Don't Miss!
- Sports సారీ బ్రదర్.. కావాలని కొట్టలేదు - పంత్ ఎమోషనల్ Video
- Finance Nestle India: అదిరిపోయే లాభాలు ప్రకటించిన నెస్లే ఇండియా..
- News రాయలసీమలో టీడీపీకి బిగ్ షాక్ .. వైసీపీలోకి కీలక నేత
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
బేకార్గాడినా.. నాకేం పనిలేదా.. హారికపై అభిజిత్ ఫైర్
బిగ్ బాస్ ఎనిమిదో వారంలో డే కేర్ సెంటర్ అనే టాస్క్ ఇచ్చాడు. కంటెస్టెంట్లను చిన్న పిల్లలుగా, కేర్ టేకర్స్‌గా మార్చేశాడు. పదకొండు మంది కంటెస్టెంట్లలో ఐదుగురిని చిన్న పిల్లలుగా, మరో ఐదు గురిని వారికి కేర్ టేకర్‌గా పెట్టారు. లాస్యను సంచాలక్‌గా నియమించాడు. పిల్లల టీంలో అరియానా, హారిక, మెహబూబ్, అమ్మ రాజశేఖర్, అవినాష్‌లను పెట్టాడు.
అరియానాకు సోహెల్, హారికకు మోనాల్, మెహబూబ్‌కు అఖిల్, అమ్మ రాజశేఖర్‌కు అభిజిత్, అవినాష్‌కు నోయల్ కేర్ టేకర్లుగా ఉంటారని బిగ్ బాస్ తెలిపాడు. ఇక ఈ క్రమంలో పిల్లలు చేసిన అల్లరి, తప్పులు పెద్ద గొడవనే క్రియేట్ చేసినట్టు కనిపిస్తోంది.
అమ్మ రాజశేఖర్ హారికలు అలా..
చిన్న పిల్లలు అంటే ఎలా ఉంటారు.. ఏదో ఒకటి లాక్కోవడం, దొంగతనం చేయడం, అదే కావాలని మారం చేయడం లాంటి చేస్తుంటారు. ఇక హారిక అమ్మ రాజశేఖర్ టాస్క్ మొదలైన క్షణం నుంచి చిన్న పిల్లల పాత్రల్లో జీవించేశారు. హారిక కొంటె పిల్లగా మారి అమ్మ రాజశేఖర్‌ను ఏడిపించసాగింది. అమ్మ రాజశేఖర్ కూడా చిన్న పిల్లాడు గుక్కపట్టి ఏడ్చినట్టు ఏడ్చేశాడు.
దొంగతనం చేయడంతో..
అమ్మ రాజశేఖర్ హారిక వద్ద నుంచి ఏదో దొంగతనం చేశాడు. ఆ తరువాత మళ్లీ అమ్మ రాజశేఖర్ పుస్తకం హారిక దొంగతనం చేసింది. తన పౌచౌ తీసుకున్నాడు అది ఇవ్వమనండి అంటూ హారిక గొడవ చేసింది. ఆ గొడవ ముగిశాక అరియానా దగ్గర పెన్సిల్ లాక్కోవడం మరో గొడవ మొదలైంది.
మోనాల్‌పై ఫైర్..
అరియానా దగ్గర హారిక పెన్సిల్ కొట్టేయడంతో గొడవ మొదలైనట్టు కనిపిస్తోంది. మోనాల్ వచ్చి సర్దిచెప్పడం, అరియానా మీద పడి మరీ తీసుకోడంతో హారికకు దెబ్బలు తగిలాయి. అయితే ఈ విషయంలో గొడవలు భారీగానే జరిగేట్టు కనిపిస్తున్నాయి.
కేర్ టేకర్లతో గొడవలు..
అమ్మ రాజశేఖర్ దొంగతనం చేసిన విషయం తెలియకపోవడంతో మోనాల్ హారికను అన్నట్టు చెబుతోంది. అమ్మ రాజశేఖర్ కూడా మోనాల్‌పై ఫైర్ అవుతున్నాడు. అభిజిత్ కూడా హారికపై మాటలు తూలుతున్నాడు. ప్రోమోలో మాత్రం మంచి ఫైర్ కనిపిస్తుంది. తీరా ఎపిసోడ్లో తుస్సుమనిపిస్తాడే ఏంటో చూడాలి.
బేకార్గాడినా..
పాకెట్లోంచి తీసుకోవడం ఏంటి లాక్కోవడమా? దొంగతనమా? అంటూ హారికపై ఫైర్ అవ్వడం, అది అప్పుడు చెప్పాల్సింది అంటూ హారిక కౌంటర్ వేయడం బాగానే హైలెట్ అయింది. ఎప్పుడు మాట్లాడాలో నువ్ నాకు నేర్పకు.. నాకేమైనా బేకార్ గాడినా. పని లేదా.నీతో మాట్లాడటానికి అంటూ రెచ్చిపోయాడు. దీంతో హారిక అక్కడి నుంచి లేచి వెళ్లిపోయింది. ప్రోమోలో అయితే బాగానే కట్ చేశారు. కానీ ఎపిసోడ్లో ఎలా ఉంటుందో చూడాలి.