మోనల్ ని మైమరపిస్తున్న హారిక.. అభిజిత్ విషయంల్ ఎమోషనల్ లవ్ యాంగిల్
బిగ్ బాస్ హౌజ్ లో సోమవారం నెవర్ బిఫోర్ అనేలా త్యాగాల రచ్చతో కంటెస్టెంట్స్ ఊహించని షాక్ ఇచ్చారు. శనివారం నుంచి సోమవారం వరకు బిగ్ బాస్ షోకి మంచి రేటింగ్ అందుతోంది. గొడవల సంగతి పక్కనపెడితే నామినేషన్ ప్రక్రియ మాత్రం ప్రతి వారం రసవత్తరంగా మారుతోంది. ఇక ఇప్పుడూ త్యాగలతో నామినేట్ అవ్వడం హాట్ టాపిక్ గా మారింది. అయితే హారిక ఈ మధ్య అభి విషయంలో మరో అడుగు ముందుకు వేసి మరో మోనాల్ లా ఆకట్టుకుంటోంది.

ఇరకాటంలో పడేసిన బిగ్ బాస్
నిజంగా బిగ్ బాస్ నామినేషన్ ప్రక్రియలో ఇస్తున్న ట్విస్ట్ లు మామూలుగా ఉండడం లేదు. సోమవారం 10 మందిని జంటలుగా విడిపోయి స్టాండ్ దగ్గర ఉండి ఎవరినో ఒకరిని మీరే నామినేట్ చేసుకోవాలని.. తుది నిర్ణయం మీదే అంటూ పెద్ద షాక్ ఇచ్చారు. ఇక అందులో హారిక అబిజిత్ జంటగా ఉండడం షోపై మరింత బజ్ క్రియేట్ చేసింది.

హారిక కోసం అభి త్యాగం
మిగతా జంటల విషయాన్ని పక్కనపెడితే హారిక మాత్రం మరో మోనాల్ లా మారిపోతున్నట్లు అర్ధమవుతోంది. అభిజిత్ మొత్తానికి హారిక కోసం త్యాగం చేయక తప్పలేదు. ఇక షో మొదట్లో కేవలం గ్లామర్ తో హీటెక్కించిన దేత్తడి హారిక ఇప్పుడు మాత్రం తన లవ్ యాంగిల్ లో ఎట్రాక్ట్ చేస్తోంది. అభిజిత్ పై ఆమె మొదటి నుంచి మంచి రిలేషన్ ని మెయింటైన్ చేస్తోంది. హోటల్ టాస్క్ లో అభి టీమ్ ఒడినప్పుడు కూడా ఆమె అతన్ని కౌగిలించుకొని రొమాంటిక్ గా మాట్లాడిన విధానం అందరిని ఆశ్చర్యపరిచింది.

అబిజిత్ కావాలా? ఫ్యామిలీ కావాలా?
రోజురోజుకు అభి విషయంలో హారిక ఎమోషనల్ ఆవుతున్నట్లు అర్ధమవుతోంది. నామినేషన్స్ అనంతరం అమ్మా రాజశేఖర్ నామినేషన్ ప్రక్రియపై చర్చలు జరిపిన హారిక.. బిగ్ బాస్ నాకు ఫ్యామిలీ కావాలా? అభిజిత్ కావాలా? అనే విధంగా ఇబ్బందుల్లోకు నెట్టేశాడంటూ చెప్పడం చూస్తుంటే అతనిపై ఏ రేంజ్ లో ఎమోషనల్ అవుతుందో అర్థం చేసుకోవచ్చు. ఇక అభి హారిక కోసం త్యాగం చేసిన సీన్ సోమవారం ఎపిసోడ్ లో హైలెట్ గా నిలిచింది.

బిగ్ బాస్ నాకు కూడా ఛాన్స్ ఇవ్వాలి
అబిజిత్ కి ఎలాగైనా మరోసారి తన ద్వారా సహాయం అందాలని హారిక బలంగా కోరుకుంటోంది. అతను నా కోసం త్యాగం చేశాడు కాబట్టి తనకు హెల్ప్ చేయడానికి బిగ్ బాస్ ఛాన్స్ ఇవ్వాలి. లేదంటే అన్ ఫెయిర్ అంటూ హారిక డైరెక్ట్ గా కౌంటర్ ఇచ్చేసింది. చూస్తుంటే త్వరలోనే హారిక అభి మధ్యలో సరికొత్త లవ్ ట్రాక్ మొదలయ్యే అవకాశం ఉన్నట్లు అర్ధమవుతోంది. మరి అభిజిత్ కి హారిక ఎలాంటి సహాయం చేస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











