హీరోయిన్‌తో ప్రేమాయణం.. కుక్కతో పోల్చడంతో బ్రేకప్.. అఖిల్ అసలు స్టోరీ చెప్పిన గంగవ్వ

బిగ్‌బాస్ షో నాల్గో సీజన్‌లో అఖిల్‌ది కాస్త డిఫరెంట్ మెంటాలిటీ. ఒక్కోసారి అర్థమైనట్టు ఉంటాడు. ఇంకోసారి ఏం చేస్తున్నాడు. ఎందుకు అలా ప్రవర్తిస్తుంటాడో కూడా అర్థం కాదు. పైగా ఒక్క మోనాల్ చుట్టూనే తిరుగుతున్నట్టు మనకు కనిపిస్తోంది. మోనాల్ వల్ల అఖిల్ ఆట గతి తప్పుతోందని కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. ఎలిమినేట్ అయి బయటకు వచ్చిన కంటెస్టెంట్లందరూ కూడా అదే మాట చెబుతున్నారు.

 మోనాల్ చుట్టూనే..

మోనాల్ చుట్టూనే..

అఖిల్ అనే అతని గురించి బిగ్ బాస్ ద్వారా ఎవ్వరికీ ఏమీ తెలియడం లేదు. ఆట సరిగ్గా ఆడటం లేదు.. తనకంటూ ఓ మార్క్‌ను క్రియేట్ చేసుకోలేకపోతున్నాడు. ఇంట్లో ఉన్న ప్రతీ ఒక్కరూ ఏదో రకంగా తమలోని ప్రత్యేకతను చాటుతున్నారు. అఖిల్ మాత్రం మోనాల్ చుట్టూ దేవదాసులా తిరుగుతున్నాడు.

ఆ ఒక్క పాటతో...

ఆ ఒక్క పాటతో...

ఇక మోనాల్ తప్ప వేరే ప్రపంచం లేనట్టుగా బిగ్ బాస్ ఇంట్లో బతికేస్తున్నాడు అఖిల్. ఏమైనా అంటే మొన్న కనిపించావు.. అంటూ ఓ పాట ఎత్తుకుంటాడు. ఆ పాట విని విని ప్రేక్షకులకు బోర్ కొట్టింది. అయితే మోనాల్‌తో కాకుండా అఖిల్ గంగవ్వతో చాలా దగ్గరయ్యాడు. సొంత మనవడిలానే గంగవ్వ కూడా ప్రేమను పంచింది. పైగా ఇంట్లో అందరిలోకెల్లా అఖిల్ అంటేనే ఇష్టమని కూడా గంగవ్వ చెప్పింది.

ఆటలు ఆడడు..

ఆటలు ఆడడు..

అయితే అలాంటి గంగవ్వ అఖిల్‌పై సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. ఇంట్లో నిజాయితీగా ఆడేది ఎవరని గంగవ్వను అడిగితే కుమార్ సాయి అని టక్కున చెప్పేసింది. నా మనవడు అయినంత మాత్రాన సేవల చేసినంత మాత్రాన అఖిల్‌ను నిజాయితీ పరుడని ఎలా చెబుతాను.. అతను ఆటే ఆడడు.. మోనాల్ చుట్టూనే ఉంటాడు అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది.

 గతంలో హీరోయిన్‌తో..

గతంలో హీరోయిన్‌తో..

అయితే గంగవ్వ దగ్గర అఖిల్ ఎన్నో విషయాలు చెప్పాడట. బయట జరిగిన బ్రేకప్ స్టోరీని కూడా గంగవ్వకు చెప్పాడట. అదే విషయాన్ని గంగవ్వ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఒక హీరోయిన్‌ని అఖిల్ నాలుగేళ్లు పాటు ప్రేమించాడట.. ఇద్దరూ కలిసి తిరిగిన తరువాత పెళ్లి చేసుకుందాం అని ఆమె అందట.

Recommended Video

Case 99 Movie Motion Poster Launch By Director Boyapati Srinu
కుక్కతో పోల్చిందట..

కుక్కతో పోల్చిందట..

ఆ తరువాత ఆమె దగ్గరకు వెళ్తే.. కుక్కని వంకపెట్టి అఖిల్‌ను తిట్టిందట. ఈ కుక్కని ఎన్నిసార్లు వద్దన్నా నన్నే చూస్తుంది అని అఖిల్‌ని వంకపెట్టి ఘోరంగ అవమానించిందట. అలా కుక్కతో పోల్చిందని అప్పుడే ఆమెను అఖిల్ వదిలేశాడట.. హౌస్‌లో నుంచి బయటకు వెళ్లిన తరువాత అఖిల్ పెళ్లి చేసుకుంటాడట అంటూ గంగవ్వ పూస గుచ్చినట్టు చెప్పింది. బయట అఖిల్ తల్లిదండ్రులు కూడా అదే మాట చెబుతున్నారు. బయటకు వచ్చాక పెళ్లి చేస్తాం.. అది ఓ తెలంగాణ అమ్మాయినే అని క్లారిటీ ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X