twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మోనాల్‌కు లెఫ్ట్ రైట్ ఇచ్చేసింది.. కుర్చీ ఎత్తి అవతలా పారేసింది.. గంగవ్వ విశ్వరూపం!

    |

    బిగ్‌బాస్ షో మూడో వారం మాంచి జోరు మీదుంది. నామినేషన్ ప్రక్రియ పెట్టిన మంటలో ఉక్కు హృదయం అనే టాస్క్ మరింతగా వేడెక్కిస్తోంది. ఈ టాస్క్‌లో రోబోలు, మనుషుల మధ్య పోరు జరుగుతూనే ఉంది. రోజంతా జరిగినా ఈ పోరులో ఓ రోబో (దేవీ నాగవల్లి) చనిపోగా.. అభిజీత్ వేసిన మాస్టర్ ప్లాన్‌తో రోబోలకు చార్జింగ్ లభించింది. ఇక ఈ విషయంలో నిన్నటి ఎపిసోడ్‌లో ఎంత రచ్చ జరిగిందో అందరికీ తెలిసిందే.

    ప్లాన్ వేసి కిడ్నాప్..

    ప్లాన్ వేసి కిడ్నాప్..

    ఇచ్చి పుచ్చుకునే పద్దతి ఉన్నాగానీ బేరాలు కుదరలేదు. దీంతో మనుషులు తమ పంతం నిలబడ్డారు. ఫుడ్డు, బెడ్డు, బాత్రూం లేకపోయినా సరే అలాగే ఉండిపోయారు. మరో వైపు రోబోలకు చార్జింగ్ లేక చనిపోయే పరిస్థితి వచ్చింది. అందుకే అభిజీత్ ఇచ్చిన ప్లాన్ ప్రకారం దివిని కిడ్నా,ప్ చేశారు. చార్జింగ్ పెట్టుకున్నారు.

    రెచ్చిపోయిన సభ్యులు..

    రెచ్చిపోయిన సభ్యులు..

    దివిని కిడ్నాప్ చేసి చార్జింగ్ పెట్టుకోవడంపై మనుషుల టీం సభ్యులు విరుచుకుపడ్డారు. ఏదో యుద్దం వచ్చినట్టు, అవతల వారిని చంపేస్తామన్న లెవెలె‌లో ఫైర్ అయ్యారు. ముఖ్యంగా మోహబూబ్, సోహెల్ అదుపు తప్పి ప్రవర్తించారు దమ్ముంటే నన్ను తీసుకెళ్లండిరా,.. మీరు మగాళ్లేనారా? అంటూ ఫైర్ అయ్యారు.

    అవినాష్ స్మార్ట్..

    అవినాష్ స్మార్ట్..

    కిడ్నాప్ చేసిన దివిని వదిలిపెట్టడం, ఆపై ఇంట్లోకి వచ్చిన మనుషుల టీం రోబోలపై ఆరోపణలతో నిన్నటి ఎపిసోడ్ బాగానే రక్తి కట్టింది. ఇక నేటి ఎపిసోడ్‌లో రోబో టీం సభ్యుడైన అవినాస్ అమ్మ రాజశేఖర్ కళ్లల్లో మట్టి కొట్టినట్టు తెలుస్తోంది. నైస్‌గా వచ్చి పక్కనే కూర్చుని మాస్టర్‌కు తెలీకుండానే చార్జింగ్ పెట్టేసుకున్నాడు.

    గంగవ్వ ఫైర్..

    గంగవ్వ ఫైర్..

    తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో గంగవ్వ శివాలెత్తిపోయింది. మోనాల్‌ దుమ్ముదులిపినట్టు కనిపిస్తోంది. రోబో టీం అధీనంలో ఉన్న గ్యాస్ కనెక్షన్, వాటర్ కనెక్షన్ వైర్లను తెంపి పడేసింది. అడ్డొచ్చిన ఆరియానాతో వాగ్వాదినికి దిగింది. ఇక గంగవ్వపైకి కూడా లేచినట్టుంది. కోపం తట్టుకోలేని గంగవ్వ మోనాల్ చెంపమీద ఒక్కటి ఇచ్చినట్టు కనిపిస్తోంది. అంతటితో ఆగకుండా కుర్చీ ఎత్తి మరీ అవతలపడేసింది. మొత్తానికి గంగవ్వ మాత్రం మోనాల్‌కు గట్టి షాకే ఇచ్చింది.

    English summary
    Bigg Boss 4 Telugu Gangavva fires On Monal, Ukku Hrudayma Task Become day By Day Interestingly.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X