గంగవ్వ చెప్పిందే నిజమైంది.. సుజాత ఇంటికి వెళ్లే సమయం ఆసన్నమైంది!!
బిగ్‌బాస్ షోలో ఏం జరగుతోంది..ఏ ఏ కంటెస్టెంట్ల పర్ఫామెన్స్ ఎలా ఉంది? ఎవరు ఎలిమినేట్ అవుతారు? ఎవరు ఫైనల్ వరకు ఉంటారు? వంటి విషయాలన్ని ప్రేక్షకులు అంచనా వేస్తారు. ప్రేక్షకులు వేసే అంచనాలు దాదాపు తప్పవు. అయితే కొన్ని కొన్ని సార్లు బిగ్ బాస్ ఇంటిసభ్యులు కూడా కొన్నింటిని అంచనా వేస్తారు. వాళ్లకు బయట జరిగేది తెలియకపోయినా సరే.. వారు కొన్నింటిని అంచనా వేయగలరు. పైగా అప్పుడప్పుడు నిజమవుతుంటాయి. తాజాగా సుజాత ఎలిమినేషన్ విషయంలో గంగవ్వ చెప్పిన జోష్యం నిజమైంది.

నామినేషన్ ప్రక్రియ..
మామూలుగానే సుజాత మీద అందరికీ ఓ రకమైన అభిప్రాయం ఏర్పడింది. ఆమె నవ్వు ఫేక్ అని ఎలిమినేట్ అయి బయటకు వచ్చిన కంటెస్టెంట్లందరూ చెప్పడం, ప్రతీసారి నాగార్జునను బిట్టూ అని పిలవడాన్ని ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోయారు. నామినేషన్‌లోకి ఎప్పుడు వస్తుందా? అని ఎదురు చూశారు. ఐదో నామినేషన్ ప్రక్రియలో సుజాత నామినేట్ అవ్వడంతో ఈ వారం వెళ్లేది ఆమె అని అందరూ ఫిక్స్ అయ్యారు.

అందరి కంటే..
మాములుగా అయితే ఈ వారం మెహబూబ్‌ను పంపించేద్దామని ఆడియెన్స్ ప్రిపేర్ అయి ఉన్నారు. నామినేషన్‌లో లేకపోవడంతో మిస్ అయిపోయాడు. మధ్యలో అమ్మ రాజశేఖర్‌ను ఎలిమినేట్ చేసేద్దామనే నిర్ణయానికి కూడా వచ్చారు. చివరి వరకు మాస్టర్, సుజాత ఇద్దరే డేంజర్ జోన్‌లో ఉన్నారు.

గంగవ్వ చెప్పేసింది..
ఆరోగ్యం బాగాలేక బయటకు వచ్చిన గంగవ్వ స్టేజ్‌పై నుంచి ఒక్కొక్కరి గురించి మాట్లాడింది. అందులో భాగంగా సుజాత వంతు వచ్చే సరికి బాంబ్ పేల్చింది. నువ్వే ఎలిమినేట్ అవుతావని నాకు అనిపిస్తుందే సుజాత అని చెప్పింది. ఆ మాట అనడంతోనే సుజాత మొహం మాడిపోయింది.

నీ యవ్వ అంటూ..
గంగవ్వ అలా అనేసరికి సుజాత నీ యవ్వ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. కానీ ఏం లాభం. జరిగే నష్టం జరగక మానదు. మొత్తానికి గంగవ్వ చెప్పిన జోష్యం ఫలించినట్టుకనిపిస్తోంది. సుజాత ఎలిమినేట్ అయినట్టు లీకులు ఇప్పటికే హోరెత్తిస్తున్నాయి.
Recommended Video

బయటకు వచ్చాక..
అయితే ఎలిమినేట్ అయిన సుజాత బయటకు వచ్చాక ఎవరిపై ఎలాంటి కామెంట్లు చేస్తుందో చూడాలి. ఈ సారి ఎలాంటి బిగ్ బాంబ్ ఉంటుందో? అది ఎవరి మీద వేస్తుందో చూడాలి. మొత్తానికి ఇప్పటి వరకు వచ్చిన ప్రోమోలను బట్టి ఈ సండేను ఫండే చేసేందుకు నాగ్ ఫుల్ జోష్‌లో ఉన్నట్టు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











