Don't Miss!
- Sports ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్: ఆ ఇద్దరికీ కోత
- News సాగర్ టెయిల్ పాండ్ నుండి ఏపీ నీటిచౌర్యం; ఎన్నికలవేళ మళ్ళీ కృష్ణా జలవివాదం!!
- Finance Gold Price Today: బంగారం ధర పై పైకే.. ఇక కొనలేమా..!
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Automobiles హ్యుందాయ్ ఎక్స్టర్ దిమ్మ తిరిగే మైలేజ్.. ఓనర్ ఫుల్ ఖుష్.. ఫొటోలతో సహా ప్రూఫ్ ఇదిగో.!!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
బిగ్ బాస్ కోసం ముగ్గురు అగ్ర హీరోలు.. టైటిల్ విన్నర్ ను ప్రకటించేది మాత్రం ఒక్కరే!
బిగ్ బాస్ సీజన్ 4 మొత్తానికి క్లైమాక్స్ కు చేరుకుంది. ఇక గెలుపోటముల గురించి ఎలా ఉంటుందో గాని ఫైనల్ డే రోజు ఆ టైటిల్ విన్నర్ ను ప్రకటించే స్టార్ ఎవరనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గతంలో ఎప్పుడు లేని విధంగా ముగ్గురి అగ్ర హీరోల పేర్లు మాత్రం గట్టిగానే వినిపిస్తున్నాయి. దీంతో ఆ ముగ్గురి హీరోల్లో ఎవరు వస్తారనే విషయంలో అఫీషియల్ క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఒక హీరో మాత్రం వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు మరొక రూమర్ కూడా వైరల్ అవుతోంది.
రేటింగ్స్ ఎక్కువగా పెరిగింది అప్పుడే..
బిగ్ బాస్ సీజన్ 4 మొదలైనప్పుడు పరిస్థితి ఎలా ఉండేదో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. శని ఆదివారం కూడా రేటింగ్స్ దారుణంగా పడిపోయినట్లు టాక్ వచ్చింది. అప్పుడప్పుడు మాత్రమే నాగార్జున మ్యాజిక్ క్రియేట్ అయ్యిందట. కానీ ఆ మధ్య సమంత వచ్చినప్పుడు మాత్రం ఒక్కసారిగా అంచనాలు పెరిగాయి.
వస్తానని చెప్పినప్పటికీ..
సమంత రాకతో అప్పట్లో ఒక్కసారిగా రేటింగ్స్ పెరిగిపోయాయి. ఇక సుమ వచ్చినప్పుడు కూడా షోకు మంచి హైప్ క్రియేట్ అయ్యింది. దీంతో ఫైనల్ కు బజ్ రావాలి అంటే తప్పకుండా స్టార్ సెలబ్రేటి రావాల్సిందే. ఇక మొదటి నుంచి కూడా ఒక పేరు బాగా వైరల్ అవుతోంది. ఎన్టీఆర్ తప్పకుండా వస్తానని నిర్వాహకులకు మాట ఇచ్చినట్లు కథనాలు వచ్చాయి. అయితే ఎన్టీఆర్ ఇప్పుడు రావడం కుదరదని క్లారిటీ ఇచ్చినట్లు మరొక టాక్ వైరల్ అవుతోంది.
మరోసారి మెగాస్టార్
మరొక హీరో మెగాస్టార్ చిరంజీవి కూడా బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ను ప్రకటించేందుకు మరోసారి ఫైనల్ ఎపిసోడ్ కు రానున్నట్లు టాక్ వస్తోంది. గత సీజన్ కు ఆయన రాహుల్ సిప్లిగంజ్ కు ట్రోపిని అందించిన విషయం తెలిసిందే. కానీ ఆయన వస్తున్నట్లు వచ్చే వార్తల్లో నిజం లేదట. ఎందుకంటే మెగాస్టార్ చాలా రోజుల తరువాత ఆచార్య షూటింగ్ తో బిజీ అయ్యారు. కావున వచ్చే ఛాన్స్ లేదని సమాచారం.
Recommended Video
మహేష్ బాబు రావడం పక్కా..?
ఇక లిస్టులో ఉన్న మరో గెస్ట్ పేరు మహేష్ బాబు. సూపర్ స్టార్ ఇంతవరకు బిగ్ బాస్ వైపు చూడలేదు కాబట్టి ఆయానతోనే టైటిల్ విన్నర్ ను ఎనౌన్స్ చేయించాలని ప్లాన్ వేసినట్లు టాక్. మహేష్ వస్తే మాత్రం దెబ్బకు షో రేంజ్ పెరిపోవడం కాయం. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియదు గాని బిగ్ బాస్ ఫైనల్ డే రోజు మాత్రం తప్పకుండా ఒక స్టార్ హీరో రావడం మాత్రం పక్కా అని తెలుస్తోంది.