అప్పుడు ఫటాఫట్ చెప్పేసింది.. ఇప్పుడు తడబడుతోంది.. మాట మార్చిన గంగవ్వ!!
బిగ్ బాస్ షోలో గంగవ్వ ఎంట్రీ ఒకెత్తు అయితే ఆమె ఇంటి నుంచి మధ్యంతరంగా వెళ్లిపోవడం మరో ఎత్తు. ఆరోగ్యం సహకరించక మధ్యలో వెళ్లిపోయింది. వచ్చిన మొదటి రెండు వారాల్లోనే గంగవ్వ ఆరోగ్యం దెబ్బతింది. కానీ బిగ్ బాస్ ధైర్యం చెప్పి వైద్యం చేయించడంతో తిరిగి పుంజుకుంది. కానీ ఐదోవారంలో మాత్రం గంగవ్వ ఆరోగ్యం బాగా క్షీణించింది. దీంతో బిగ్ బాస్ టీం ఆమెను బయటకు పంపించేందు నిర్ణయించుకుంది. గంగవ్వను ఐదో వారాంతంలో పంపించేశారు. అయితే ఇంట్లో ఉన్నంత సేపు, స్టేజ్ మీద నాగార్జునతోనూ తనకు అఖిల్ ఇష్టమని చెప్పింది. కానీ ప్రస్తుతం ఆ స్వరం మారింది.

గంగవ్వతోనే ఉండేవాడు..
బిగ్ బాస్ షోలో మొదటి రెండు వారాలు గంగవ్వ వల్ల బాగానే హైప్ వచ్చింది. ఆ రెండు వారాల్లో గంగవ్వను అందరూ చుట్టిముట్టిప్రేమను కురిపించారు. అయితే అందులో కొంతమంది మాత్రం సింపతీ ఓట్ల కోసం సేవలు చేసి ఉంటారు. ఇంకొందరు మాత్రం నిజంగానే గంగవ్వ అంటే ప్రేమ ఉండి సేవలు చేసి ఉంటారు. అందులో అఖిల్ అందరి కంటే ముందుండేవాడు.

దత్తత, పెళ్లి..
అఖిల్ గంగవ్వ రిలేషన్ కూడా బాగానే వైరల్ అయింది. నా మనవడు.. బయటకు వెళ్లిన తరువాత దత్తత తీసుకుంటాను.. పెళ్లి చేస్తా అంటూ చాలా గొప్పగానే చెప్పింది. ఇంట్లో ఉన్నంత సేపు అఖిల్ అంటే ఎంతో ఇష్టమని గంగవ్వ చెబుతూ ఉండేది. మిగతా వాళ్లతో కూడా అంత ఎక్కువగా మాట్లాడేది కాదు. వెళ్లేటప్పుడు కూడా అఖిల్ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చాడని తెగ సంబరపడిపోయింది.

బయట మాత్రం..
బయటకు వచ్చాక ఇంటర్వ్యూల్లో మాత్రం గంగవ్వ మాటల్లో మార్పు కనిపిస్తోంది. బయట ఎవరికి ఎలా ఫాలోయింగ్ ఉంది.. ఎవరు బాగా ఆడుతున్నారు.. ఎవరికి ఓట్లు పడుతున్నాయి ఇలాంటి సంగతులన్నీ గమనిస్తోంది. అందుకే గంగవ్వ కూడా తన మాటలను మార్చేస్తోంది. ఒకప్పుడు తనకు అఖిల్ ఇష్టమని నేరుగా చెప్పేది. కానీ తాజాగా మాట మార్చేసింది.

దీపావళి స్పెషల్..
దీపావళి స్పెషల్‌గా అలీ బిగ్ బాస్ కంటెస్టెంట్లను ఇంటర్వ్యూ చేశాడు. అందులో గంగవ్వను ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరని అడిగితే తడబడింది. అఖిలే కదా అని అలీ అంటే.. అందరూ అలా అనుకున్నారు.. కానీ నాకు అందరూ ఇష్టమే.. అని గంగవ్వ చెప్పింది. కాకపోతే అఖిల్ ఎక్కువగా సేవలు చేశాడు. టైంకు గోలీలు ఇచ్చేవాడని చెప్పింది. మొత్తానికి గంగవ్వ బయటకు వచ్చాక మరింత సేఫ్ గేమ్ ఆడుతోన్నట్టు కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications











