Bigg boss 4: కరాటే కల్యాణికి దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిన గంగవ్వ.. పిచ్చాసూపత్రి లెక్క చేస్తున్నావ్
ఇండియన్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ 4 ఆదివారం గ్రాండ్ గా మొదలైన విషయం తెలిసిందే. మొదటి రెండు రోజులు కూడా బిగ్ బాస్ ఇచ్చిన చిన్న చిన్న టాస్క్ లతో కంటెస్టెంట్స్ లోని అసలు రంగులు మెల్లమెల్లగా బయటపడుతున్నాయి. ఇక మొదటి వారం స్టార్టింగ్ లోనే కొంత ఎమోషనల్ మూమెంట్స్ మధ్య కంటెస్టెంట్స్ నలిగిపోయరు. ఇక గంగవ్వ కూడా తనలోని షేడ్స్ ని చూపిస్తూ అప్పుడప్పుడు పంచ్ డైలాగ్స్ తో షాక్ ఇస్తున్నారు.

సూర్య కిరణ్ ర్యాప్ సాంగ్..
ముడవరోజు బిగ్ బాస్ హౌజ్ లో ఎక్కువగా ఫన్ క్రియేట్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన ప్రోమో కూడా విడుదల చేయగా అందులో దర్శకుడు సూర్య కిరణ్ ర్యాప్ సాంగ్ తో హౌజ్ లో మంచి వైబ్రేషన్స్ ని క్రియేట్ చేశాడు. దీంతో కంటెస్టెంట్స్ అందరూ కూడా అతనితో కలిసి పాటపడుతూ డ్యాన్స్ చేశారు.

స్కూల్ టీచర్ గా కరాటే కళ్యాణి
ఇక టాస్క్ లో భాగంగా కరాటే కళ్యాణి స్కూల్ టీచర్ అవతారం ఎత్తింది. అందులో ప్రతి ఒక్కరు కూడా కళ్యాణి టైమింగ్ కి తగ్గట్టుగా కౌంటర్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. అయితే గంగవ్వ మాత్రం ఎవరు ఊహించని విధంగా కళ్యాణికి దిమ్మతిరిగేలా తన మాటలతో షాక్ ఇచ్చింది. ఆ డైలాగ్ కి కంటెస్టెంట్స్ కూడా నవ్వేశారు.

గంగవ్వ కౌంటర్ మామూలుగా లేదు
అవ్వ నువ్వు 50ఏళ్ల నుంచి ఇదే స్కూల్ లో ఉంటున్నావ్ అని కళ్యాణి కామెంట్ చేయగా, అవ్వ ఇన్నేళ్ల నుంచి ఫెయిల్ అవుతూనే ఉన్నవా? అని తోటి సభ్యులు సెటైర్స్ వేశారు. అందుకు గంగవ్వ ఈ విధంగా సమాధానం ఇచ్చింది. 'జీతం జీతం బాగానే తీసుకుంటున్నావ్.. అలాగే అందరిని ఫెయిల్ కూడా చేస్తున్నావ్. పిచ్చసూపత్రి లెక్క చేస్తున్నావ్" అంటూ గంగవ్వ ఇచ్చిన సమాధానం కళ్యాణికి మైండ్ బ్లాక్ అయ్యేలా చేసింది. అందుకు సంబంధించిన ప్రోమో కూడా వైరల్ అవుతోంది.
Recommended Video

నామినేషన్ లో గంగవ్వ కూడా..
ఇక అంతకుముందు నామినేషన్ కోసం అభిజిత్, దేతడి హారికని ఉంచినప్పుడు ఇద్దరు కూడా నిన్ననే వచ్చారు. అప్పుడే పంపిస్తారా? ఉండనివ్వండి అంటూ తనదైన శైలిలో గంగవ్వ కామెంట్ చేసి షోకి మంచి హైప్ క్రియేట్ చేసింది. ఇక ఎలిమినేషన్ కోసం నామినేట్ అయిన వారిలో గంగవ్వ కూడా ఉన్నారు. మరి ఈ వారం ఎవరు హౌజ్ నుంచి వెళ్లిపోతారో చూడాలి.


Click it and Unblock the Notifications











