అతను ఆరిపోయే దీపం.. అభికి షాక్ ఇచ్చిన అరియానా.. పెరిగిన శత్రువుల సంఖ్య
తెలుగు బిగ్ బాస్ షోకి నాగార్జున ఇచ్చే బూస్ట్ మామూలుగా ఉండదు. వీక్ డేస్ లో ఎలా ఉన్నా కూడా.. శని, ఆదివారాలకు వచ్చేసరికి ఒక్కసారిగా షో వాతావరణం మారిపోతుంది. కసితో ఉన్న వారిని కూడా కూల్ గా మార్చేసే హోస్ట్ నాగార్జున ఫ్రెండ్లిగా ఉన్న వారి మధ్యలో కూడా తెలివిగా ఫైర్ పెట్టేస్తున్నారు. ఫైనల్ గా షోకి హైప్ క్రియేట్ చేయడంలో ఆయన స్టైలే వేరని నిరూపిస్తున్నారు. ఇక శనివారం ఎపిసోడ్ లో కూడా వెలిగే దీపం, ఆరిపోయే దీపం అంటూ ఒక న్యూ గేమ్ తో ఆకట్టుకున్నారు.

ఆరిపోయే దీపం.. వెలిగే దీపం
దీపావళి ఫెస్టివల్ సందర్భంగా హౌజ్ లో కంటెస్టెంట్స్ కి ఒక కొత్త మైండ్ గేమ్ ఆడించారు నాగార్జున. కంటెస్టెంట్స్ మనస్సుల్లో ఉన్న అసలైన ఆలోచన ఏంటి? ఎవరు హౌజ్ నుంచి బయటకు వెళ్లిపోవాలని అనుకుంటున్నారు అనే విషయంలో క్లారిటీ రావడానికి నాగార్జున ఆరిపోయే దీపంను ఆసరాగా చేసుకున్నారు. ఎవరైనా ఆరిపోయే దీపం ఇస్తే వారిని ఇరకాటంలో పెట్టేస్తున్నారు.

మొదట అరుయానాపై అభి కన్ను
వెలిగే దీపం ఎవరు? ఆరిపోయే దీపం ఎవరు? అని నాగార్జున మొదట అభిజిత్ ని అడుగగా.. రిలేషన్ షిప్ లో అయితే అరియానాతో ఆరిపోయే విధంగా ఉంటుందని అన్నాడు అభి. అయితే అరియానా వెళ్లిపోవాలని అనుకుంటున్నవా అని అడుగగా.. అది అర్థం కాక అరియానాకు ఇచ్చానని చెప్పాడు అభి. వెంటనే మళ్ళీ వెనక్కి తీలుకుంటున్నానని చెబుతూ అతను అందరు ఊహించినట్టుగానే అమ్మా రాజశేఖర్ కు ఇచ్చారు.

మాస్టర్ తో గొడవ.. అందుకే ఆరిపోయే దీపం
మాస్టర్ కు నాకు అస్సలు పడటం లేదు. ఆయన ఒకరు చెప్పింది వినరు. తను చెప్పిందే కరెక్ట్ అంటారు. 30ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉంటున్నారు. కానీ ఎదుటివారు ఎందుకు చెబుతున్నారు అనే దాని గురించి మాత్రం కొంచెం కూడా ఆలోచించరు. అది నాకు అస్సలు నచ్చడం లేదు అని అభి మళ్ళీ ఎప్పటిలానే అదే సమాధానం ఇచ్చాడు. ఇక వెలిగే డీఓమ్ మాత్రం మోనాల్ అని చెప్పాడు.

అభికి షాక్ ఇచ్చిన అరియానా
ఇక అరియానా కూడా అభిజిత్ కి ఊహించని షాక్ ఇచ్చింది. అతను ఆరిపోయే దీపం ఇవ్వాలని అనుకున్నట్లు అప్పటికే అర్ధమయ్యింది. ఇక అభి సేఫ్ గేమ్ ఆడదామని అనుకుంటాడు గాని అస్సలు ఆడలేడని ఆన్సర్ ఇచ్చింది. ప్రతిసారి గివ్ అప్ అనేస్తాడాని అంటూ.. టాస్క్ లో ఉన్నప్పుడు దాన్ని మధ్యలో వదిలెయ్యకుండా ఫినిష్ చేయడమే తగిన న్యాయం అని అరియానా.. అబిజిత్ కి ఆరిపోయే దీపం ఇచ్చింది.

పెరుగుతున్న శత్రువుల సంఖ్య
ఇక అభిజిత్ గత రెండు వారాలుగా తన శత్రువుల సంఖ్యను పెంచుకుంటున్నాడా అనే సందేహాలు కుడా ఎక్కువవుతున్నాయి. సేఫ్ గేమ్ ఆడాలని అనుకుంటూ నెగిటివ్ అవుతున్నాడనే కామెంట్స్ వస్తున్నాయి. ఇక అభి తీరుపై నిత్యం సపోర్ట్ చేసే హారిక కూడా అతను చేసింది కరెక్ట్ కాదని నాగార్జున ముందే చెప్పేసింది. అఖిల్ అతనితో ఎప్పుడు బావుంటాడో తెలియదు. అమ్మా, అవినాష్ తో పాటు అరియానా కూడా అఖిల్ పై అసంతృప్తితో ఉండడం హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ రోజు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.


Click it and Unblock the Notifications











