Bigg boss 4 Elimination: నాగార్జున ఇచ్చిన ట్విస్టుకు కాళ్లు పట్టుకున్న అవినాష్.. అయోమయంలో మోనాల్
బిగ్ బాస్ 4 తెలుగు రోజురోజుకు మరింత ఆసక్తిగా మారుతోంది. ముఖ్యంగా ఆదివారం నాటికి షో ఊహించని మలుపులు తిరుగుతోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా కంటెస్టెంట్స్ మధ్య పోటీ కూడా ఎక్కువవుతోంది. ఇక ఆదివారం వస్తే నాగార్జున ఇచ్చే ట్విస్టులు కూడా మామూలుగా ఉండవు. ఎలిమినేషన్ లో నలుగురు ఉన్నప్పటికీ ఇద్దరు డేంజర్ జోన్ లో ఉన్నారని శనివారమే తెలిసిపోయింది. ఇక వారిలో ఎవరు వెళ్లిపోతారో కూడా అర్ధమయ్యింది. ఇక ఈ రోజు ప్రసారం కాబోయే ఎపిసోడ్ ప్రోమోను కొద్దిసేపటి క్రితం రిలీజ్ చేసిన స్టార్ మా షోపై మరింత హైప్ క్రియేట్ చేసింది.

మరోసారి పెరుగుతున్న అనుమానాలు
గత రెండు వారాల నుంచి ఎలిమినేషన్ విషయంలో మళ్ళీ అనుమానాలు ఎక్కువవుతున్నాయి. బిగ్ బాస్ రేటింగ్ కోసం కొత్త తరహాలో ఆలోచిస్తోంది. ఆటలో సరైన న్యాయం జరగడం లేదనే కామెంట్స్ చాలానే వచ్చాయి. ఇక ఈ సారి ఫైనల్ గా ఎవరో ఒకరిని ఎలిమినేట్ చేయాల్సిందే. అందరూ కూడా ఎవరికి వారు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అని ప్రచారాలు బాగానే చేసుకుంటున్నారు. ఇక ఈ రోజు వీక్ కంటెస్టెంట్ ఎవరో ఈజీగా తెలిసిపోతుంది.

రెచ్చిపోయిన అవినాష్, అరియానా
ఇక ప్రోమో విషయానికి వస్తే.. సండే రోజు ఎప్పటిలానే నాగార్జున ఆట పాటలతో కంటెస్టెంట్స్ నుంచి మంచి వినోథాన్ని రాబట్టినట్లు తెలుస్తోంది. ఇక కంటెస్టెంట్స్ అందరూ కూడా డ్యాన్స్ చేసినట్లు కనిపిస్తోంది. ఇక అరియానా, అవినాష్ జోడి రెచ్చిపోయి మరి రొమాంటిక్ డోస్ ను పెంచినట్లు తెలుస్తోంది. అభిజిత్, హారిక జోడి కూడా తక్కువేమి కాదని అర్ధమయ్యింది.

నా పరిస్థితి గురించి ఏం చెప్పాలి
ఇక అఖిల్ పై ఈ వారం కౌగిలింతల కామెంట్ బాగా వైరల్ అవుతోంది. ఈ మధ్య అఖిల్ కు చాలా లవ్, హగ్స్ దొరుకుతున్నాయి కదా అంటూ నాగార్జున కూడా కౌంటర్ వేసేశారు. శనివారం ఎపిసోడ్ లో అరియానా, అఖిల్ రొమాంటిక్ మాటల గురించి బయటపెట్టిన విషయం తెలిసిందే. ఇక మోనాల్ ఆ విషయంలో చాలా అప్సెట్ అవుతున్నట్లు అర్ధమయ్యింది. అందుకే నా పరిస్థితి గురించి ఏం చెప్పాలి సార్ అంటూ నాగార్జున ముందు నవ్వుతూనే తలపై కొట్టుకుంది.
Recommended Video

అఖిల్ నెంబర్ వన్ పులిహోర రాజా
ఇక పులిహోర రాజా అనే ట్యాగ్ ను అఖిల్ అందుకున్నట్లు దాదాపు కంటెస్టెంట్స్ అందరూ నాగార్జునకు క్లారిటీ ఇచ్చేశారు. మొదట్లో అవినాష్ ను పులిహోర రాజా అంటూ అనేక రకాలుగా టార్చర్ పెట్టిన అఖిల్ కు ఇప్పుడు దిమ్మతిరిగే కౌంటర్ పడింది. అఖిల్ నెంబర్ వన్ పులిహోర రాజా అంటూ మోనాల్ కూడా గట్టిగానే అరిచేసింది.

కామధేనువు కాళ్ళు పట్టుకొని ఏడ్చిన అవినాష్
ఇక ఫైనల్ గా ఎలిమినేషన్ రౌండ్ లో నలుగురుకి నాగార్జున ఒక టాస్క్ ఇచ్చారు. కామధేనువు బొమ్మను ఉంచి.. మీ టాలెంట్ ను చూపిస్తే ఆ కామధేనువు మిమ్మల్ని సేవ్ చేస్తుందని చెప్పాడు. దీంతో వెంటనే మోనాల్, అభి, హారిక రిక్వెస్ట్ చేస్తూ వారి టాలెంట్ తో సేవ్ చేయమని అడిగారు. అయితే అవినాష్ మాత్రం నీ కాళ్ళు పట్టుకుంటాను అంటూ కామెడీగా ఏడ్చాడు. ఇక ఫైనల్ గా ఈ రోజు హౌజ్ నుంచి అవినాష్ ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











