌ను అలా వేస్ట్ చేయకండంటూ అఖిల్ మళ్లీ దాన్ని ఫ్రిజ్‌లో దాచిపెట్టాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X