Don't Miss!
- News నామినేషన్ల పర్వంలో టీడీపీకి ఊహించని షాక్
- Sports SRH vs RCB: కొంపముంచిన విరాట్ కోహ్లీ జిడ్డు బ్యాటింగ్!
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
అందరిలో బ్యాడ్ అవుతున్నా.. వెక్కి వెక్కి ఏడ్చిన మోనాల్.. ఓదార్చిన అవినాష్
బిగ్ బాస్ 58వ ఎపిసోడ్ లో కంటెస్టెంట్స్ నెవర్ బోఫోర్ అనేలా ల్ హౌజ్ ని హీటెక్కించారు. ఈ వారం మొత్తం గోడవలతో కంటెస్టెంట్స్ నానా రచ్చ చేసేలా ఉన్నారని అనిపిస్తోంది. గతంలో ఎప్పుడు లేని విదంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు ఇంటి సభ్యుల్లో దూరాన్ని పెంచుతున్నాయి. ఇక అఖిల్ యాటిట్యూడ్ కి మరోసారి మోనాల్ వెక్కి వెక్కి ఏడ్చింది. ఇక మరోసారి అవినాష్ ఆమెను ఓదార్చడం హాట్ టాపిక్ గా మారింది.
మోనాల్, అఖిల్ మధ్య ఎమోషనల్ సీన్
మోనాల్, అవినాష్ ఎలా ఉంటారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. వీరి మధ్య చాలా హెల్దీ ఎంటర్టైన్మెంట్ అయితే క్రియేట్ అవుతుంటుంది. అవినాష్ ముద్దులు కావాలని చాలా సరదాగా అడుగుతుంటాడు. ఇక మోనాల్ కూడా అదే టైమింగ్ తో అతనితో కామెడీ రొమాన్స్ చేస్తుంది. అయితే సోమవారం మాత్రం వీరి మధ్య ఎమోషనల్ సీన్ క్రియేట్ అయ్యింది.
నిర్లక్ష్యం చేస్తున్నావ్
అఖిల్, మోనాల్ మధ్య మరోసారి అపోహలు తలెత్తాయి. వాష్ రూం దగ్గర వారు మాట్లాడుకున్నా విధానం చూస్తే వీరి మధ్య మరోసారి దూరం పెరిగిందని అనుకుంటారు. నువ్ నన్ను పట్టించుకోవడం లేదు. నిర్లక్ష్యం చేస్తున్నావ్, పక్కన కూర్చోలేదు అంటూ అఖిల్ తీరుపై ఫీల్ అయిపోయింది మోనాల్. ఇక అఖిల్ కాస్త అసంతృప్తి ఉన్నప్పటికీ నో.. నేను నిన్ను అలా దూరం చేయలేదు అని చెప్పాడు.
నా అఖిల్ అయితే ఇలా చేయడు
హగ్ ఇవ్వమని చెప్పినా కూడా ఏదో నార్మల్ ఫ్రెండ్ కి ఇచ్చినట్లు ఇస్తున్నవ్.. మన హగ్ లో తేడా వచ్చిందని మోనాల్ ఇంకాస్త అసంతృప్తి వ్యక్తం చేసింది. నా అఖిల్ అయితే ఇలా చేయడు అంటూ బాధపడినా కూడా అఖిల్ సెటైర్లు వేయడం స్టార్ట్ చేశాడు. దీంతో ఆమెకు ఎక్కడలేని ఏడుపు వచ్చేసింది. వెంటనే అవినాష్ తో తన బాధను పంచుకుంది.
వెక్కి వెక్కి ఏడ్చిన మోనాల్
అవినాష్ ముందు వెక్కి వెక్కి ఏడ్చిన మోనాల్ అఖిల్ కూడా నన్ను దూరం పెడుతున్నాడు. అసలు కారణం ఏమిటో చెప్పడని చెప్పింది. ఇక హౌజ్ లో నాకు ఎవరితో గొడవ పెట్టుకోవాలని లేదు. అందరితో స్నేహంగా ఉండాలని ఉంది. కానీ ఎదో తెలియకుండా చేసిన చిన్న చిన్న కారణాలకు బ్యాడ్ అవుతున్నానని చెప్పింది. ఇక అలా ఏమీ లేదుఅంటూ అవినాష్ ఆమెను ఓదార్చే ప్రయత్నం చేశాడు.