Don't Miss!
- News
మంగ్లీ కారుపై దాడి జరిగిందా?: క్లారిటీ ఇచ్చిన సింగర్
- Sports
Sarfaraz Khan : సచిన్ కొడుకుతో పోల్చుకున్న సర్ఫరాజ్.. అది విని బాధపడ్డానన్న తండ్రి!
- Lifestyle
పురుషుల్లో వంధ్యత్వానికి మద్యమే కారణం! తాగితే ఏం జరుగుతుందంటే..
- Finance
దుమ్ము దులిపిన బ్యాంక్స్.. వీటి లాభాలు చూస్తే కళ్లు తిరగాల్సిందే.. ఎంత డబ్బో..
- Automobiles
ఈ రోజు నుంచి ప్రారంభం కానున్న 'మిహోస్' బుకింగ్స్.. డెలివరీలు ఎప్పుడంటే?
- Technology
Infinix నుంచి కొత్త ప్రీమియం ల్యాప్‌టాప్! ధర ,స్పెసిఫికేషన్లు చూడండి !
- Travel
భాగ్యనగరంలో ప్రశాంతతకు చిరునామా.. మక్కా మసీదు!
మీరు అతి చూశారు.. నేను నిజాయితీ చూసా.. అరియానాపై దేవీ నాగవల్లి కామెంట్స్
బిగ్ బాస్ షోలో దేవీ నాగవల్లి క్రియేట్ చేసిన మార్క్ అందరికీ తెలిసిందే. బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇవ్వకముందు దేవీ నాగవల్లి అంటే అందరికీ నెగెటివ్ అభిప్రాయమే ఏర్పడింది. అయితే ఆమె ఎంత మంచిగా ఆట ఆడినా, నిజాయితీగా, ముక్కుసూటిగా ఉన్నా కూడా బయటకు రావాల్సివచ్చింది. దానికి కారణం ఆమెపై అంతకు ముందు ఏర్పడిన నెగెటివ్ అభిప్రాయమే. అలా దేవీ నాగవల్లి మూడో వారంలో ఎలిమినేట్ అయిపోయింది.

అరియానా ఏడుపులు..
యాంకర్ అయినా దేవీ నాగవల్లి అదే ప్రొఫెషన్‌కు చెందిన అరియానా బాగా క్లోజ్ అయ్యారు. ఉన్న మూడు వారాల్లో అరియానా దేవీ నాగవల్లి బాగా దగ్గరయ్యారు. ఎవరో ఒకరు టైటిల్ కొట్టాలి.. ఈ సారి మహిళలలే విజేత అవ్వాలని ఇద్దరూ ముచ్చట్లు పెట్టుకున్నారు. కానీ అదే రోజున దేవీ నాగవల్లి ఎలిమినేట్ అయింది. అరియానా ఏడుపులు హద్దులు దాటిపోయాయి.

అందరూ షాక్..
దేవీ నాగవల్లిని పట్టుకుని అరియానా ఏడుపులను చూసి ఏమిటీ అతి అని అందరూఅనుకున్నారు. సొంత అక్కలా అయిపోయిందంటూ అరియానా ఏడిచిన ఏడుపులు ఇప్పటికీ అందరికీ గుర్తున్నాయి. అలాంటి అరియానా ఇప్పుడు టాప్5లోకి చేరింది.

దేవీ నాగవల్లి మద్దతు..
అరియానా నామినేషన్‌లో ఉన్న ప్రతీసారి దేవీ నాగవల్లి మద్దతు ఇస్తూనే ఉంది. అరియానాకు ఓట్లు వేయండంటూ ప్రచారం చేస్తూ అరియానాకు అండగా నిలబడుతూ వస్తోంది. అలాంటి అరియాను టైటిల్ విజేతగా నిలబెట్టేందుకు దేవీ నాగవల్లి బాగానే కష్టపడుతున్నట్టు కనిపిస్తోంది.

అతి చూశారు..
అరియానా అతికి మారుపేరుగా మారిందని నెటిజన్లు ఆమెను ట్రోల్ చేస్తుంటారన్న సంగతి తెలిసిందే. అలా ఆ పాయింట్‌ను చూపిస్తూ.. అరియానాకు దేవీ నాగవల్లి మద్దతు తెలిపింది. మీరు అతి చూశారు.. నేను నిజాయితీ చూశాను అంటూ దేవీ నాగవల్లి పోస్ట్ చేసింది. అరియానాకు ఓటు వేసి గెలిపించండని కోరింది.
Recommended Video

ఓటింగ్ రచ్చ..
టాప్ 5 కంటెస్టెంట్లుగా అభిజిత్ సోహెల్ అరియానా అఖిల్ హారికలు ఇంట్లో హాయిగా ఉన్నారు. కానీ బయట వారి ఫ్యాన్స్ మాత్రం వారిని గెలిపించేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే బయటి ఓటింగ్ ట్రెండ్, అనధికారిక పోల్స్‌ను బట్టి చూస్తే అభిజిత్ ఎవ్వరికీ అందనంత దూరంలో ఉన్నాడు. ఆ తరువాత అరియానా, సోహెల్ ఉన్నారు. టైటిల్ పోటీలో అఖిల్ హారికలు అసలు లెక్కలోకే రావడం లేనట్టుంది.