షాకింగ్ అప్‌డేట్.. బిగ్‌బాస్ నుంచి గంగవ్వ అవుట్.. కారణం ఏంటంటే?
బిగ్‌బాస్ ఐదో వారంలో కొన్ని సర్ ప్రైజ్‌లు ఉండబోతోన్నాయి. మరీ ముఖ్యంగా గంగవ్వ విషయంలో. గంగవ్వ ఈ వారం నామినేషన్‌లో కూడా లేదు. కానీ ఆమెను బిగ్ బాస్ ఆట నుంచి వెళ్లిపోయింది. గంగవ్వ షో నుంచి బయటకు వచ్చింది. ఈ మేరకు సోషల్ మీడియాలో నెటిజన్లు ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తున్నారు. అసలు బిగ్ బాస్ ఇంట్లో ఏం జరిగింది? ఏం జరుగుతోందో ఓ సారి చూద్దాం.
Recommended Video

స్పెషల్ కంటెస్టెంట్..
నాల్గో సీజన్‌లో గంగవ్వ స్పెషల్ కంటెస్టెంట్. ఈ విషయాన్ని నాగార్జునే కంటెస్టెంట్లందరికీ చెప్పి జాగ్రత్తగా చూసుకోవాలని అదేశించాడు. అయితే గంగవ్వను కూడా అందరూ బాగానే చూసుకున్నారు. చూసుకుంటున్నారు. కొందరు సింపతీ కోసం, ఇంకొందరు ఓట్ల కోసం ఇలా ఎవరికి వారు గంగవ్వను వాడేస్తున్నారు.

మధ్యలో క్షీణించిన ఆరోగ్యం..
మధ్యలో ఓసారి గంగవ్వ ఆరోగ్యం క్షీణించింది. ఆ వాతావరణం, ఏసీ గదులు, ఆ తిండి గంగవ్వకు పడలేదు. ఇదే విషయాన్ని బిగ్ బాస్ వద్ద మొరపెట్టుకుంది. ఆ సమయంలో గంగవ్వకు బిగ్ బాస్ వైద్యం చేయించాడు. ఆమె కూడా బాగానే సెట్ అయింది. మునుపటిలా హుషారుగానే ఉంది.

మళ్లీ నిన్నటి ఎపిసోడ్‌లో..
అయితే నిన్నటి ఎపిసోడ్‌లో గంగవ్వ మళ్లీ అనారోగ్యానికి గురైనట్టు కనిపిస్తోంది. తిండి సరిగ్గా పోవడం లేదని, తాను తన ఇంటికి వెళ్లిపోవాలని ఉంది అంటూ చెప్పుకొచ్చింది, ఇంట్లో వాళ్లతో మాట్లాడిస్తే సరిపోతుందా అని ఇతర కంటెస్టెంట్లు అడిగితే.. కాదు ఇంటికే పోవాలని ఉందని పేర్కొంది. ఇంటికి తాళం వేసి వచ్చావా? అని అడిగితే... అలాంటివేమీ లేవు తీగ చుట్టి వచ్చానంటూ తెలిపింది.

ఆరోగ్యం బాగాలేకపోవడంతో..
అయితే గంగవ్వ ఆరోగ్యం బాగా లేకపోవడంతోనే ఆమెను బయటకు పంపించినట్టు తెలుస్తోంది. కానీ ఇది ఎలిమినేషన్ కిందకు రాదు. ఆమెకు ఒంట్లో బాగా లేదు కాబట్టే బయటకు పంపించారు. ఒక వేళ మళ్లీ ఆమె ఆరోగ్యం మెరుగుపడితే.. రావాలని అనుకుంటే బిగ్ బాస్ అనుమతిస్తాడని తెలుస్తోంది.

ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే..
ఐదో వారంలో ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్లలో డేంజర్ జోన్‌లో ఉన్నది మాత్రం అమ్మ రాజశేఖర్, సుజాత. ఇందులో మరీ ముఖ్యంగా సుజాత తన వెకిలి నవ్వు, బిట్టూ అని నాగార్జునను పిలవడం జీర్ణించుకోలేని జనాలను ఆమెను ఇంట్లోంచి బయటకు పంపించేశారని తెలుస్తోంది. అసలు ఏం జరగబోతోందో చూడాలి. ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియాలంటే ఆదివారం ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











