స్వాతి దీక్షిత్‌‌తో కలిసి అభిజిత్ ఆట.. నా కంటే ఆమె ఎక్కువైందా.. అలిగిన హారిక!

బిగ్‌బాస్ తెలుగు నాల్గో సీజన్‌లో మూడో వారంలో మూడో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా స్వాతి దీక్షిత్ ఇంట్లోకి అడుగుపెట్టింది. వచ్చీ రావడంతోనే ఓ స్ట్రాటజీతో ఆడటం మొదలెట్టింది. ఎవరితో క్లోజ్‌గా ఉంటే స్క్రీన్ స్పేస్ వస్తుంది.. ఎవరి ఉంటో క్రేజ్ వస్తుందో తెలుసుకుంది. మోనాల్-అఖిల్, మోనాల్-అభిజిత్, అభిజిత్-హారిక ట్రాకులను బయటి నుంచి చూసి వచ్చింది. అందుకే స్వాతి ఓ ప్లాన్‌తో వచ్చినట్టుంది. ఆ ఇద్దరితో ఉంటే పుటేజ్ లభిస్తుందని భావించి ఉండొచ్చు.

అందుకే ఆ ఇద్దరితో..

అందుకే ఆ ఇద్దరితో..

ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి అభిజిత్‌ను వదలడం లేదు. అఖిల్‌తోనూ సాధ్యమైనంత సేపు ఉండేందుకు ట్రై చేస్తోంది. ప్రస్తుతం ఉన్న ట్రాకులను డిస్టర్బ్ చేసేందుకు స్వాతి ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తోంది. అందుకే అఖిల్-మోనాల్ మధ్య దూరి ముచ్చట్లు పెడుతోంది. ఈ విషయంలో మోనాల్ కూడా హర్ట్ అయినట్టు కనిపించింది.

టాస్క్‌లొ అభితో..

టాస్క్‌లొ అభితో..

నాల్గో వారం కెప్టెన్సీ టాస్క్ అయిన కిల్లింగ్ కాయిన్స్ ఆటలో అభిజిత్ స్వాతికి అండగా నిలబడ్డాడు. ఈ వారం నామినేషన్‌లో అభి ఉన్నా సరే... స్వాతి కోసం ఆడుతున్నాడు. ఇలా జంటగా ఆడకూడదని చెప్పినా కూడా ఎవ్వరూ వినడం లేదు. అయితే ఇలా అభి స్వాతితో ఉండటంతో హరిక బాగానే ఫీలైంది.

మొదటి రోజు మాటల్లేవ్...

మొదటి రోజు మాటల్లేవ్...

మొదటి రోజు టాస్కులో అభి, స్వాతి అలా క్లోజ్‌గా ఉండటం, కలిసి ఆడటంతో హారిక హర్టైంది. అందుకే ఆరోజు మొత్తం హారిక అభితో మాట్లాడలేదు. తన ఆట తానే ఆడుకుంది. తన కాయిన్స్‌ను తానే కాపాడుకుంది. ఇక నిన్నటి ఎపిసోడ్‌లో తన మనసులో ఉన్న బాధంతా కక్కేసింది. అడగాల్సిన ప్రశ్నలన్నీ అడిగేసి.. అభిని కడిగేసింది.

Recommended Video

Actor Madhunandan Interview Part 2 రాజ్ తరుణ్, హెబ్బాపటేల్ కెమిస్ట్రీ ఓ రేంజ్ లో ఉంటది!!
నా కంటే ఎక్కువైందా?

నా కంటే ఎక్కువైందా?

నువ్ సేవ్ అవుతావనే నమ్మకం ఉందా? అయినా స్వాతికి ఎందుకు ఇస్తాను అని అంటున్నావ్? ఆమెతో కలిసి ఎందుకు ఆడుతున్నావ్? అంటూ హారిక అభిపై ప్రశ్నల వర్షం కురిపించింది. ఆమెతో కలిసి ఆడటానికి ప్రత్యేకమైన కారణాలేవీ లేవని అభి తెలిపాడు. నీతో కలిసి ఆడటం లేదని, నీకు కాయిన్స్ ఇవ్వడం లేదని ఫీల్ అవుతున్నావా? అని అభి తిరిగి ప్రశ్నించాడు. అది కూడా ఓ కారణమే మనం మూడు వారాల నుంచి ఫ్రెండ్స్.. ఆమె వచ్చి మూడు రోజులు కూడా కాలేదు.. నువ్ ఆమెతో కలిసి ఆడటాన్ని తీసుకోలేకపోతున్నానని చెప్పుకొచ్చింది. మొత్తానికి అభి సారీ చెప్పడంతో హారిక కూల్ అయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X