ఇన్ని రోజులకు కళ్లు తెరిచాడు.. కంటెస్టెంట్లను ముప్పుతిప్పలు పెడుతున్న బిగ్‌బాస్
బిగ్‌బాస్ షోలో మొదటి వారం గడిచింది. ఓ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయిపోయాడు.. ఓ కంటెస్టెంట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చాడు.. రెండో వారంలో షో బాగానే సాగుతోంది. ఇక నిన్న మరో కంటెస్టెంట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చాడు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. కానీ బిగ్‌బాస్ చూస్తున్న ప్రేక్షకులకు మాత్రం అది తెలుగు బిగ్‌బాసా? లేదా ఇంగ్లీష్ హిందీ తమిళ్ బిగ్‌బాసా? అన్న అనుమానం కలుగుతోంది. ఇంట్లో తెలుగు మాట్లాడాలనే నిబంధన ఉన్నా కూడా ఎవ్వరూ పట్టించుకోలేదు. బిగ్‌బాస్ కూడా ఇన్ని రోజులు ఎలాంటి శిక్షలు విధించకుండా నిద్రపోతోన్నట్టు కనిపించింది.
Recommended Video

ఏ ఒక్కరూ పాటించడం లేదు..
బిగ్‌బాస్ ఇంట్లోకి వచ్చిన రోజు నుంచీ ఏ ఒక్కరూ కూడా నిబంధనలు పాటించనే లేదు. తెలుగు వచ్చిన వాళ్లు కూడా ఇంగ్లీష్‌లో వాగేస్తున్నారు. ఇక తెలుగు రాని వాళ్లు అయితే మరీ ఘోరంగా మాట్లాడేస్తున్నారు. ఇది తెలుగు ప్రేక్షకులు చూసే షో అని కనీసం కూడా ఆలోచించకుండా.. తెలుగులోనే మాట్లాడుదామని ఆలోచన లేకుండా తమిళం, హిందీ, ఇంగ్లీష్‌లో ముచ్చట్లు పెట్టుకుంటున్నారు.

మోనాల్ అలా..
మామూలుగా గత కొన్ని రోజులుగా మోనాల్‌కు సంబంధించిను పుటేజే ఎక్కువగా కనిపిస్తోంది. అయితే మోనాల్ మాత్రం తెలుగులో మాట్లాడటానికి ప్రయత్నించడమే లేదు. ఏదో కామెడీగా గంగవ్వ కొన్ని పదాలు చెబుతూ ఉంటే వింటూ వచ్చింది కానీ నేర్చుకోలేకపోయింది. ఇక ఆమెతో మాట్లాడే అఖిల్, అభిజీత్ సైతం ఇంగ్లీష్‌లోనే మాట్లాడుతున్నారు.

హారిక, అరియాన సైతం..
హారిక, అరియానాలు మరో రకంగా ప్రవర్తిస్తుంటారు. హారిక తెలంగాణ యాసతో పాపులర్ అయినా సరే బిగ్‌బాస్‌లో ఇంగ్లీష్‌లోనే మాట్లాడుతోంది. తెలుగు యాంకర్ అయిన అరియానా ఇంగ్లీష్‌లోనే కానిచ్చేస్తోంది. ఇక సూర్య కిరణ్ ఉన్న రోజుల్లో అమ్మ రాజశేఖర్ తమిళంలోనే ఎక్కువగా మాట్లాడేవాడు. కానీ ఇప్పుడు కాస్త బెటర్ అయ్యాడు.

రూల్స్ బ్రేక్...
ఇంతమింది తెలుగు మాట్లాడాలి అనే నిబంధనను పట్టించుకోకపోయినా బిగ్‌బాస్ చూస్తుండిపోయాడు. కానీ నేటి ఎపిసోడ్‌లో కంటెస్టెంట్లందరినీ ముప్పు తిప్పలు పెట్టబోతోన్నట్టు తెలుస్తోంది. రూల్స్ బ్రేక్ చేస్తున్నారన్న కారణంతో గుంజీలు తీయించినట్టు ప్రోమోలో చూపించారు. ఇకనుంచైనా కంటెస్టెంట్లందరూ తెలుగులోనే మాట్లాడుతారేమో చూడాలి.


Click it and Unblock the Notifications











