గంగవ్వ సార్ గంగవ్వ అంతే.. ఓట్లు గుద్దుడే గుద్దుడు.. అవ్వకు దరిదాపుల్లో ఎవ్వరూ లేరు!!
బిగ్‌బాస్ షో సందడి మొదలైంది. గొడవలు, ఏడుపులుపెడబొబ్బులు, కొట్లాటలు, నామినేషన్ ప్రకియలో వాగ్వాదాలతో మొదటి రోజు గందరగోళంగా నడిచింది. మొత్తానికి ఫస్ట్ వీక్ నామినేషన్ ప్రక్రియ మొదలైంది. షో ఎంట్రీలోనే కనెక్షన్ గేమ్ పెట్టి పద్నాలుగు మందిని ఏడు జట్లుగా విడగొట్టాడు. మిగిలిన ఇద్దరినీ సోహెల్, అరియానాలు ఓ సీక్రెట్ రూం( నైబర్ రూం)లో పెట్టేశాడు. నామినేషన్ పరంగా మొదటి వారంలో వీరిద్దరు అయితే తప్పించుకున్నారు. ఇక ఏడుగురు కంటెస్టెంట్లు మొదటి వారంలో నామినేట్ అయ్యారు.

నామినేషన్‌లో ఉన్నది వీరే..
కనెక్షన్ గేమ్ అని ముందే ఓ లింక్ పెట్టిన బిగ్‌బాస్.. ఆ లింక్‌ను నామినేషన్ ప్రక్రియలో విప్పేశాడు. ఏడు జంటల్లోంచి గంగవ్వ, సుజాత, సూర్య కిరణ్, అభిజీత్, అఖిల్ సర్తాక్, దివి, మెహబూబ్ నామినేట్ అయ్యారు. అయితే గంగవ్వను నామినేట్ చేసే ప్రాసెస్‌లో అందరూ ఓ కారణాన్ని చెప్పారు. అవ్వకు ఫాలోయింగ్ ఎక్కువ కాబట్టి ఎలాగైనా సేవ్ అవుతుందని చెబుతూ ఏకాభిప్రాయంతో నామినేట్ చేశారు.

నిజమే గంగవ్వ రేంజ్ అదే మరి..
ఇంటి సభ్యుల అభిప్రాయం నిజమే. గంగవ్వకు సోషల్ మీడియాలో మామూలు ఫాలోయింగ్ లేదు. గంగవ్వ గ్యాంగ్, గంగవ్వ ఆర్మీ ఇలా ఎన్నో రకాలు పేజీలు క్రియేట్ అయ్యాయి. మొదటి వారంలోనే నామినేషన్‌లో పడ్డ గంగవ్వను సేవ్ చేసేందుకు అందరూ తమ తమ ఓటు ఆయుదాన్ని తీశారు. ఓట్ల సునామిలో గంగవ్వకు దరిదాపుల్లోకి ఎవ్వరూ కూడా రావడం లేదు.

గంగవ్వతోనే బిగ్‌బాస్ ఆట..
గంగవ్వను కూడా బిగ్‌బాస్ బాగానే వాడాలని చూస్తున్నట్టు కనిపిస్తోంది. అందుకే గంగవ్వ మాట్లాడే మాటలు, ఆమె సెటైర్లను చూపిస్తూ ఫోకస్ అయ్యేలా చేస్తున్నాడు. గంగవ్వ వల్లే ఆటకు అందం వస్తుందని బిగ్ బాస్ ఈ స్ట్రాటజీని ప్లే చేసి ఉంటారని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.
Recommended Video

గంగవ్వపై అలా..
అయితే కొందరు మాత్రం గంగవ్వపై నెగెటివ్ కామెంట్స్ కూడా చేస్తున్నారు. అవ్వ బిగ్‌బాస్‌లో చేసేది ఏమీ ఉండదు.. టాస్కులు ఆడలేదు.. ఖాళీగా కూర్చోవడం తప్పా అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. కానీ ఇలాంటివి ఎవ్వరూ కూడా పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. గంగవ్వకు వస్తోన్న ఓట్లు, ఓటింగ్ శాతం చూస్తే ఎవ్వరికైనా దిమ్మతిరగాల్సిందేనట. వస్తున్న ఓట్లన్నంటిలోయాభై శాతానికి పైగా వాట గంగవ్వదేనట. ఆ తరువాత స్థానంలో అభిజీత్ ఉన్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా గంగవ్వ మాత్రం సూపర్ అంటూ.. గంగవ్వ సర్ గంగవ్వ అంతే అంటూ సలాం కొట్టేస్తున్నారు నెటిజన్స్.


Click it and Unblock the Notifications











