Don't Miss!
- News కాంగ్రెస్ లో చేరిక పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే బిగ్ ట్విస్ట్..!!
- Technology ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- Sports ఆర్సీబీ తుది జట్టు అంచనా
- Finance Tata Sons IPO: టాటా సన్స్ ఐపీఓ వస్తుందా.. రాదా..!
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Automobiles హ్యుందాయ్ ఎక్స్టర్ దిమ్మ తిరిగే మైలేజ్.. ఓనర్ ఫుల్ ఖుష్.. ఫొటోలతో సహా ప్రూఫ్ ఇదిగో.!!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
అతి చేయాలని చూసింది కెమెరాకు చిక్కింది.. హారిక అలా దొరికిపోయింది!!
బిగ్ బాస్ షోలో హారిక తనకు ఏది అనిపించినా సరే ఏదో ఒక కెమెరా వద్దకు వెళ్లి తన గోడును చెప్పుకుంటుంది. సంతోషంగా ఉన్నా సరే కెమెరాలతో పంచుకుంటుంది. టాస్కుల్లో ఏదైనా తప్పు దొర్లినా, ఎవరైనా తప్పు చేసినట్టు అనిపించినా బిగ్ బాస్‌తో కెమెరాల ద్వారా చెప్పుకుంటుంది. హోటల్ టాస్క్‌లోనూ అలానే చేసింది. నామినేషన్ విషయంలో అభిజిత్ హారిక మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నించిన బిగ్ బాస్‌ను కూడా నిందించింది.
హోటల్ టాస్క్‌లో తన వద్ద ఉన్న స్టార్స్ అన్నింటిని అభిజిత్ తీసుకోవడంతో అది తప్పని వారించింది. ఇష్టపూర్వకంగా ఒక్కటే స్టార్ ఇచ్చానని కెమెరాల ముందుకు వెళ్లి పదే పదే చెప్పింది. మా ఇద్దరి మధ్య నామినేషన్స్ పెట్టడం అన్యాయం అంటూ బిగ్ బాస్‌ను నిందిస్తూ కెమెరాల ముందు ఏడ్చేసింది. ఇక నిన్నటి ఓ టాస్క్‌లోనూ ఇలానే చేసింది. కానీ అక్కడ తన తెలివి తేటలు ఏంటో బయట పడ్డాయి.
హైజినిక్స్ సంస్థ ప్రోడక్ట్‌ల గురించి బిగ్ బాస్ ఇంట్లో ప్రకటనలు ఇచ్చారు. కరోనా సమయంలో ఎంతో జాగ్రత్త ఉండాలని అందుకే ఇంటి సభ్యులకు హైజీనిక్స్ వారి శానిటైజర్స్, సబ్బులు,టవల్స్ ఇలా అన్ని రకాల ఉత్పత్తులను ఇచ్చారు. ఇది 99.99శాతం క్రిముల చంపుతుందని కెమెరాల ముందు హారిక చెప్పింది. అక్కడి వరకు బాగానే ఉంది. కానీ మిగిలిని ఆ ఒక్క శాతం మనం జాగ్రత్తగా ఉండాలని పెద్ద నీతులు చెప్పింది. కానీ 99.99శాతం క్రిములు చంపాక మిగిలేది.. 0.01శాతమే కానీ ఒక్క శాతం అని హారిక చెప్పడంతో ఇలా అడ్డంగా దొరికిపోయినట్టైంది. బహూషా హారిక కొంచెం లెక్కల్లో వీక్ అనుకుంటా.