అభిజీత్-మోనాల్ మళ్లీ కలిసి పోయినట్టున్నారే.. బిగ్‌బాస్ ఆటలోని మర్మాన్ని కనిపెట్టేశాడు!!
బిగ్‌బాస్ షో మూడోవారంలో రసవత్తరంగా సాగుతోంది. ఉక్కు హృదయం అనే టాస్క్‌తో బిగ్‌బాస్ ఇంట్లో రచ్చ రచ్చగా తయారైంది. రోబోలు, మనుషులుగా విడగొట్టి అందరి మధ్య విబేధాలు క్రియేట్ అయ్యేలా చేశాడు. ఈ నాల్గో సీజన్‌లో ఇచ్చిన మొదటి ఫిజికల్ టాస్కే ఓ రేంజ్‌లో హిట్టయింది. ఈ టాస్క్ ద్వారా కొందరు హీరోలయ్యారు.. ఇంకొందరు జీరోలయ్యారు. కంటెస్టెంట్లపై అప్పటి వరకు ఉన్న క్రేజ్, ఒపినీయన్ మారిపోయింది.

ఆ ఒక్క ప్లాన్‌తో..
రోబో టీం సభ్యుల్లోని అభిజీత్ కిడ్నాప్ ప్లాన్ వేయడం, మనుషుల టీంను మాయ మాటలు చెప్పి మోసం చేయడంతో హీరో అయిపోయాడు. అద్భుతమైన స్ట్రాటజీ అందరూ ఆకాశానికెత్తేశారు. అయితే మనుషుల టీం సభ్యులు మాత్రం అది పర్సనల్‌గా తీసుకున్నారు. ఆడవాళ్లను అడ్డం పెట్టుకుని ఆట ఆడారు, మోసం చేశాడు.. మగతనం లేదా అంటూ అఖిల్, సోహెల్, మెహబూబ్ రెచ్చిపోయారు.

మోనాల్ కూడా అంతే..
ఇక అభిజీత్ వేసిన ప్లాన్ మనుషుల టీంలో ఉన్న మోనాల్‌కు నచ్చలేదు. ఇకపై అభిజీత్‌ను నమ్మను మాట్లాడను అంటూ నోయల్ వద్ద తన బాధను విన్నవించుకుంది. ఒక వేళ అభిజీత్ మన టీంలో ఉంటే అలాంటి ప్లాన్ వేసి ఉంటే.. అంటూ నోయల్ విడమరిచి చెప్పేసరికి మోనాల్ కాస్త అర్థం చేసుకున్నట్టుంది.

మధ్యలో హారిక..
అయితే అభితో మాట్లాడదామని ప్రయత్నిస్తుంటే అతను సమాధానం ఇవ్వడం లేదని మధ్యలో హారిక వస్తుందని తన బాధను దేవీ నాగవల్లితో చెప్పుకొచ్చింది. ఇక అభిజీత్ మోనాల్ విడిపోతారు.. మాట్లాడుకోరేమో అని అనుకుంటుండగా తాజాగా ఓ ప్రోమోను విడుదల చేశారు. అందులో వీరిద్దరు కలిసిపోయినట్టు కనిపిస్తోంది.

కలిసిపోయినట్టు కనిపిస్తోంది..
మోనాల్ అభిజీత్ బాగానే కలిసిపోయినట్టు కనిపిస్తోంది. ఇక అభిజీత్ కూడా బిగ్ బాస్ ఆట గురించి బాగానే అర్థం చేసుకున్నాడని తెలుస్తోంది. నామినేషన్‌లో నామినేట్ చేస్తారు.. టాస్కుల వల్ల ఇలా కలుస్తాం.. ఎలిమినేట్ అయితే ఏడుస్తాం.. ఇదే బిగ్ బాస్ అంటూ చెప్పుకొచ్చాడు.
Recommended Video
కెప్టెన్ గంగవ్వ.. వైల్డ్ కార్డ్‌గా స్వాతి..
నేటి ఎపిసోడ్‌లో రెండు సర్ ప్రైజ్‌లు ఉండబోతోన్నాయి. మూడో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా స్వాతీ దీక్షిత్ బిగ్‌బాస్ ఇంట్లో అడుగుపెట్టబోతోంది. ఇక కెప్టెన్సీ టాస్క్‌లో గంగవ్వ విజయం సాధిస్తుంది. ఇక నాల్గో వారం కెప్టెన్‌గా గంగవ్వకు బిగ్ బాస్ ఇంటిపై అధికారం రాబోతోందన్న మాట.


Click it and Unblock the Notifications











