Don't Miss!
- Technology Samsung నుంచి 'Music Frame' స్పీకర్ లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
- News వల్లభనేని వంశీకి షాకిచ్చేలా యార్లగడ్డతో చంద్రబాబు వ్యూహం!!
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
- Finance Medicines News: కిరాణా కొట్టులో మందుల విక్రయం.. మోదీ సర్కార్ సంచలన నిర్ణయం..!!
- Lifestyle ప్రాణాలకు ముప్పు ఉందని తెలిపే హీట్ స్ట్రోక్ లక్షణాలు
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్‌కు పండగే
Bigg Boss finals Survey: ఆ చిన్న తప్పే సోహెల్‌పై గట్టిదెబ్బ పడుతుందా? విజేత విషయంలో అదే ట్రెండ్
బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 మొత్తానికి చివరి దశకు చేరుకుంటోంది. మరో రెండు రోజులు గడిస్తే అసలు విన్నర్ ఎవరనే దానిపై ఫుల్ క్లారిటీ కూడా వస్తుంది. ఇక గత వారం మోనాల్ ఎలిమినెట్ అవ్వడంపై కాస్త పాజిటివ్ కామెంట్స్ వచ్చాయి. గతంలో మోనాల్ సేవ్ అవ్వడం కూడా ఆశ్చర్యమనే చెప్పాలి. ఇక ఫిల్మీ బీట్ ఇటీవల ఒక సర్వే నిర్వహించగా అందులో చాలా మంది వారి అభిప్రాయాని ఓటు ద్వారా తెలియజేశారు. ఆ రిపోర్ట్ పై ఒక లుక్కేస్తే..
టాప్ 5లో స్ట్రాంగ్ పోటీ..
గెలవాలనే పట్టుదలతో ప్రతి ఒక్కరు చాలా కష్టపడుతున్నారు. ఇక ఈ మధ్యలో గొడవలు కామన్ గా మారుతున్నాయి. గత వారం మొత్తం ఎక్కువగా సోహెల్, అరియానా హవా ఎక్కువగా నడిచింది. ఇక టాప్ 5 కంటెస్టెంట్స్ లలో ఉన్న అభిజిత్, అఖిల్, హారిక కూడా ఓట్లను భరిగానే అందుకుంటున్నారు. అఖిల్ కు కూడా అనూహ్యంగా భారీ స్థాయిలో ఓట్లు పడుతున్నట్లు టాక్ వస్తోంది.
మోనాల్ ఎలిమినేషన్ సరైనదేనా?
లాస్య వెళ్లిపోయిన తరువాత హౌజ్ లో ఉన్న ప్రతి ఒక్కరు మేజర్ కంటెస్టెంట్స్ అనే చెప్పాలి ఒక్క మోనాల్ తప్ప. అయితే ఊహించని విధంగా మోనాల్ కాకుండా అవినాష్ వెళ్లిపోవడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక మోనాల్ హడావుడి గట్టిగానే చేసినప్పటికి గత వారం ఎందుకో వర్కౌట్ కాలేదు. గేమ్ లో కెమెరాలన్ని ఎక్కువగా ఫోకస్ అయ్యేలా ట్రై చేసింది. ఇక ఆమె ఎలిమినెట్ కావడంతో గతంలో మాదిరిగా మరోసారి సరైనదేనా? కాదా అని ప్రశ్నించగా 86% జనాలు సరైనాదే జరిగిందని, అవునని ఓటు వేశారు. కరెక్ట్ కాదు అని కేవలం 9% జనాలు మాత్రమే కోరుకున్నారు.
ఆ గొడవలో తప్పు ఎవరిది
బిగ్ బాస్ హౌజ్ కో గత వారం సోహెల్, అరియానా మధ్య ఏ రేంజ్ లో గొడవ జరిగిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అరియానా అయితే గోల పెట్టి కిందపడిపోయింది. ఇక ఆ గొడవలో తప్పు ఎవరిదని ప్రశ్నించగా.. సోహెల్ ది ఎక్కువగా తప్పుందని 52% జనాలు ఓటు ద్వారా క్లారిటీ ఇచ్చారు. ఇక అరియానాది తప్పుందని 35% మంది అభిప్రాయపడ్డారు. చెప్పలేం అంటూ 11% జనాలు వివరణ ఇచ్చారు.
షో ఎలా ఉందంటే..?
ఇక బిగ్ బాస్ ఫైనల్ కు చేరుకోవడంతో ఇప్పుడే జనాలను ఎక్కువగా ఎట్రాక్ట్ చేసేందుకు ఆస్కారం ఉంటుంది. ఇక ఓవరాల్ గా షో ఇప్పుడు ఎలా కొనసాగుతోందని ప్రశ్నించగా కేవలం 37% జనాలు బాగుందని చెప్పారు. ఇక బాగాలేదు అంటూ 51% జనాలు క్లారిటీ ఇవ్వడం ఆశ్చర్యం. చెప్పలేము అంటూ ఓ 10% నెటిజన్లు తెలిపారు.
బిగ్ బాస్ విన్నర్ పై మరో క్లారిటీ
ఇక బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ఎవరనే విషయంలో మరోసారి ఆడియెన్స్ ని వివరణకోరగా అభిజిత్ కు 72% నెటిజన్స్ ఓటు వేశారు. గత మూడు వారాలుగా అతనికున్న ఫ్యాన్ ఫాలోయింగ్ అమాంతంగా పెరిగిపోతున్న విషయం తెలిసిందే. ఇక అతనికి పోటీగా అఖిల్ కూడా వస్తున్నట్లు టాక్ వస్తోంది. కానీ ఇక్కడ అఖిల్ కు (4%)ఓట్లు మాత్రమే వచ్చాయి. అరియానా (15%), సోహెల్ (6%), హారిక (2%).. తరువాతి స్థానాల్లో ఉన్నారు. మరి చివరికి బిగ్ బాస్ ఆడియెన్స్ అంచనాలకు ఎలాంటి ట్విస్ట్ ఇస్తాడో చూడాలి.