మోనాల్ సిస్టర్ సెటైర్స్.. అభి కంటే ఎక్కువగా హార్ట్ అయిన హారిక.. అఖిల్ పులిహోర డైలాగ్స్

బిగ్ బాస్ హౌజ్ లో కుటుంబ సభ్యుల రాకతో నెవర్ బిఫోర్ ఎమోషన్స్ కనిపించాయి. కంటెస్టెంట్స్ పేరెంట్స్ చాలా వరకు చాలా స్పోర్టివ్ గా తీసుకొని గేమ్ బాగా ఆడండి అంటూ సపోర్ట్ చేయడం విశేషం. శత్రువులు కూడా తల్లి ప్రేమలతో మిత్రులు అవుతారని బిగ్ బాస్ చాలా తెలివిగా సీన్ క్రియేట్ చేశాడు. అయితే గేమ్ లో మళ్ళీ రంగులు మారే అవకాశం లేకపోలేదు. ఇక గురువారం మోనాల్ సోదరి హిమాలి ఇచ్చిన డోస్ కి అందరూ షాక్ అయ్యారు. ముఖ్యంగా అభి చాలా హార్ట్ అయినట్లు అర్ధమయ్యింది.

ఏం జరిగినా ఏడుపే..

ఏం జరిగినా ఏడుపే..

బిగ్ బాస్ షో మొదలైనప్పుటి నుంచి హౌజ్ లో ఎక్కువగా కన్నీటితో కనిపించిన కంటెస్టెంట్ ఎవరంటే మోనాల్ అని చెప్పవచ్చు. మంచి జరిగినా ఏడుపే.. చెడు జరిగినా ఏడుపే.. కోపం వచ్చినా ఏడుపే.. నవ్వొచ్చినా ఏడుపే. ఫైనల్ గా ఏడుపుకు మరో పేరు మోనాల్ అనేలా అనేలా తనకంటూ ఒక బ్రాండ్ సెట్ చేసుకుంది.

అందుకే మోనాల్ కు చివరి అవకాశం

అందుకే మోనాల్ కు చివరి అవకాశం

కుటుంబ సభ్యులను చూసుకునే అవకాశం కల్పించిన బిగ్ బాస్ చివరలో మోనాల్ కి అవకాశం ఇచ్చాడు. అందుకు కారణం కూడా.. ఆమె ఏడిస్తే ఆగదని. తల్లి ఆడియో క్లిప్ వినగానే బాత్రూమ్ లోకి వెళ్లి తలుపులు బాదేస్తూ ఏడ్చేసింది. ఇక కొంత సేపటికి ఆమె సోదరి హిమాలి రావడంతో మళ్ళీఏడ్చేసింది. మిగతా కంటెస్టెంట్స్ ఎవరు కూడా ఆ రేంజ్ లో ఎడవలేదు.

మోనాల్ సిస్టర్ దెబ్బకు అభి షాక్

మోనాల్ సిస్టర్ దెబ్బకు అభి షాక్

ఇక హిమాలి రాగానే అందరిని చాలా కూల్ గా పలకరించింది. కానీ అభిజిత్ విషయంలో మాత్రం ఆమె అసంతృప్తి వ్యక్తం చేసింది. ఏదైనా ఉంటే డైరెక్ట్ గా మాట్లాడు. వెనక ఒకటి ముందు ఒకటి మాట్లాడకు అని చెప్పడంతో అభి ఒక్కసారిగా సైలెంట్ అయ్యాడు. ఆమె అలా మాట్లాడుతుంటే ఏమనాలో కూడా అర్థం కాలేదు.

హార్ట్అయిన హారిక

హార్ట్అయిన హారిక

ఆమె అభిపై సెటైర్స్ వేయడంతో ఎక్కువగా హారిక హార్ట్ అయినట్లు అర్ధమయ్యింది. హిమాలి వెళ్లిపోయిన తరువాత అభి అలాంటి వాడు కాదు అనేలా.. అభి వెనకాల ఏం మాట్లాడతాడో.. ముందు కూడా అదే రిపీట్ చేస్తాడు కదా.. అంటూ అరియానాకు వివరణ ఇచ్చింది. పక్కనే అభిజిత్ కూడా ఆమె మాటలు విన్నాడు. కానీ పెద్దగా రియాక్ట్ అవ్వలేదు.

Recommended Video

Bigg Boss Telugu 4 : Abijeet Getting Support From Pawan Kalyan Fans
మళ్ళీ పులిహోర కలిపిన అఖిల్

మళ్ళీ పులిహోర కలిపిన అఖిల్

ఇక మరోసారి అఖిల్.. మోనాల్ దగ్గర పులిహోర కలుపుతూ కనిపించినట్లు కామెంట్స్ అయితే గట్టిగానే వస్తున్నాయి. మోనాల్ సోదరి అభికి ఝలక్ ఇవ్వగానే మీ సిస్టర్ స్ట్రైట్ ఫార్వార్డ్.. నాకైతే చాలా నచ్చేసింది అంటూ రొటీన్ గా ఇంప్రెస్ చేయడం స్టార్ట్ చేశాడు. మరి అంత స్ట్రైట్ ఫార్వార్డ్ అయిన హిమాలి.. అఖిల్, మోనాల్ బంధం గురించి అడిగినప్పుడు ఏమి పట్టనట్టుగా సమాధానం ఇవ్వకపోవడం విశేషం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X