మోనాల్ వ్యవహారంపై చర్చ.. ఆ విషయంలో దివికి బాగానే క్లారిటీ ఉంది.. బ్యూటీ విత్ బ్రెయిన్!!

బిగ్‌బాస్ షోలో ఓ మ్యాజిక్ ఉంటుంది. కొంతమందిని ఇంట్లో పడేసి వదిలేస్తాడు. వారిలో వారే పోట్లాడుకోవాలి.. ప్రేమించుకోవాలి.. ద్వేషించుకోవాలి.. దగ్గరవ్వాలి.. దూరమవ్వాలి. అలా బిగ్ బాస్ తన చక్రాన్ని తిప్పి వ్యూహాలు మార్చేస్తుంటాడు. బిగ్ బాస్ ఆడే ఆటలో అందరూ బలవుతుంటారు. అయితే కొందరు మాత్రమే ఆ ఆటలో చిక్కుకోకుండా తమ ప్రత్యేకతను చాటుకుంటూ చివరి వరకు నిలుస్తారు. గెలుస్తారు. అయితే బిగ్ బాస్ ఇంటి సభ్యులందరూ ఎప్పుడు ఎలా ఉంటారో ఎలా ప్రవర్తిస్తారో ఎవ్వరూ చెప్పలేరు.

ట్రయాంగిల్ కథ..

ట్రయాంగిల్ కథ..

బిగ్ బాస్ నాల్గో సీజన్‌లో మొదటి నుంచి అభిజిత్ మోనాల్ అఖిల్ ట్రయాంగిల్ కథలో ఎవ్వరికీ ఓ క్లారిటీ రావడం లేదు. దీనికి తోడు ప్రతీ వీకెండ్‌లో నాగార్జున ఇంత ఉప్పందిస్తాడు. మోనాల్ మనసులో A అనే అక్షరం ఉందని హింటిస్తూ అందరిలోనూ ఏవో అనుమానాలను రేకెత్తిస్తుంటాడు. అయితే A అనే అక్షరంలోనే పెద్ద గందరగోళం ఏర్పడింది. ఆ క్రమంలో అభిజిత్, అఖిల్ ఇద్దరూ కూడా వస్తారు.

గొడవలు, ప్రేమలు..

గొడవలు, ప్రేమలు..

మోనాల్ కొన్ని సార్లు అఖిల్‌కు దగ్గరగా ఉంటుంది. ఇంకొన్ని సార్లు అభిజిత్‌తో క్లోజ్‌గా ఉంటుంది. నిన్నటి ఎపిసోడ్‌లో అఖిల్ తనతో మాట్లాడటం లేదని మోనాల్ తెగ ఫీలైంది. తెలుగులో ముద్దు ముద్దుగా మాట్లాడినా అఖిల్ మాత్రం తన పంతాన్ని వీడలేదు. దీంతో మోనాల్ అభిజిత్ దగ్గరకు వెళ్లి ఏదో జీవిత సారం గురించి ముచ్చట్లు పెట్టంది. జీవితం అంటే గుణపాఠం, జీవితం అంటే ప్రయాణం ఇలా అభి, మోనాల్ ఏదేదో మాట్లాడుకున్నారు.

దివి, అవినాష్ ముచ్చట్లు..

దివి, అవినాష్ ముచ్చట్లు..

మోనాల్ అఖిల్ విషయంపై దివి అవినాష్‌లు స్విమ్మింగ్ పూల్ వద్ద బాగానే చర్చించుకున్నారు. ఓ అమ్మాయికి అబ్బాయి ఏం ఎక్స్‌పెక్ట్ చేసి మాట్లాడుతున్నాడన్న విషయం అర్థమవుతుంది. ఎక్కవగా మాట్లాడుతున్నాడంటే ముందే మనం చెప్పేయాలి.. మనం ఓన్లీ ఫ్రెండ్స్ ఇంతకు మించి ఏం లేదని ఓ క్లారిటీ ఇవ్వాలి అంటూ అవినాష్‌తో దివి చెప్పుకొచ్చింది.

Recommended Video

Actress Seerat Kapoor Gym Workout Video
కనీసం వాళ్లకు అయినా..

కనీసం వాళ్లకు అయినా..

అలాంటివి బయట జరిగితే క్లారిటీ ఇవ్వకపోయినా.. ఇక్కడ బిగ్ బాస్‌లో ఇవ్వాలి. అందరం ఒకే చోట ఉంటాం.. ఆ స్పేస్ దొరుకుతుంది.. అందరికీ క్లారిటీ ఇవ్వకపోయినా కనీసం వాళ్లకు అయినా ఓ క్లారిటీ ఉండాలి.. ఇచ్చుకోవాలి.. అంటూ మోనాల్ అఖిల్ వ్యవహారంపై బాగానే మాట్లాడింది. ఆ క్లారిటీ ఇవ్వకపోవడం వల్లే అఖిల్ ఒంటరిగా ఏడ్చుకుంటూ ఉండాల్సి వస్తోంది. మోనాల్ ఆడే డబుల్ గేమ్‌లో అఖిల్ చిక్కుకున్నట్టు కనిపిస్తోంది. మరి వీరి కథ ఎక్కడి వరకు వెళ్లి ఆగుతుందో చూడాలి. ఇక దివి చెప్పిన మాటలకు మాత్రం నెటిజన్లు ఫిదా అవుతున్నారు. బ్యూటీ విత్ బ్రెయిన్ అంటూ పొగిడేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X