ఓహో చివరకు అలా జరిగిందా?.. ఆ నలుగురిలో కెప్టెన్ ఎవరో మరి!!
బిగ్‌బాస్ షోలో నాల్గో వారం మంచి రసవత్తరంగా సాగుతోంది. కెప్టెన్సీ కోసం మొదటి సారిగి ఫిజికల్ టాస్క్ ఇవ్వడంతో అందరూ రెచ్చిపోతున్నారు. కిల్లింగ్ కాయిన్స్ అంటూ ఇంటి సభ్యుల మధ్య చిచ్చు పెట్టేందుకు బిగ్ బాస్ బాగానే ప్రయత్నించాడు. అందులో కొద్ది వరకు బిగ్ బాస్ సఫలమయ్యాడు. అమ్మ రాజశేఖర్, మెహబూబ్, సోహెల్ మధ్య విబేధాలు వచ్చాయి. అప్పటి వరకు కలిసున్న ఈ ముగ్గురి మధ్య బేదాభిప్రాయాలు వచ్చాయి. ఇక ఈ టాస్క్ నిన్నటి ఎపిసోడ్‌లో రెండో దశలోకి అడుగుపెట్టింది. నేటితో ఈ కెప్టెన్సీ టాస్క్ ముగియనున్నట్టు తెలుస్తోంది.

మొదటి దశలో..
కాయిన్స్ సేకరించడం, భద్రపర్చడంలో కంటెస్టెంట్లందరూ తలమునకలయ్యారు. పైనుంచి పడుతున్న కాయిన్స్ ఏరడంతో ఎంతో మంది కిందపడ్డారు. దెబ్బలు తాకాయి. అయినా లెక్క చేయకుండా కాయిన్స్ సేకరించారు. ఇక అవి దొంగల పాలు కాకుండా కాపాడుకోవడానికి పడ్డ కష్టం ఒకెత్తు. రాత్రంతా నిద్ర పోకుండా సోహెల్, మెహబూబ్ ఇద్దరూ దొంగతనాలు చేశారు.

రెండో దశలో అలా..
అయితే రెండో దశలో టాస్క్ మరో టర్న్ తిరిగింది. ఆరు వేలకు పైగా విలువైన కాయిన్స్ సేకరించి అందరి కంటే ముందు వరుసలో సోహెల్ ఉన్నాడు. ఈ రెండో దశలో అందరూ కలిసి సోహెల్‌ను టార్గెట్ చేసినట్టు కనిపిస్తోంది. ఎవరిని అవుట్ చేస్తే వారి దగ్గర నుంచి కాయిన్స్‌లో యాభై శాతం విలువ తగ్గిపోతుందని తెలిపాడు. దీంతో అందరూ సోహెల్ దగ్గర ఎక్కువగా ఉన్నాయని అతడినే టార్గెట్ చేశారు.

చివరి ఘట్టం..
ఇక నేటి ఎపిసోడ్ ఈ టాస్క్ చివరి ఘట్టానికి చేరుకునేలా కనిపిస్తోంది. సామ దాన బేద దండోపాయాలను ఉపయోగించి కాయిన్స్ విలువను పెంచుకోవచ్చని బిగ్ బాస్ తెలిపాడు. దీంతో కొందరు బతిమిలాడగా, ఇంకొందరు ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసినట్టు కనిపిస్తోంది. మొత్తానికి ఓ నలుగురు మాత్రం కెప్టెన్సీ టాస్క్‌కు అర్హత సాధించారు.
Recommended Video

ఆ నలుగురి మధ్యే..
హారిక, అమ్మ రాజశేఖర్, సుజాత, కుమార్ సాయిలు కెప్టెన్సీ టాస్క్‌కు పోటీ పడ్డట్టు తెలుస్తోంది. ఈ మేరకు బురదలో బాగానే పొర్లుతున్నారు. అందులో కాయిన్స్ ఏరడంతో అందరూ బిజీగా ఉన్నారు. అయితే సుజాత కుమార్ సాయితో స్విచ్ అయిన కారణంగా ఈ ఇద్దరూ కెప్టెన్సీ పోటీలకు వచ్చారని తెలుస్తోంది. సోహెల్, మెహబూబ్ ఇద్దరూ కూడా తమ కాయిన్స్‌ను అమ్మ రాజశేఖర్‌కు ఇచ్చినట్టు అర్థమవుతోంది. అయితే హారికకు ఎవరెవరు కాయిన్స్ ఇచ్చారో చూడాలి.


Click it and Unblock the Notifications











