తండ్రి పేరు కూడా మరిచిపోయిందట.. రాత్రి అలా జరగడంతో బయటకు.. హారిక కంటతడి

బిగ్‌బాస్ షోలో ఆరో వారం కాస్త ఎమోషనల్‌గానే సాగుతోంది. టాస్క్‌లో ఈ సారి అంతగా గొడవలు కూడా ఏమీ జరగలేదు. ఇంటి సభ్యులంతా అలా గడిపేస్తున్న సమయంలో అందర్నీ గతంలోకి తీసుకెళ్లాడు బిగ్ బాస్. ప్రతీ సీజన్‌లో ఉన్నట్టుగానే ఈ సారి కూడా చిన్న నాటి మెమోరీస్‌ను చూపించాడు బిగ్ బాస్. కంటెస్టెంట్లకు సంబంధించిన చిన్న నాటి గుర్తులను ఫోటోలను చూపెట్టి ఎమోషనల్ అయ్యేలా చేశాడు. ఇంటి సభ్యుల్లో చాలా మంది కన్నీరుకూడా పెట్టేసుకున్నారు.

ఒక్కొక్కరు ఒక్కోలా..

ఒక్కొక్కరు ఒక్కోలా..


తమ తమ చిన్న నాటి జ్ఞాపకాలను చూసి ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. కొందరు తండ్రి దూరమై ఎమోషనల్ అయితే.. ఇంకొందరు అమ్మ చేసిన త్యాగాలను తలుచుకుని ఎమోషనల్ అయ్యారు. ప్రతీ ఒక్క కంటెస్టెంట్ వెనుక ఓ పెద్ద కథే ఉంది. ఈ క్రమంలో వారి జీవితంలో ఎదురైన కష్టాలను, అనుభవాలను అందరితో పంచుకున్నారు.

హారిక అలా..

హారిక అలా..

హారిక తన కుటుంబ నేపథ్యం గురించి చెబుతూ అందర్నీ ఏడిపించేసింది. నేను ఇంటర్ చదువుతున్నప్పుడు అమ్మ నాన్నలు విడిపోయారు. ఒకసారి అమ్మ ఫోన్ అమ్మమ్మ ఇంటికి రమ్మని చెప్పింది. అమ్మమ్మ ఇళ్లు అనేసరికి చికెన్, మటన్ లాంటివి ఉంటాయి కదా అని సంబరపడుతూ వెళ్లాను అని హారిక చెప్పుకొచ్చింది.

విడిపోతున్నాం..

విడిపోతున్నాం..


అలా హారిక తన అమ్మమ్మ ఇంటికి వెళ్లడంతో అసలు విషయం తెలిసిందట. నేను మీ డాడీ విడిపోతున్నాం.. అన్నయ్య నా దగ్గరే ఉంటాడట. నువ్ మీ నాన్న దగ్గర ఉండు అని చెప్పిందట. అసలే తన కోసం స్పెషల్ రూం డిజైన్ చేయించి పెట్టాడు.. సపరేట్ రూం.. డాడీ అంటే ఇష్టమే కదా అని హారిక ఉండిపోయిందట.

పచ్చడి మెతుకులు..

పచ్చడి మెతుకులు..

అలా ఓ నెల రోజుల పాటు డాడీ దగ్గరే ఉన్నాను. నెల రోజుల పాట పచ్చడన్నం మాత్రమే తిన్నాను. ఓ రోజు రాత్రి కడుపులో గ్యాప్ ఫాం అయితే నేను హాస్పిటల్‌కు వెళ్ళి ఇంజక్షన్ వేయించుకున్నాను. నాన్న ఆఫీస్ పనితోనే బిజీగా ఉండేవాడు. అలా జరగడంతో అమ్మ తన వద్దకే రమ్మని పిలిచిందని హారిక చెప్పుకొచ్చింది.

Recommended Video

Producer Natti Kumar Given Clarity Over దిశ ఎన్‌కౌంటర్ Movie
వెనక్కి తిరిగి చూసుకోలేదు..

వెనక్కి తిరిగి చూసుకోలేదు..

అలా నాన్న దగ్గరి నుంచి వచ్చి ఐదేళ్లు అవుతోంది. చాలా దూరం వెళ్లిపోయాం.. ఇన్నేళ్లలో మీరు వెనక్కి తిరిగి చూడలేం.. మేం కూడా చూడలేదు.. ఎప్పుడు చూస్తారో అప్పుడు ఆగిపోతాం అంటూ హారిక ఎమోషనల్ అయింది. బిగ్ బాస్‌లోకి వచ్చేటప్పుడు మనం మన డీటేల్స్ నింపాలి కదా అందులో తండ్రి పేరు అని చూసి ఒక్కసారిగా ఆగిపోయాను. నాకు అసలు మా నాన్న పేరు కూడా గుర్తుకు లేదు. ఇక తనకు అన్నీ తన అమ్మేనని చెప్పుకొచ్చింది. అన్నయ్య గురించి చెబుతూ.. తనను తండ్రిలా చూసుకుంటాడని ఎమోషనల్ అయింది. నాన్న .. ఎక్కుడున్నా హ్యాపీగా ఉండాలి అంటూ హారిక కోరుకుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X