బిగ్ బాస్4: అత్యదిక రెమ్యునరేషన్ అందుకుంటున్న కంటెస్టెంట్ ఎవరో తెలిసిపోయింది.. చాలా తక్కువే
బిగ్ బాస్ నాలుగవ సీజన్ నాగార్జున హోస్టింగ్ తో గ్రాండ్ గానే మొదలైంది. గడిచిన మూడు సీజన్స్ కంటే కూడా ఈ సారి హౌజ్ లో డిఫరెంట్ టాస్క్ లు క్రియేట్ చేశారు. ఇక డిఫరెంట్ కంటెస్టెంట్స్ హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే ఈ బిగ్ బాస్ నిర్వాహకులకు ఈ సారి ఒక విషయంలో చాలా డబ్బులు సేవ్ అయ్యాయి. ఒక విధంగా అది జాక్ పాట్ అనే చెప్పాలి. ముఖ్యంగా కంటెస్టెంట్స్ కి ఇచ్చే ఫీజులు ఈ సారి చాలా తక్కువ కావడం విశేషం.

బిగ్ బాస్ సెట్ చాలా కాస్ట్లీ..
బిగ్ బాస్ హౌజ్ కోసం మాత్రం ఈ సారి అత్యంత జాగ్రత్తలు తీసుకొని సెట్ ని చాలా కాస్ట్లీ గా రూపొందించారు. దీంతో అక్కడే కొంచెం ఎక్కువగా ఖర్చయ్యింది. ఇక నాగార్జున రెమ్యునరేషన్ విషయానికి వస్తే ఎపిసోడ్ కి 16లక్షల వరకు ఛార్జ్ చేస్తున్నట్లు సమాచారం. ఇక ఆ తరువాత కంటెస్టెంట్స్ కి చాలా తక్కువనే ఇస్తున్నారని తెలుస్తోంది.

ఎవరు కూడా అంత పెద్ద స్టార్స్ కాదని..
అసలైతే ఈ సారి బిగ్ బాస్ హౌజ్ లోకి అడుగు పెట్టిన వారిలో ఎవరు కూడా అంత పెద్ద స్టార్స్ కాదని ఓ వర్గం నెటిజన్స్ నుంచి కామెంట్స్ వచ్చాయి. కరోనా వైరస్ కారణంగా ఇంటిపట్టునే ఉంటారు కాబట్టి ఎలాగైనా టీవీలకు అతుక్కుపోతారని నిర్వాహకులు కాస్త తెలివిగా ఆలోచించినట్లు తెలుస్తోంది. లాస్య, దేవి నగవల్లి, డెత్తడి హారిక, గంగవ్వ తప్పితే అందులో ఎవరు కూడా జనాల్లో అంతగా క్రేజ్ తెచ్చుకున్న వారు కాదు.

రెమ్యునరేషన్ లో పొదుపు
చాలా వరకు కొంతమంది తక్కువ ఫేమ్ ఉన్న సెలబ్రెటీలు కేవలం బిగ్ బాస్ 4లోకి వస్తే చాలని అనుకుంటారు. ఇక్కడ క్రేజ్ అందుకొని సినిమా ఇండస్ట్రీలో కాస్త బిజీ అవ్వాలని అనుకుంటారు. అందుకే వారు రెమ్యునరేషన్ విషయాన్ని పెద్దగా పట్టించుకోరు. ఇక బిగ్ బాస్ యాజమాన్యం కూడా చాలా తక్కువ ఎమౌంట్ తో సరిపెడుతోంది.

అందరికంటే ఎక్కువగా ఆమెకే..
ఇక కంటెస్టెంట్స్ లలో యాంకర్ లాస్యకు ఈ సారి అంధరికంటే ఎక్కువ రెమ్యునరేషన్ అందుతోందని సమాచారం. గతంలో యాంకర్ గా ఎంతగానో క్రేజ్ అందుకున్న లాస్య చాలా రోజుల తరువాత బుల్లితెరపై కనిపిస్తుండడం కొంత స్పెషల్ అని చెప్పాలి. ఇక రోజు ఆమెకు లక్షకు పైగానే ఫీజు చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది.
Recommended Video

గంగవ్వకు ఎంత ఇస్తున్నారంటే..?
ఇక లాస్య తరువాత దేవి నాగవల్లి, డెత్తడి హారిక, అమ్మా రాజశేఖర్, మోనాలి గజ్జర్ వంటి సెలబ్రెటీలకు వారానికి ఒక ప్యాకేజ్ అని డీల్ సెట్ చేశారట. ఇక కెరీర్ లో మొదటిసారి గంగవ్వ ఈ బిగ్ బాస్ షో ద్వారా భారీ రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లు సమాచారం. ఆమెకు వారానికి 3 నుంచి 4లక్షల వరకు ఇస్తున్నట్లు టాక్.


Click it and Unblock the Notifications











