బిగ్ బాస్‌లో అతనంటే ఇష్టం.. కానీ విజేత మాత్రం.. ధన్ రాజ్ సెన్సేషనల్ కామెంట్స్
బిగ్ బాస్ షోలో పార్టిసిపేట్ చేసిన వచ్చిన వారికి అక్కడి పరిస్థితులు ఏంటో సులభంగా అర్థమవుతాయి. కంటెస్టెంట్లు ఎందుకు అలా ప్రవర్తించారు.. అక్కడ ఏం జరిగి ఉంటుందని అంచనా వేయగలరు. అలా మొదటి సీజన్ పార్టిసిపెంట్ అయిన ధన్ రాజ్ నాల్గో సీజన్‌పై తన అభిప్రాయాన్ని చెప్పాడు. దీపావళి సందర్భంగా అలీతో జరిగిన ఇంటర్వ్యూలో ధన్ రాజ్, గంగవ్వ, అమ్మ రాజశేఖర్‌లు పాల్గొన్నారు. ఓ మీడియా చానెల్‌లో ప్రసారమైన ఈ ఇంటర్వ్యూలో అనేక విషయాలు బయటకు వచ్చాయి.

అతనే ఇష్టం..
బిగ్ బాస్ నాల్గో సీజన్ గమనిస్తూ వస్తున్నానని ధన్ రాజ్ చెప్పుకొచ్చాడు. అయితే మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు అభిజిత్ ఒకేలా ఉన్నాడని, ఏమాత్రం మార్పులు కనిపించడం లేదని అందుకే నాకు అభిజిత్ అంటే చాలా ఇష్టమని ధన్ రాజ్ తన ఫేవరేట్ కంటెస్టెంట్ గురించి చెప్పాడు.

అవినాష్ స్నేహితుడైనా..
అభిజిత్ గురించి ధన్ రాజ్ చెబుతూ.. అవినాష్ బిగ్ బాస్ కోసం వేరే షోను వదిలిపెట్టి వెళ్లాడు.. అతను నాకు కు నాకు స్నేహితుడైనా కూడా అభిజిత్ ఇష్టమని చెబుతున్నాను.. ఎందుకంటే అవినాష్ ఈ మధ్య తనలోని కోణాన్ని బయటపెడుతున్నాడు.. కోప్పడుతున్నాడు.. నవ్వించడం, నవ్వడం తెలుసని అనుకుంటాం. కానీ ఇప్పుడిప్పుడే లోపలవి బయటకు వస్తున్నాయి. కానీ అభిజిత్ మాత్రం మొదటి నుంచి అలాగే ఉన్నాడని చెప్పుకొచ్చాడు.

గంగవ్వ అలా..
అదే ఇంటర్వ్యూలో గంగవ్వ ఓ సందర్భంలో సీజన్ విన్నర్ గురించి ఓ కామెంట్ చేసింది. ఎవరు అయ్యే చాన్స్ ఉందని గంగవ్వను అడిగితే.. తడుముకోకుండా అభిజిత్ పేరు చెప్పింది. అభిజిత్‌కే ఎక్కువ ఓట్లు వస్తున్నాయి.. అభిజితే గెలుస్తాడంటూ ఎంతో నమ్మకంగా చెప్పింది.

ఓ కమెడియన్‌గా..
అయితే అభిజిత్ తనకు ఇష్టమైనా కూడా ఓ కమెడియన్ మరో కమెడియన్ విన్నర్ అవ్వాలని, అయితే చూడాలని ఉందని ధన్ రాజ్ చెప్పుకొచ్చాడు. ధన్ రాజ్ అలా చెబుతూ ఉంటే.. గంగవ్వ మాత్రం అవినాష్ అస్సలు విన్నర్ కాడని బలంగా చెప్పింది. ఇప్పటికైతే టాప్ 5 కంటెస్టెంట్ల గురించి అందరూ అంచనాలు పెట్టుకుంటున్నారు. నాల్గో సీజన్ టైటిల్ విన్నర్‌గా ఎవరు నిలుస్తారో చూడాలి మిర.


Click it and Unblock the Notifications











