Don't Miss!
- Finance Stock To Buy: రూ.90కి చేరుకోకున్న రూ.35 స్టాక్.. కారణం ముఖేష్ అంబానీనే తెలుసా..??
- Lifestyle Mango Tea: ఇకపై తొక్కేకదా అని పారేయకండి.. ఇలా టీ చేసుకుని తాగండి..శరీరంలో జరిగే అద్భుతాలు చూడండి..
- Technology శాంసంగ్ స్మార్ట్ఫోన్ డిస్ప్లేలో గ్రీన్ లైన్ కనిపిస్తోందా.. అయితే ఉచితంగా స్క్రీన్ రీప్లేస్ చేస్తారు...
- News నెల్లూరు జిల్లాలో వైసీపీకి మరో ఎదురుదెబ్బ ! కీలక నేత గుడ్ బై..
- Sports హార్దిక్ వద్దు.. రోహిత్ తర్వాత అతనే భారత్ కెప్టెన్- హర్భజన్
- Automobiles ఎన్నో అంచనాల మధ్య లాంచ్ అయిన క్లచ్లెస్ బైక్ TVS Jive.. ఎందుకు ఫెయిల్ అయింది.??
- Travel ఐఆర్సిటిసి హైదరాబాద్ టు మధ్యప్రదేశ్ ఆధ్యాత్మిక టూర్ ప్యాకేజీ..
ఏడొోవారం ఎలిమినేషన్ అప్డేట్.. అవుట్ ఎవరంటే? కుమార్కు మోసం జరిగిందా? బిగ్బాస్ పరిస్థితేంటి?
బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్స్ విషయంలో మెల్లగా ఆడియెన్స్ కనెక్ట్ అవుతున్నారని అనిపిస్తోంది గాని మళ్ళీ ఎక్కడో తేడా కొడుతోందనే అనుమానం కూడా ఎక్కువవుతోంది. గత కొంత కాలంగా షోకి సంబంధించిన టాస్క్ లు బాగానే వైరల్ అయ్యాయి. అయితే అవి అన్ని వర్గాలను ఆకట్టుకున్నాయా లేదా అనేది హాట్ టాపిక్ గా మారింది. ఇక ఫిల్మీ బీట్ నిర్వహించిన సర్వేలో ఆడియెన్స్ ఏమనుకుంటున్నారు అనే విషయంలో ఒక క్లారిటీ అయితే వచ్చినట్లు అనిపిస్తోంది. ఆ సందేహాలపై ఒక లుక్కేస్తే..
ఫిల్మీ బీట్ సర్వే..
ఫిల్మీ బీట్ ఆడియెన్స్ ఆలోచనలకు తగ్గట్లుగా క్రియేట్ చేసిన సందేహాలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. లక్షలాది మంది బిగ్ బాస్ పై వేసిన ప్రశ్నలకు వారి ఓట్లతో అసలు సమాధానం ఇచ్చారు. దీంతో ఒక విధంగా ప్రజల నిర్ణయాలాతో అసలు బిగ్ బాస్ అనుమానాలకు తావివ్వకుండా నడుస్తోందా లేదా అనే విషయంలో క్లారిటీ వస్తుంది.
నెక్స్ట్ ఎలిమినేట్ కాబోయేది ఎవరంటే..
ముందుగా బిగ్ బాస్ ఏడవ వారం ఎలిమినేషన్స్ పై ఒక లుక్కేస్తే ఈ సారి పెద్దగా కన్ఫ్యూజన్ లేకుండా ఆడియెన్స్ మోనాల్ వైపే చేస్తున్నారు. 63% శాతం మంది మోనాల్ వెళ్లిపోతే షోలో కాస్త ఆ సరసాలు తగ్గుతాయని అనుకుంటున్నారని అర్ధమవుతోంది. కేవలం 2% జనాలు మాత్రమే అవినాష్ వెళ్లిపోవాలని అనుకుంటున్నారు. అంటే అతను ఇప్పట్లో వెళ్లిపోయేలా లేడని అనిపిస్తోంది. ఎలిమినేషన్స్ లో దివి వెళ్లిపోవాలని 16% జనాలు భావిస్తున్నారు.
కుమార్ సాయి విషయంలో తప్పు జరిగింది
ఇక గత వారం ఎలిమినేషన్స్ పై ఆడియెన్స్ చాలా అసంతృప్తిగా ఉన్నట్లు సోషల్ మీడియాలో వస్తోన్న కామెంట్స్ చూస్తుంటేనే అర్ధమవుతోంది. ఇక ఈ సర్వేలో కూడా 75% జనాలు కుమార్ సాయి ఎలిమినేషన్ లో తప్పు జరిగిందని భావిస్తున్నారు. ఇదే విషయం జనాలను చాలా కన్ఫ్యూజన్ కి గురి చేస్తోంది. షోలో అతన్ని ఒక్కడినే ఎందుకు టార్గెట్ చేశారనే వాదన వినిపిస్తోంది. కేవలం 14% జనాలు మాత్రమే ఎలిమినేషన్ ని సమర్దించగా మిగతా 10% చెప్పలేము అంటున్నారు.
Recommended Video
బిగ్ బాస్ 4 పరిస్థితి ఎలా ఉందంటే..?
ఫైనల్ గా బిగ్ బాస్ 4 పరిస్థితి ఏమిటనే విషయంలో కూడా ఆడియెన్స్ ఊహించని విధంగా స్పందిస్తున్నారు. స్టార్ మా మాత్రం షోకి అద్భుతమైన క్రేజ్ అందుతున్నట్లు తీరిక లేకుండా ప్రమోషన్స్ డోస్ పెంచుతోంది. ఇక సర్వేలో 70% శాతంకి పైగా జనాకు ఆసక్తికరంగా కొనసాగడం లేదని అంటున్నారు. కెవలన్ 21% మాత్రమే ఆసక్తికరంగా ఉందని అంటున్నారు. ఇక మిగతా 7 శాతం ఎటు కాకుండా చెప్పలేము అన్నారు.