వెళ్లిపోతానంటూ వేడుకున్న గంగవ్వ.. కన్నీరుమున్నీరవుతున్న ఇంటి సభ్యులు
బిగ్‌బాస్ షోలో అందరూ ఇమడలేరు. ఒక్కొక్కరు ఒక్కో ప్రాంతం, ఒక్కో నేపథ్యం నుంచి వస్తారు. మామూలుగా యంగ్ ఏజ్ వాళ్లు ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొంటారు. అయితే మధ్య వయస్కులు, ముసలివాళ్లు ఆ వాతావరణాన్ని భరించలేదు. అలాంటిది గంగవ్వ లాంటి వాళ్లు ముప్పై రోజులకు పైగా ఇంట్లో ఉన్నారంటే అది గొప్ప విషయమే. తాజాగా గంగవ్వపై వచ్చిన ఓ ప్రోమో, ఆ వ్యథ, బాధను అంతా కళ్లకు కట్టినట్టు చూపించింది. ఇంటి సభ్యులందరూ గంగవ్వ పరిస్థితి చూసి కన్నీరు పెట్టుకున్నారు.

మొదటి నుంచి అంతే..
గంగవ్వ స్పెషల్ కంటెస్టెంట్ అని ఆమెను బాగా చూసుకోవాలని ఇంటి సభ్యులందరికీ మొదట్లో సూచించాడు నాగార్జున. అలా చెప్పడంతో పోటీ పడీ మరి గంగవ్వ చుట్టూ ఈగల్లా చేరిపోయారు. గంగవ్వకు సేవలు చేసేందుకు ముందుకు వస్తుంటారు. అయితే అందులో గంగవ్వపై ప్రేమ ఉందో సింపతీ కోసమో? ఓట్ల కోసమో తెలీదు గానీ అందరూ గంగవ్వ చుట్టూ ఉంటారు.

గంగవ్వ ఆరోగ్యం..
గంగవ్వ ఆరోగ్యం ఎప్పుడూ కూడా స్థిమితంగా లేదు. మొదటి వారంలో గంగవ్వ ఆరోగ్యం తేడా కొట్టింది. అయితే బిగ్ బాస్ ఇచ్చిన ధైర్యం, వైద్యులు అందించిన సేవలతో మళ్లీ హుషారైంది. ఫిజికల్ టాస్కులు కాకపోయినా మాటల వరకు గంగవ్వ బాగానే పార్టిసిపేట్ చేసింది.

పడని వాతావరణం..
గంగవ్వకు మొదటి నుంచి బిగ్ బాస్ ఇంటి వాతావారణం పడటమే లేదు. మొదటి నుంచి గంగవ్వ అదే మొత్తుకుంటోంది. ఈ ఏసీ గదులు, ఈ వాతావరణం పడటం లేదని తన గోడును వెల్లిబుచ్చికుంటోంది. మధ్యలో తీవ్రంగా అనారోగ్యానికి గురైంది. మళ్లీ సెట్ అయింది. అయితే ఈ సారి మాత్రం అది భరించలేనంతగా పెరిగిపోయినట్టుంది.

వెళ్లిపోతానంటూ..
ఇక తన వల్ల కాదు ఇంకో రెండు వారాలు ఉండాలని అనుకున్నాను కానీ ఉండలేకపోతున్నాను అంటూ గంగవ్వ ఏడ్చేసింది. డాక్టర్లు ఇచ్చిన సర్టిఫికెట్లు పట్టుకున్న నాగ్.. గత వారం నుంచి గంగవ్వకు ఆరోగ్యం బాగా లేదు,.. వెళ్లడానికి పర్మిషన్ ఇస్తారా బిగ్ బాస్ అంటూ అడిగేశాడు.
Recommended Video
కన్నీరుపెట్టేశారు..
గంగవ్వపై ప్రోమో రాకముందే మ్యాటర్ లీకైంది. గంగవ్వ బిగ్ బాస్ ఇంటి నుంచి బయటకు వచ్చిందన్న వార్త వైరల్ అయిపోయింది. అయితే గంగవ్వ బయటకు వెళ్లిపోతోందన్న వార్త తెలిసిన ఇంటి సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. గంగవ్వ ఇంటి నుంచి బయటకు వెళ్లే సమయంలో నోయల్, అఖిల్, హారిక, సుజాత, లాస్య లాంటి వాళ్లు భోరున ఏడించినట్టు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











